Kala Sarpa Dosha Pariharam: జాతక చక్రంలో కాలసర్ప దోషం ఉందని తెలిసిన వెంటనే ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదు. ఈ దోషం ప్రధానంగా మనిషిలోని మానసిక దుర్బలత్వాన్ని, చంచలత్వ స్వభావాన్ని సూచిస్తుంది. సరైన వాస్తవాలు గ్రహించి, దైవచింతన, జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా దీని దుష్ప్రభావాల నుంచి ఉపశమనం పొందవచ్చు.
కాలసర్ప యోగంలో ముఖ్యమైన రకాలు
రాహువు, కేతువుల గ్రహ స్థానాల ఆధారంగా ఈ యోగాన్ని రెండు ప్రధాన రకాలుగా వర్గీకరిస్తారు.
సవ్య కాలసర్ప యోగం: రాహువు లగ్నంలోనూ, కేతువు సప్తమ స్థానంలోనూ ఉండి, మిగిలిన ఏడు గ్రహాలు ఈ రెండింటి మధ్య బందీలై ఉంటే దానిని సవ్య కాలసర్ప యోగం అంటారు.
అపసవ్య కాలసర్ప యోగం: దీనికి విరుద్ధంగా కేతువు లగ్నంలో, రాహువు సప్తమ స్థానంలో ఉండి, మిగతా ఏడు గ్రహాలు వీటి మధ్యలో ఉంటే దానిని అపసవ్య కాలసర్ప యోగం అంటారు.
దోష ప్రభావం తొలగిపోయే సందర్భాలు
జాతకంలో రాహు-కేతువులు తమ ఉచ్చ స్థానాలైన వృషభం, వృశ్చిక రాశులలో ఉన్నా లేదా వారి స్వక్షేత్రాలైన కర్కాటకం, మిథునం, ధనుస్సు, కన్య, మీన రాశులలో ఉన్నా ఈ దోష ప్రభావం పూర్తిగా తొలగిపోతుంది
12 రకాల దోషాలు - ప్రభావాలు
జాతక చక్రంలోని 12 స్థానాల ఆధారంగా ఈ దోషాలు 12 రకాలుగా ఉంటాయి.
అనంత దోషం (1వ స్థానం): శారీరక, మానసిక సమస్యలతో పాటు స్పష్టమైన లక్ష్యలేమి ఏర్పడుతుంది.
వాసుకి దోషం (3వ స్థానం): మానసిక దుర్బలత్వం పెరిగి, ఇతరులపై ఉన్న నమ్మకం సడలుతుంది.
తక్షక దోషం (7వ స్థానం): భార్యాభర్తల మధ్య విభేదాలు, వివాహపరమైన సమస్యలు ఉత్పన్నమవుతాయి.
ఘటక దోషం (10వ స్థానం): ఉద్యోగంలో ఒడిదొడుకులు ఎదురవుతాయి, ఎంత కష్టపడినా తగిన గుర్తింపు లభించదు.
ఇవే కాకుండా ఇతర స్థానాలను బట్టి ఆర్థిక, కుటుంబ, ఆరోగ్య పరమైన ఇబ్బందులు కూడా రావచ్చు.
పరిష్కార, నివారణ మార్గాలు
ఈ దోషం ఉందని ఆందోళన చెందకుండా కొన్ని నివారణ చర్యలు పాటించడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చు. రాహు-కేతువులకు ప్రత్యేక శాంతి పూజలు చేయించుకోవడం మంచిది. అలాగే నిత్య జీవితంలో భక్తిభావం అలవర్చుకుని, ప్రతిరోజూ 'సుబ్రహ్మణ్యాష్టకం' పఠించడం వల్ల ఈ దోష తీవ్రత తగ్గి మానసిక ప్రశాంతత చేకూరుతుంది.
(గమనిక: ఇక్కడ పొందుపరిచిన సమాచారం కేవలం కొందరు జ్యోతిష్క్యులు, పండితుల నుంచి సేకరించిన సమాచారం మాత్రమే. దీన్ని పాటించే ముందు మీ దగ్గర్లోని జోతిష్య్కున్ని సంప్రదించడం మేలు. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.)
Also Read: 2027 వరకు శని అనుగ్రహం.. ఈ రాశుల వారికి డబ్బు, ఉద్యోగం, ఆస్తి విషయంలో శుభఫలితాలు!
Also REad: సెప్టెంబర్ 26 వరకు బుధాదిత్య రాజయోగం ఎఫెక్ట్.. ఈ 3 రాశులకు ఊహించని లాభాలు, బిగ్ జాక్‌పాట్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook