karthika masam 2026 Salagrama donation significance: కార్తీక మాసం అనేది దేవుళ్లకు అత్యంత ప్రీతికరమైన మాసం. ఈనెలలో మనం చేసే పూజలు, వ్రతాలు,దానాలు వెయ్యిరెట్ల గొప్ప ఫలితాల్ని ఇస్తాయి. ముఖ్యంగా నవంబర్ 20 నుంచి 23 వరకు దశమి నుంచి పౌర్ణమి వరకు ఐదురోజుల్ని చాలా మంచి రోజులని చెబుతారు. అనాదీగా కార్తీక మాసంలో శివ,కేశవుల్ని బేధాలు లేకుండా పూజించుకుంటారు. ప్రతి రోజు బ్రాహ్మీమూహుర్తంలో లేచి దీపాలు వెలిగిస్తారు.
ఈ నెలలో ఉసిరి దీపదానం, 365 గుత్తిదీపాల ఆరాధన, కుష్మాండ దానం, నదీస్నానం, వనభోజనం, సత్యనారాయణ వ్రతాలు, సాలగ్రామదానాలు మొదలైనవి చేయాలని పండితులు చెబుతుంటారు. ఈ నెలలో ఉసిరి చెట్టు, తులసీకి వివాహలు జరిపించాలి. అదే విధంగా కార్తీక పౌర్ణమి రోజున శివాలయంలో జ్వాలాతోరణం, శివకళ్యాణంను నిర్వహించాలని పెద్దలు చెబుతుంటారు. అయితే.. కార్తీక మాసంలో అన్ని దానాల్లో కంటే సాలగ్రామ చాలాశ్రేష్టమైనదని కార్తీక పురాణం చెబుతుంది.
సాలగ్రామాల విశిష్టత..
సాలగ్రామాలు సాక్షాత్తూ శ్రీ మహావిష్ణు స్వరూపంగా చెప్తారు. సాలగ్రామాలు ఎక్కువగా నేపాల్ లోని గండకినదిలో ఎక్కువగా లభిస్తాయి. దీనిలో వివిధ ఆకారాల్లో సాలగ్రామాలు లభిస్తాయి. అయితే సాలగ్రామాల్ని కేవలం పురుషులు మాత్రమే పండితులకు దానంగా ఇవ్వాలి. దీనికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఎవరైతే నిత్యం పూజ కర్మనుష్టాలు నిర్వహిస్తారో అలాంటి పండితులకు మాత్రమే సాలగ్రామం దానంగా ఇవ్వాలి. సాలగ్రామంకు రోజు పూజలు, అర్చనలు,నైవేద్యం తప్పనిసరిగా మడితో చేయాలి.
అందుకే ముందుగా మీరు దానంగా ఇవ్వాలనుకుంటున్న పండితుడు ఇవన్నిచేయగలడా తెలుసుకుని మాత్రమే వారికి సాలగ్రామం దానంగా ఇవ్వాలి. అంతే కాకుండా సాలగ్రామంను దానంగా ఇచ్చే క్రమంలో తొలుత ఒక శుభ్రమైన స్టీల్ లేదా రాగి, ఇత్తడి శక్తి ప్రకారం కొత్త పాత్రను కొనుగోలు చేసి దానిలో తమలపాకు పెట్టాలి. దానిపైన గంధం, తెల్లని పువ్వులు, వేయాలి. దానిమీద సాలగ్రామం పెట్టి గంధలో అలంకరించి, వస్త్రాం, పుష్పంను పెట్టాలి.తులసీని సమర్పించాలి.
ఆ తర్వాత యోగ్యుడైన పండితుడికి కార్తీక దామోదర ప్రీత్యర్థం అని సంకల్పం చెప్పించుకుని ఉసిరి చెట్టు నీడలో లేదారావిచెట్టు నీడలో వెళ్లి పండితుడికి యథాశక్తి దక్షిణ తాంబూల సహితంగా మగవాళ్లు సాలగ్రామంను దానంగా ఇవ్వాలి. ఈ విధంగా సాలగ్రామం దానం చేస్తే ఆ ఇంటి యజమానికి కోటి యజ్ఞాలు, గోదానాలు చేసినంతపుణ్యం ప్రాప్తిస్తుందని పండితులు చెబుతుంటారు. (గమనిక- ఈ స్టోరీ కేవలం నమ్మకం, విశ్వాసాలపై మాత్రమే ఆధార పడి ఉంటుంది. జీ తెలుగు మీడియా దీనికి బాధ్యత వహించదు..)