Karthik Masam: కార్తీక మాసంలో తులసీ వివాహం విశిష్టత.. ఏ రోజున చేయాలి..?..
Tulasi Vivah rituals: ద్వాదశి నుంచి కార్తీక పౌర్ణమి వరకు తులసీ వివాహంను చేసుకుంటే అనేక శుభయోగాలు కల్గుతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. దీని వల్ల పెళ్లిలో ఆటంకాలు కల్గితే అవి కూడా దూరమౌతాయని పెద్దలు చెబుతుంటారు.
Karthika masam 2026 tulasi vivah date rituals: మనకు ఉన్న తెలుగు మాసాల్లో కార్తీక మాసం అనేది అత్యంత పవిత్రమైనదని పెద్దలు చెబుతారు. ఈ మాసంలో మనం చేసుకునే పూజలు, వ్రతాలు అన్ని కూడా వెయ్యి రెట్ల గొప్ప ఫలితాలు ఇస్తాయి. మనం కార్తీకమాసంను ప్రస్తుతం నవంబర్ 10 నుంచి డిసెంబర్ 8 వరకు జరుపుకుంటాం. చాలా మంది కార్తీక మాసంలో తులసీ వివాహంను నిర్వహిస్తారు. శ్రీకృష్ణుడికి, తులసీకి మధ్య వివాహం పండితులు చేయిస్తారు. ముఖ్యంగా ప్రభోదిని ఏకాదశి తర్వాత రోజు నుంచి తులసీ వివాహాల్ని జరుపుకొవడం ఆనవాయితీగా ఆచరిస్తు వస్తున్నాం.
నవంబర్ 22 ద్వాదశి,23 త్రయోదశి, వైకుంఠ చతుర్దశి, 24 న కార్తీక పౌర్ణమిని మనం జరుపుకుంటాం. ఈ ఐదు రోజుల్లో తులసీ వివాహంను జరిపించడం వల్ల అనేక శుభయోగాలు ప్రాప్తిస్తాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. అంతే కాకుండా చాలా వరకు ద్వాదశి, పౌర్ణమి తిథుల్లో తులసీ వివాహం నిర్వహించడం వల్ల పెళ్లిళ్లలో వస్తున్న ఆటంకాలు, విఘ్నాలు దూరమౌతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
మరోవైపు కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద దీపారాధన చేయాలి. పండితులకు యథాశక్తి ప్రకారం దాన ధర్మాలు చేయాలి. నదీస్నానం ఈ నెలలో చేస్తే తెలిసి,తెలియక చేసిన పాప కర్మల నుంచి విముక్తి లభిస్తుంది. చాలా మంది గురుబలం లేక పొవడం వల్ల పెళ్లిళ్లు తొందరగా కుదరక ఇబ్బందులు ఎదుర్కొంటారు.
ఇలాంటి వారు శ్రీకృష్ణుడికి, తులసీకి శ్రధ్దా భక్తులతో వివాహం నిర్వహిస్తే అన్ని రకాల విఘ్నాలు పోయి సకల శుభాలు ప్రాప్తిస్తాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. మంచి పండితులను పిలిపించుకుని వారి సూచనల ప్రకారం తులసీ వివాహంను భక్తి శ్రద్దలతో, యథా శక్తి షోడషోపచారాలతో నిర్వహించుకొవాలి. తులసీ వివాహం బ్రాహ్మీమూహుర్తంలో లేదా సాయంత్రం ప్రదోష సమయాల్లో చేయాలని పండితులు చెబుతున్నారు. విష్ణు సహస్రనామాపారాయణ, లలిత సహాస్ర నామా పారాయణలు మొదలైనవి భక్తితో చేయాలి. (గమనిక - ఈ స్టోరీ పూర్తిగా నమ్మకం, విశ్వాసాలపై మాత్రమే ఆధార పడి ఉంటుంది. జీ తెలుగు మీడియా దీనికి బాధ్యత వహించదు..)