• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆధ్యాత్మికం
  • /Karthik Masam: కార్తీక మాసంలో తులసీ వివాహం విశిష్టత.. ఏ రోజున చేయాలి..?..

Karthik Masam: కార్తీక మాసంలో తులసీ వివాహం విశిష్టత.. ఏ రోజున చేయాలి..?..

Tulasi Vivah rituals: ద్వాదశి నుంచి కార్తీక పౌర్ణమి వరకు తులసీ వివాహంను చేసుకుంటే అనేక శుభయోగాలు కల్గుతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. దీని వల్ల పెళ్లిలో ఆటంకాలు కల్గితే అవి కూడా దూరమౌతాయని పెద్దలు చెబుతుంటారు.

Written ByInamdar Paresh
Published: Nov 14, 2026, 05:55 PM IST|Updated: Nov 14, 2026, 06:47 PM IST
joinshare
Karthik Masam: కార్తీక మాసంలో తులసీ వివాహం విశిష్టత.. ఏ రోజున చేయాలి..?..
Image Credit: Tulasipooja(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
Odisha Mla Video: ప్రెస్ మీట్‌లో ముద్దుల రచ్చ.. వీడియోపై అసలు విషయం బైటపెట్టిన ఎమ్మెల్యే సతీమణి..

Odisha Mla Video: ప్రెస్ మీట్‌లో ముద్దుల రచ్చ.. వీడియోపై అసలు విషయం బైటపెట్టిన ఎమ్మెల్యే సతీమణి..

2

Jr NTR Anil Ravipudi: టాలీవుడ్‌లో ఎవరూ ఊహించని కాంబో ఇది! ఎన్టీఆర్‌తో అనిల్ రావిపూడి కామెడీ ఎంటర్‌టైనర్ ఫిక్స్!

3

Karthik Masam: కార్తీక మాసంలో తులసీ వివాహం విశిష్టత.. ఏ రోజున చేయాలి..?..

4

HMD నుంచి అదిరిపోయే 4G ఫ్లిప్ ఫోన్.. 2 డిస్‌ప్లేలు, SOS బటన్‌తో సరికొత్త ఫీచర్లు!

5

Revanth Reddy: రాహుల్ గాంధీ నాయకత్వంలో భారతదేశాన్ని కాపాడుకుందాం: రాహుల్‌ గాంధీ

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Karthika masam 2026 tulasi vivah date rituals: మనకు ఉన్న తెలుగు మాసాల్లో కార్తీక మాసం అనేది అత్యంత పవిత్రమైనదని పెద్దలు చెబుతారు. ఈ మాసంలో మనం చేసుకునే పూజలు, వ్రతాలు అన్ని కూడా వెయ్యి రెట్ల గొప్ప ఫలితాలు ఇస్తాయి. మనం కార్తీకమాసంను ప్రస్తుతం నవంబర్ 10 నుంచి డిసెంబర్ 8 వరకు జరుపుకుంటాం. చాలా మంది కార్తీక మాసంలో తులసీ వివాహంను నిర్వహిస్తారు.  శ్రీకృష్ణుడికి, తులసీకి మధ్య వివాహం పండితులు చేయిస్తారు. ముఖ్యంగా ప్రభోదిని ఏకాదశి తర్వాత రోజు నుంచి తులసీ వివాహాల్ని జరుపుకొవడం ఆనవాయితీగా ఆచరిస్తు వస్తున్నాం. 

నవంబర్ 22 ద్వాదశి,23 త్రయోదశి, వైకుంఠ చతుర్దశి, 24 న కార్తీక పౌర్ణమిని మనం జరుపుకుంటాం.  ఈ ఐదు రోజుల్లో తులసీ వివాహంను జరిపించడం వల్ల అనేక శుభయోగాలు ప్రాప్తిస్తాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. అంతే కాకుండా చాలా వరకు ద్వాదశి, పౌర్ణమి తిథుల్లో తులసీ వివాహం నిర్వహించడం వల్ల పెళ్లిళ్లలో వస్తున్న ఆటంకాలు, విఘ్నాలు దూరమౌతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. 

మరోవైపు  కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద దీపారాధన చేయాలి. పండితులకు యథాశక్తి ప్రకారం దాన ధర్మాలు చేయాలి. నదీస్నానం ఈ నెలలో చేస్తే తెలిసి,తెలియక చేసిన పాప కర్మల నుంచి విముక్తి లభిస్తుంది. చాలా మంది గురుబలం లేక పొవడం వల్ల పెళ్లిళ్లు తొందరగా కుదరక ఇబ్బందులు ఎదుర్కొంటారు. 

ఇలాంటి వారు  శ్రీకృష్ణుడికి, తులసీకి శ్రధ్దా భక్తులతో వివాహం నిర్వహిస్తే అన్ని రకాల విఘ్నాలు పోయి సకల శుభాలు ప్రాప్తిస్తాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. మంచి పండితులను పిలిపించుకుని వారి సూచనల ప్రకారం తులసీ వివాహంను భక్తి శ్రద్దలతో, యథా శక్తి షోడషోపచారాలతో నిర్వహించుకొవాలి. తులసీ వివాహం బ్రాహ్మీమూహుర్తంలో లేదా సాయంత్రం ప్రదోష సమయాల్లో చేయాలని పండితులు చెబుతున్నారు. విష్ణు సహస్రనామాపారాయణ, లలిత సహాస్ర నామా పారాయణలు మొదలైనవి భక్తితో చేయాలి.  (గమనిక - ఈ స్టోరీ పూర్తిగా నమ్మకం, విశ్వాసాలపై మాత్రమే ఆధార పడి ఉంటుంది. జీ తెలుగు మీడియా దీనికి బాధ్యత వహించదు..)
 

Add Zee News as a Preferred Source
TAGS:
Festivals
Telugu News
Vastu Tips
Astrological Remedies