• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /HMD నుంచి అదిరిపోయే 4G ఫ్లిప్ ఫోన్.. 2 డిస్‌ప్లేలు, SOS బటన్‌తో సరికొత్త ఫీచర్లు!

HMD నుంచి అదిరిపోయే 4G ఫ్లిప్ ఫోన్.. 2 డిస్‌ప్లేలు, SOS బటన్‌తో సరికొత్త ఫీచర్లు!

Hmd 2320 Flip Phone: మార్కెట్‌లోకి HMD 2320 ఫ్లిప్ 4G మొబైల్‌ విడుదల కాబోతోంది. ఇది చూడడానికి చాలా ప్రీమియంగా ఉండబోతోంది. అంతేకాకుండా ఇది యూనిసోక్ T127 ప్రాసెసర్‌ను కూడా కలిగి ఉంటుంది. అయితే, దీనికి సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Written ByDharmaraju Dhurishetty
Published: Nov 14, 2026, 05:37 PM IST|Updated: Nov 14, 2026, 05:38 PM IST
joinshare
HMD నుంచి అదిరిపోయే 4G ఫ్లిప్ ఫోన్.. 2 డిస్‌ప్లేలు, SOS బటన్‌తో సరికొత్త ఫీచర్లు!
Image Credit: ZEE TELUGU NEWS

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
HMD నుంచి అదిరిపోయే 4G ఫ్లిప్ ఫోన్.. 2 డిస్‌ప్లేలు, SOS బటన్‌తో సరికొత్త ఫీచర్లు!

HMD నుంచి అదిరిపోయే 4G ఫ్లిప్ ఫోన్.. 2 డిస్‌ప్లేలు, SOS బటన్‌తో సరికొత్త ఫీచర్లు!

2

Revanth Reddy: రాహుల్ గాంధీ నాయకత్వంలో భారతదేశాన్ని కాపాడుకుందాం: రాహుల్‌ గాంధీ

3

Harish Rao: తెలంగాణ ప్రజలకు అదొక్కటే సరిపోదు రాహుల్‌ గాంధీ: హరీశ్‌ రావు

4

Kajal Aggarwal Love Story: 14 ఏళ్ల క్రితమే ప్రేమ.. బ్రేకప్ తర్వాత మళ్లీ ఒక్కటైన జంట.. పెళ్లిపై కాజల్ ఆసక్తికర వ్యాఖ్యలు!

5

Chandrababu Convoy: సీఎం చంద్రబాబు కాన్వాయ్‌లోకి కొత్త వాహనాలు.. 6 వాహనాల కొనుగోలుకు అనుమతి

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Hmd 2320 Flip Phone: ప్రస్తుత స్మార్ట్‌ఫోన్ల యుగం నడుస్తోంది.. ఇదిలా ఉంటే.. ఇప్పుడు కీప్యాడ్‌తో పాటు ఫ్లిప్ ఫోన్లకు ఉండే ఆదరణ కూడా ఏమాత్రం తగ్గలేదు.. ముఖ్యంగా సెకండరీ ఫోన్‌గా వాడేవారికి.. పెద్దవారికి ఇవి ఎంతో సౌకర్యవంతంగా ఉంటున్నాయి. అందుకే ఇప్పటికీ చాలా మంది వీటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతూ వస్తున్నారు.. ఇదిలా ఉంటే.. ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ హెచ్ఎండీ.. వినియోగదారుల కోసం మరో సరికొత్త ఫ్లిప్ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకు వచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.. HMD 2320 ఫ్లిప్ 4G పేరుతో అందుబాటులోకి రాబోతున్న ఈ ఫోన్‌ సంబంధించిన ఫీచర్స్‌తో పాటు స్పెషిఫికేషన్స్‌ ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. అయితే, దీనికి సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

లీక్ అయిన సమాచారం ప్రకారం.. HMD 2320 ఫ్లిప్ 4G చూడటానికి ఎంతో స్టైలిష్‌గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.. ఇందులో లోపలి వైపు 2.4 అంగుళాల LCD ప్రధాన డిస్‌ప్లేను కూడా కలిగి ఉంటుందని లీక్‌ అయిన వివరాలు చెబుతున్నాయి.. అంతేకాకుండా ఫోన్ మూసి ఉన్నప్పుడు టైమ్‌తో పాటు నోటిఫికేషన్లు చూసుకోవడానికి వీలుగా బయటి వైపు 1.77 అంగుళాల చిన్న కవర్ డిస్‌ప్లేను కూడా కంపెనీ అందిస్తూ వస్తోంది.. ఇక ఫోటోగ్రఫీ కోసం.. వెనుక భాగంలో 0.3MP ప్రధాన కెమెరా కూడా ఉన్నట్లు లీక్‌ అయిన వివరాలు తెలుపుతున్నాయి..

ఈ ఫ్లిప్ ఫోన్  యూనిసోక్ T127 (Unisoc T127) ప్రాసెసర్‌తో పనిచేస్తుందని లీక్‌ అయిన వివరాలు తెలిపాయి. ఇందులో 64MB ర్యామ్‌తో పాటు 128MB ఇంటర్నల్ స్టోరేజ్‌ను కూడా అందించిన్నట్లు సమాచారం. పాటలు, ఇతర ఫైల్స్ దాచుకోవడానికి మైక్రో ఎస్డీ కార్డ్ స్టోరేజ్‌ను 32GB వరకు పెంచుకునే వెసులుబాటును కూడా అందిస్తోంది..ఈ ఫోన్‌లో అనేక కనెక్టివిటీ ఫీచర్లు కూడా లభిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది 4G LTE క్యాట్ 4 నెట్‌వర్క్‌కు సపోర్ట్ చేస్తుందని సమాచారం. దీనికి తోడు Wi-Fi, బ్లూటూత్ 5.0, GPS వంటి అనేక ఫీచర్స్‌ కూడా లభిస్తున్నట్లు తెలుస్తోంది..

ఇందులో 1450mAh బ్యాటరీని కూడా కలిగి ఉంటుంది. ఇందులో కంపెనీ చాలా ప్రత్యేకంగా ఇందులో ప్రత్యేకంగా SOS బటన్ సపోర్ట్‌ను కూడా అందిస్తోంది. దీంతో పాటు పుష్-టు-టాక్, డాక్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా అందిస్తోంది. ఇవే కాకుండా ఎన్నో రకాల ప్రీమియం ఫీచర్స్‌ అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, భారత్‌లో ఈ మొబైల్‌ త్వరలోనే విడుదలయ్యే ఛాన్స్‌లు ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికార ప్రకటన త్వరలోనే కంపెనీ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News
Tech News