Karthika Masam: కార్తీక మాసంలో మహాద్భుతం.. విష్ణుమూర్తి నక్షత్రంలో కోటి సోమవారం.. రేపు తప్పకుండా ఏమిచేయాలంటే..?..
Kotisomavaram tradition: కార్తీక మాసంలో సోమవారం రోజున విశేషంగా శ్రావణ నక్షత్రం కూడా కలిసి రావడంను అత్యంత శుభప్రదమని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఈ ఒక్కరోజు కొన్ని పూజలు, వ్రతాలు చేస్తే జీవితంలోని అనేక సమస్యలు దూరమౌతాయని ప్రగాఢంగా నమ్ముతారు.
koti somavaram importance and rituals shiva pooja in karthika masam: కార్తీక మాసం అనేది దేవతలకు అత్యంత ప్రీతికరమైన మాసంగా చెప్తుంటారు. ఈ నెలలో మనం చేసే పూజలు, వ్రతాలు, దానాలు వెయ్యిరెట్లు గొప్ప శుభఫలితాల్ని ఇస్తాయి. ముఖ్యంగా కార్తీక సోమవారం, శుక్రవారం, శనివారంలను భక్తులు అత్యంత పవిత్రంగా భావించి ప్రత్యేకంగా పూజలు, వ్రతాలు ఆచరిస్తారు.ఈ క్రమంలో కార్తీక మాసం నేపథ్యంలో మనం తొలి సోమవారంను నవంబరు 16న జరుపుకుంటాం. కార్తీక మాసంలో శివ, కేశవుల్ని అత్యంత భక్తి శ్రద్దలతో పూజించుకుంటారు.
ఈ క్రమంలో సోమవారం రోజున వందల ఏళ్ల తర్వాత కోటి సోమవారం రోజున అత్యంత అరుదైన అధ్బుతం ఏర్పడబోతుంది. సోమవారం శివుడికి అత్యంత ప్రీతికరమైన వారం. ఇక ఈ రోజున శ్రీ మహా విష్ణువు జన్మ నక్షత్రమైన శ్రావణం కూడా కలిసి రావడం, మరోవైపు కంటి ముందు కన్పిస్తున్న దైవం సూర్యనారాయణుడి జన్మతిథి అయిన సప్తమి ఈ రోజున కలిసి రావడం అత్యంత శుభప్రదమని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ రోజున కోటి సోమవారం అని చెబుతుంటారు.
శ్రావణ నక్షత్రం, సోమవారంతో కలిసి వస్తే దాన్ని కోటి సోమవారంగా చెబుతుంటారు. ఈ రోజున మనం చేసే ఏ చిన్న పూజలు, వ్రతాలు, దానాలు, నదీస్నానాలు అయిన వెయ్యిరెట్ల అద్బుతమైన ఫలితాల్ని ఇస్తాయని పండితులు చెబుతున్నారు. ఇది అత్యంత దుర్లభమైనదని అందుకే ఈ రోజున శివుడికి అభిషేకం, విష్ణుమూర్తికి యథాశక్తి పూజలు, విష్ణు సహస్రనామాపారాయణ, లలితా పారాయణ మొదలైనవి ఆచరించాలని పండితులు సూచిస్తున్నారు.
బ్రాహ్మీమూహుర్తంలో ఉసిరిమీద దీపంను వెలిగించాలి. సత్యనారాయణ స్వామి వ్రతంను ఆచరించాలి. ఆకాశ దీపం వెలిగించాలి. శక్తి ఉంటే రోజంతా శివనామస్మరణ చేస్తు ఉపవాసంను ఆచరించి ప్రదోష సమయం తర్వాత శివ, కేశవుల ఆరాధన తర్వాత ఉపవాసంను విరమించాలి. రాత్రి జాగరణ చేసి శివ,కేశవులు అనుగ్రహం కోసం భజనలు చేయాలి. ( గమనిక- ఈ స్టోరీ పూర్తిగా నమ్మకం,విశ్వాసాలపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. జీ తెలుగు మీడియా దీనికి బాధ్యత వహించదు..)