• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆధ్యాత్మికం
  • /Ganesh Visarjan: గణనాథుడిని ఎందుకు నిమజ్జనం చేస్తారు? దీని వెనుక రహాస్యం

Ganesh Visarjan: గణనాథుడిని ఎందుకు నిమజ్జనం చేస్తారు? దీని వెనుక రహాస్యం

Why To Lord Ganesh Visarjan After 11 Days Pooja: భక్తుల నిత్య పూజలందుకున్న వినాయకుడు ఇక వెళ్లొస్తానంటూ వెళ్లిపోతున్నాడు. నిమజ్జనంతో నేటితో వినాయక ఉత్సవాలు ముగిసిపోతున్నాయి. అయితే గణనాథుడిని ఎందుకు నిమజ్జనం చేయాలి? దీని వెనుక అంతరార్థం ఏమిటనేది తెలుసుకుందాం.

Reported By Ravi Kumar SargamEdited By Ravi Kumar Sargam
Published: Sep 25, 2026, 06:39 AM IST|Updated: Sep 25, 2026, 06:49 AM IST
joinshare
Ganesh Visarjan: గణనాథుడిని ఎందుకు నిమజ్జనం చేస్తారు? దీని వెనుక రహాస్యం
Image Credit: Ganesh Nimjjanam Story In Telugu

About the Author

 Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Ganesh Visarjan Story: చవితి నుంచి 11 రోజుల పాటు పూజలందుకున్న వినాయకుడు నేడు మహా నిమజ్జనం కానున్నాడు. అయితే భక్తులు తమ సౌకర్యార్థం ఒక రోజు, మూడు రోజులు, ఐదు, ఏడు, తొమ్మిది రోజులు, 11 రోజుల పాటు పూజలు చేసి వినాయకుడిని నిమజ్జనం చేస్తుంటారు. ఎన్ని రోజులు పూజలు చేసినా చివరికి వినాయకుడిని నిమజ్జనం చేయడం అనేది పద్ధతి. అసలు వినాయకుడిని గణనాథుడిని నిమజ్జనం ఎందుకు చేస్తారు? నిమజ్జనం వెనుక ఆంతర్యం ఏమి ఉందో తెలుసుకుందాం.

వినాయక నిమజ్జనంపై ఒక శ్లోకం ఉంది.

ఆకాశస్యధిపో విష్ణుః అగ్నిశైవ మహేశ్వరః
వాయో సూర్యః క్షితిదీశః జలరూపో వినాయకః

వినాయకుడు జలతత్వానికి ప్రతీకగా పేర్కొంటారు. అందుకే గంగాసుతాయ నమః' అని వినాయకుడిని పూజిస్తాం. ప్రకృతిని పులకింపజేసేదే గణపతి ఆరాధన. ప్రకృతి ధర్మాన్ని మానవాళి మరిచిపోకుండా ఉండేందుకే ప్రతి సంవత్సరం గణేశ్‌ నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తారు. వినాయక పండుగలోని అంతరార్థం భారీ విగ్రహాలను ప్రతిష్టించడంలో పోటీపడడం, సినిమా పాటలకు నృత్యాలు చేయడం కాదు. ఏ మట్టిని సస్యశ్యామలం చేయడంలో ప్రేరణశక్తిగా ఉన్నాడో ఆ గణపయ్యని శ్రద్ధతో పూజించడమే వినాయక ఉత్సవాల ముఖ్య ఉద్దేశం. మహా గణపతి అంటే పెద్ద పెద్ద రంగు రంగుల విగ్రహాలు కాదు మట్టితో తయారు చేసిన స్వచ్ఛమైన రూపం.

మట్టి అంటే భూమాతకు చిహ్నం. ఏ పదార్థమైనా ఆమె స్వరూపమే. భూదేవికి మనసారా నమస్కరించి, ప్రేమపూర్వకంగా కాస్తంత మట్టిని తీసుకుని గణపతి ప్రతిమ చేయాలి. వానాకాలం మొదలవడానికి ముందే చెరువులు, కుంటల్లో క్రమపద్దతిలో మట్టి తీయడంతో కాలవలు, కుంటలు, చెరువుల్లో నీటి నిలువ సామర్థ్యం పెరిగేది. అంటే వినాయకుడి ప్రతిమల తయారీ వెనుకున్న ఓ అంతరార్థం చెరువులు, కాలువల పూడికతీయడం. దీనర్థం వినాయకుడు ఇంట్లో అడుగుపెట్టక ముందే జలసిరులతో చెరువులు, కుంటలు కళకళలాడాలి అని.

ఇంట్లో గణేషుడి మట్టి ప్రతిమలను తొమ్మిది రోజులు పూజించిన తర్వాత ఆ మట్టి గణేషుడిని పత్రి, నవధాన్యాలతో కలిపి ఇంటి పెరట్లో చెట్లకింద ఉంచేవారు. తద్వారా ఎంత బలహీనంగా ఉండే చెట్లయినా ఏపుగా పెరిగేవి. పూజాద్రవ్యాల్లోని పోషక విలవలు, పత్రిలోని విశిష్ట గుణాలు ఉండటమే దీనికి కారణం. నవరాత్రులు పూర్తయ్యాక వినాయక విగ్రహాన్ని చెరువులో, కుంటలలో నిమజ్జనం చేస్తారు. కుంటలు లేని చోట బావిలో నిమజ్జనం చేయవచ్చు.

వినాయకుడితోపాటు నిమజ్జనం చేసే 21 రకాల పత్రి, విగ్రహంలోని మట్టి నీటిలో కలిశాక ఔషధ గుణాలు ఆ నీటిలో విడుదలవుతాయి. దీంతో నీళ్లలోని ప్రమాదకరమైన బాక్టీరియా నశించడమే కాకుండా ఆక్సిజన్ శాతం పెరుగుతుంది. ఇదే వినాయక నిమజ్జనం వెనుక దాగున్న పర్యావరణ పరమార్ధం.

నిమజ్జనం వెనుక ఆంతర్యం
తమ విజ్ఞప్తిని మన్నించి దేవలోకం నుంచి వచ్చి.. మా పూజలు అందుకొని అనుగ్రహించిన వినాయకుడిని తన దేవలోకానికి వెళ్లిరమ్మని ప్రార్థిస్తూ గణేశుడిని నిమజ్జనం చేస్తారు. భగవంతుడు తయారు చేసిన మానవ శరీరం ఉన్నన్ని రోజులు ఎంత వైభోగం అనుభవించినా చివరకు పంచభూతాల్లో కలిసిపోవాల్సిందే తప్ప శాశ్వతం కాదన్న సత్యాన్ని ఈ నిమజ్జనం ద్వారా గణనాథుడు చెబుతాడు. గణపతి జలరూపానికి ప్రతినిధి కనుక నీళ్లలో లయం చేయడం ద్వారా వచ్చిన చోటుకే చేరుకుంటాడన్నది ఆంతర్యం.

Add Zee News as a Preferred Source
TAGS:
Spirituality
Hyderabad
Telugu News