SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

పితృ పక్షాల్లో చేసే శ్రాద్ధం వలన కలిగే ప్రయోజనాలు ఏమిటి.. !

Pitru Paksha 2026: హిందూ ధర్మ శాస్త్రంలో 6వ మాసం భాద్రపద మాసం. ఈ నెలలో వచ్చే కృష్ణ పక్షంలో వచ్చే 15 రోజులను మహాలయ పక్షాలుగా లేదా పెద్దల పక్షంగా మన పెద్దలు పిలుస్తుంటారు. ఈ పక్షం రోజుల్లో తమ పూర్వీకులను తలుచుకుంటూ తమ శక్తి కొలది శ్రాద్ధ కర్మలు పెట్టడం సనాతన ధర్మంగా వస్తుంది. ఈ 15 రోజుల్లో కేవలం మన తల్లిదండ్రులకు మాత్రమే కాదు.. ఇరు వంశాలకు చెందిన వాళ్లను స్మరిస్తూ శ్రాద్దం నిర్వహించాలి.

Written By TA Kiran Kumar Sharma
Published: Sep 27, 2026, 08:06 AM IST | Updated: Sep 27, 2026, 08:11 AM IST
Image Credit: Mahalaya Paksham (File Pic/Source)
Join

Mahalaya Paksham: కన్నుమూసిన తండ్రి, తాత, ముత్తాతలను ఈ పక్షం రోజుల్లో నిరంతరం తలచుకోవాలి. వారు వల్లే మనం భూమిపైకి వచ్చామనే విషయాన్ని గుర్తించుకోవాలి. ముఖ్యంగా వారసులు నిర్వహించే శ్రాద్ధ తర్పణ, పిండ ప్రదానాది పితృయజ్ఞ విధులన్నీ జరుపుకోవడానికి ఈ 15 రోజులు అత్యంత కీలకం. ఈ పదిహేను రోజులనే మహాలయ పక్షాలుగా వ్యవహరిస్తారు. వీటినే పితృపక్షము లేదా అపర పక్షములనీ  పిలుస్తారు. కన్నుమూసిన  మన పితృదేవతలకు భక్తిగా ఆహారాన్ని అందించడమే ఈ పక్షం రోజుల ముఖ్య ఉద్దేశ్యం.  ఈ సమయంలో వారి ఆకలి తీర్చడమే ఈ పితృ పక్షాల్లో ముఖ్యమైన విధి. 27-9-2025 నుండి 10-10-2025 వరకు మహాలయ పక్షం రోజులు.  భాద్రపద బహుళ పాడ్యమి నుంచి భాద్రపద అమావాస్య వరకు ఉన్న  పదిహేను రోజులనే  పితృ పక్షములుగా పిలుస్తారు. 

పితృ దేవతలకు ఆకలి ఉంటుందా.. 

పితృదేవతలకు.. అసలు ఆకలా ఉంటుందా.. ? చనిపోయిన వాళ్లకు మనం ఆహారం అందించాలా.. అనే సందేహం మనలో చాలా మందికి కలగవచ్చు. మనకు  కనిపించే సకల చరాచర జగత్తు మొత్తం ఆకలి అనబడే సూత్రం మీదనే  నిర్మించబడి ఉంది.  అన్నం వలన ప్రాణికోటి జన్మిస్తుంది. వర్షం వలన అన్నం లభిస్తుంది. యజ్ఞం వలన వర్షం కురుస్తుంది. ఆ యజ్ఞం కర్మ వలననే సాధ్యమౌతుంది ఇది భగద్గీతలో శ్రీ కృష్ణుడు అర్జునుడికి చెప్పిన అత్యంత కీలకమైన  మాట.  

అంటే... అన్నం మనకు దొరకాలంటే మేఘాలు గర్జించాలి. మేఘాలు  భూమిపై వర్షించాలంటే... దేవతలు కరుణా కటాక్షాలుండాలి. దేవతలు కరుణించాలంటే వారి ఆకలి తీరాలి. వారి ఆకలి తీరాలంటే యజ్ఞాల ద్వారా వారి వారి హవిర్భాగాలు అందజేయాల్సి ఉంటుంది. ఎందుకు ఇంత  తతంగం.

అన్నమే సకల జీవరాశికి మూలం.. 

మరణించిన ప్రాణి ఆత్మ రూపంలో పితృలోకంలో సంచరిస్తూ ఉంటుంది. ఆ ఆత్మ తన పూర్వకర్మానుభవం కోసం తిరిగి ఈ భూమి మీద జీవాత్మగా అవతరించడానికి ... అన్నాన్ని ఆశ్రయించి ఉంటుంది. తద్వారా పురుష ప్రాణి దేహంలో ప్రవేశించి, శుక్ల కణముగా మారుతుంది. ఆ తర్వాత స్త్రీ గర్భకోశంలో ప్రవేశించి, శిశువుగా మారుతుంది. అలా శిశువు ఈ భూమి మీదకు వస్తుంది.సృష్టికి సంబంధించిన అతి పెద్ద రహస్యం ఇదే.

Disclaimer: ఈ కథనంలో పేర్కొనబడిన వ్యాసం పూర్తిగా మన హిందూ ధర్మ శాస్త్ర గ్రంథాల్లో ఉన్న వాటినే జీ మీడియా ప్రస్తావించింది. ఇది ఆయా వ్యక్తుల నమ్మకాల ఆధారపడి ఉంటుంది. జీ తెలుగు ఈ వార్తను ధృవీకరించడం లేదు. దీనికి సంబంధించిన మరింత సమాచారం కోసం సంబంధిత రంగంలోని నిపుణుడిని సంప్రదించండి. 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES