SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

సెప్టెంబర్ 18న కర్కాటకంలో కుజుడు.. గురుతో కలయిక.. ఈ 6 రాశులకు ఊహించని లాభాలు!

Mars-jupiter Conjunction Effect: సెప్టెంబర్ 18వ తేదీన కుజుడు కర్కాటక రాశిలోకి సంచారం చేయబోతున్నాడు.. ఇప్పటికే ఆ రాశిలో బృహస్పతి గ్రహం సంచార దశలో కొనసాగుతుంది.. దీని కారణంగా ఈ రెండు గ్రహాల కలయిక జరగబోతోంది.. ఈ సంయోగంతో ఆరు రాశుల వారి జీవితాల్లో ఊహించని మార్పు వస్తాయి.

Reported By Dharmaraju Dhurishetty Written By Dharmaraju Dhurishetty
Published: Sep 13, 2026, 10:00 AM IST | Updated: Sep 13, 2026, 10:03 AM IST
Image Credit: Mars-jupiter Conjunction In Cancer: 6 Zodiac Signs Set For Major Changes On September 18
Join

Mars-jupiter Conjunction In Cancer: జ్యోతిష్య శాస్త్రంలో కుజ గ్రహాన్ని ధైర్యం, సంపాదన, బలం, ఆత్మవిశ్వాసానికి అధిపతిగా పరిగణిస్తూ ఉంటారు. ఇదిలా ఉంటే సెప్టెంబర్ 18వ తేదీన కుజుడు కర్కాటక రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. అరె వైపు గురుగ్రహం కూడా కర్కాటక రాశిలో సంచార దశలో కొనసాగుతూ వస్తోంది. దీని ఫలితంగానే కుజ గురు గ్రహాల సంయోగం జరగబోతోంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఈ గ్రహాల మార్పు ప్రభావం వల్ల రాబోయే 56 రోజులపాటు వివిధ రాశుల వారిపై ఊహించని ప్రభావం పడుతుంది.

ముఖ్యంగా బృహస్పతి, కుజ గ్రహాల కలయిక ఆరు రాశుల వారిపై ఊహించని ప్రభావం చూపుతోందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ సమయంలో ఉద్యోగంలో పురోగతి లభించడమే కాకుండా ఆర్థికంగా బోలెడు లాభాలు కలుగుతాయి.. కొత్త కొత్త అవకాశాలు లభించడమే కాకుండా వ్యక్తిగత జీవితంలో సానుకూలమైన మార్పులు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అనుకున్న ప్రయోజనాలు కూడా సొంతం చేసుకుంటారు.

ఈ రాశులవారికి లాభాలు:
వృషభరాశి 
కుజ గృహస్పతి గ్రహాల ప్రభావం వల్ల వృషభ రాశి వారికి ఈ సమయంలో ధైర్యంతో పాటు ఆత్మవిశ్వాసం ఊహించని స్థాయిలో పెరుగుతుంది. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. పెండింగ్లో ఉన్న పనులు కూడా ముందుకు సాగుతాయి. అలాగే వ్యాపారంలో కూడా కొత్త అవకాశాలు లభించే ఛాన్సులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మునుపటి కంటే ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుంది.

మిధున రాశి 
ఈ సమయంలో ఆర్థిక రంగంలో సానుకూలమైన మార్పులు వచ్చే అవకాశాలు మిధున రాశి వారికి మెండుగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆదాయాన్ని పెంచుకోవడానికి కొత్త మార్గాలు కూడా తెరుచుకుంటారు. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు కూడా ఈ సమయంలో సులభంగా పూర్తవుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. అంతేకాకుండా గతంలో ఇతరులకు ఇచ్చిన డబ్బులు కూడా తిరిగి పొందుతారు. కుటుంబ అవసరాలను తీర్చుకోవడానికి ఈ సమయంలో పొదుపుపై దృష్టి పెట్టడం మంచిది.

కర్కాటక రాశి 
కుజ గురుగ్రహాల కలయిక కారణంగా కర్కాటక రాశి వారికి జీతాలపై అత్యంత ప్రభావం పడుతుంది. వీరికి ఆత్మవిశ్వాసం ఊహించని స్థాయిలో పెరుగుతుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ధైర్యం కూడా వీరికి లభించబోతోంది.. పనుల్లో అద్భుతమైన నైపుణ్యం కూడా లభించి కొత్త ప్రణాళికలు అమలు చేయడంలో అద్భుతమైన విజయాలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

వృశ్చిక రాశి 
వృశ్చిక రాశి వారికి కూడా బృహస్పతి కుజ గ్రహాల ప్రభావంతో అదృష్టం విపరీతంగా పెరుగుతుంది.. సుదూర ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.. విద్యతో పాటు ఉద్యోగం లేదా వ్యాపార రంగాల్లో అద్భుతమైన అవకాశాలు కూడా లభించబోతున్నాయి. చిరకాలంగా కోరుకుంటున్న కోరికలు కూడా చాలావరకు ఈ సమయంలో నెరవేరబోతున్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.

మీన రాశి 
ఈ రెండు గ్రహాల సంయోగం కారణంగా మీన రాశి వారికి ఈ సమయంలో తప్పకుండా సృజనాత్మకత పెరుగుతుంది.. అంతేకాకుండా ఆత్మవిశ్వాసం పెరిగి ఉద్యోగం లేదా వ్యాపారాల్లో మంచి ఫలితాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రేమా వ్యక్తిగత సంబంధాల్లో కూడా సానుకూలమైన మార్పులు రావచ్చు. కొత్త ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వ్యక్తులకు ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది.

మేషరాశి 
మేషరాశి వారికి కూడా ఈ సమయంలో విశేషమైన ప్రయోజనాలు కలగబోతున్నాయి. ఆస్తి సంబంధిత విషయాల్లో కూడా భారీ మొత్తంలో లాభాలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. పనుల్లో బాధ్యతలు విపరీతంగా పెరుగుతాయి. దీని కారణంగా వీరు అద్భుతమైన గౌరవాన్ని కూడా పొందగలుగుతారు. ఇల్లు లేదా భూములు కొనుగోలు చేయాలనుకుంటున్న వ్యక్తులు అద్భుతమైన ఫలితాలు పొందుతారు. కష్టానికి తగిన ప్రతిఫలం కూడా లభించి విశేషమైన ప్రయోజనాలు సొంతం చేసుకుంటారు.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

గమనిక..

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..

Add Zee News as a Preferred Source

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

ZEENEWS TRENDING STORIES