SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

నవంబర్ 12 వరకు కుజుడి ప్రభావం.. ఈ రాశులకు ఊహించని ధనలాభాలు.. గోల్డెన్ డేస్ ప్రారంభం!

Mars Transit 2026 Effect: నవంబర్ 12వ తేదీ వరకు కుజుడు చాలా చురుకుగా ఉంటాడని.. ఈ సమయం వరకు కొన్ని రాశుల వారికి దిమ్మతిరిగే ధన లాభాలు కలిగే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలిపారు. అనుకున్న ధన లాభాలు కలగడమే కాకుండా పనుల్లో అద్భుతమైన విజయాలు సాధించే అవకాశాలు కూడా ఉన్నాయని ఆయన అన్నారు.. ఈ సమయంలో అద్భుతమైన ప్రయోజనాలు సొంతం చేసుకోబోతున్న రాశులేవో తెలుసుకుందాం.

Reported By Dharmaraju Dhurishetty Written By Dharmaraju Dhurishetty
Published: Sep 20, 2026, 10:37 AM IST | Updated: Sep 20, 2026, 10:40 AM IST
Image Credit: నవంబర్ 12 వరకు కుజుడి ప్రభావం.. ఈ రాశులకు ఊహించని ధనలాభాలు.. గోల్డెన్ డేస్ ప్రారంభం!
Join

Mars Transit 2026 Effect Telugu: జ్యోతిష్య శాస్త్రంలో కుజ గ్రహం అత్యంత శక్తివంతమైన గ్రహమని, దీని సంచారం కారణంగా ఏర్పడే ప్రభావం అన్ని రాశుల వారిపై పడుతుందని ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తంజావూరి నాగరాజు శర్మ తెలిపారు. శుక్రవారం రోజు కుజుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించాడని.. దీని కారణంగా ఎన్నో రకాల ప్రత్యేకమైన యోగాలు ఏర్పడ్డాయని.. వీటి ప్రభావం నవంబర్ 12వ తేదీ వరకు ఎంతో చురుకుగా ఉంటుందని ఆయన తెలిపారు. ఈ మొత్తం సమయంలో నాలుగు రాశుల వారికి ఎంతో మేలు జరుగుతుందని.. ముఖ్యంగా గోల్డెన్ డేస్ ప్రారంభమవుతాయని ఆయన అన్నారు. అలాగే ఏర్పాట్ నుంచి వస్తున్న అడ్డంకులు తొలగిపోయి.. జీవితంలో ఆనందం లభిస్తుందన్నారు. దీంతోపాటు ఆదాయ వనరులు విపరీతంగా పెరిగి విశేషమైన లాభాలు కూడా సొంతం చేసుకుంటారన్నారు. ముఖ్యంగా కుటుంబంలో అందరూ ఆరోగ్యంగా ఉంటారని.. కష్టాలు పూర్తిగా తొలగిపోతాయని ఆయన వెల్లడించారు. అయితే, నవంబర్ నెల వరకు అద్భుతమైన లాభాలు సొంతం చేసుకునే రాశులేవో తెలుసుకుందాం..

ఈ రాశులవారికి బంపర్‌ ప్రయోజనాలు:
మేషరాశి 
కుజ గ్రహ సంచారం కారణంగా మేష రాశి వారికి ఎన్నో రకాల ఆటంకాలు తొలగిపోయి.. కుటుంబానికి మంచి రోజులు వస్తాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు నాగరాజు శర్మ తెలిపారు. ముఖ్యంగా వీరు తప్పకుండా ఈ సమయంలో భూమి లేదా ఇల్లు కొనుగోలు చేసి అనేక రకాల కష్టాల నుంచి ఉపశమనం పొందగలుగుతారన్నారు. అలాగే ఈ సమయంలో అకస్మాత్తుగా డబ్బులు పొంది అప్పుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుందన్నారు. ఆర్థిక సమస్యలు పూర్తిగా తొలగిపోయి బ్యాంకులో పెద్ద మొత్తంలో డబ్బులు కూడా పొదుపు చేసుకోగలుగుతారన్నారు.

వృశ్చిక రాశి 
వృశ్చిక రాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా కుజుడి ప్రత్యేకమైన ప్రభావంతో జీవితంలో వస్తున్న అశాంతి పూర్తిగా తొలగిపోయి.. ఆనందం ఊహించని స్థాయిలో పెరుగుతుందన్నారు. ముఖ్యంగా ఈ సమయంలో బయటకు వెళ్లడానికి మంచి ప్రణాళికలు కూడా చేసుకుంటారన్నారు. కుటుంబం మొత్తంతో కలిసి యాత్రలకు వెళ్లడమే కాకుండా.. మానసిక ప్రశాంతత కోసం మంచి మంచి ప్రదేశాలను సందర్శించే అవకాశాలు కూడా ఉన్నాయన్నారు. ముఖ్యంగా ఉద్యోగంలో అద్భుతమైన అభివృద్ధి లభిస్తుందని.. ఈ సమయంలో ఆచితూచి ముందుకు సాగాలని సూచించారు.

ధనస్సు రాశి 
ధనస్సు రాశి వారికి కూడా ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయని.. కుజుడి ప్రభావంతో తండ్రి ఆస్తులు కూడా తప్పకుండా లభిస్తాయని.. పాత భూమి కేసుల నుంచి ఉపశమనం లభిస్తుందని జ్యోతిష్యులు తెలిపారు. ముఖ్యంగా ఈ సమయంలో డబ్బుల గురించి చింత వదిలేసి.. ముందుకు సాగితే విశేషమైన గుర్తింపు లభించి డబ్బులు తప్పకుండా లభిస్తాయన్నారు. ముఖ్యంగా విపరీతమైన బ్యాంకు బ్యాలెన్స్ పెరిగి ఇతర వ్యాపారాల్లో ఊహించని స్థాయిలో పెట్టుబడులు పెట్టగలుగుతారు. అవగాహనతో ముందుకెళ్లడం ఈ సమయంలో మంచిదని ఆయన సూచించారు.


ధనస్సు రాశి 
ధనస్సు రాశి వారికి కూడా ఎన్నో రకాల సమస్యల నుంచి ఎంతో సులభంగా ఉపశమనం కలుగుతుందని నాగరాజ్ శర్మ తెలిపారు.. ఉద్యోగంలో వస్తున్న సమస్యలు పూర్తిగా తొలగిపోయి వ్యాపారంలో భారీ మొత్తంలో లాభాలు రావడం ప్రారంభం అవుతాయన్నారు. ముఖ్యంగా కుజుడి ప్రభావం వల్ల డబ్బు కోరత ఉండదన్నారు. ఈ సమయంలో తప్పకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా పెట్టుబడులు పెట్టడం చాలా మంచిదని సూచించారు. ఎప్పటినుంచో కోరుకుంటున్న కోరికలు కూడా చాలా వరకు నెరవేరి ఆందోళన వంటి అంశాల నుంచి విముక్తి లభిస్తుందని ఆయన తెలిపారు.

గమనిక.. ఇక్కడ అందించిన సమాచారం కేవలం ప్రముఖ జ్యోతిష్య శాస్త్రం నిపుణులు నాగరాజు శర్మ నుంచి స్వీకరించి రాసింది మాత్రమే. దీనిని జీ తెలుగు న్యూస్ దృవీకరించదు. అలాగే ఈ సమాచారం మీ నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

 

గమనిక..

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

ZEENEWS TRENDING STORIES