SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

కుజుడు, కేతువు కలయికతో అద్భుతం.. ఈ 4 రాశుల జీవితాల్లో భారీ మార్పులు!

Mars Transit In Leo 2026: 12వ తేదీన కుజుడు సింహరాశిలోకి సంచారం చేశాడు. అయితే, దీని ప్రభావం దాదాపు వచ్చే సంవత్సరం మార్చి 9వ తేదీ వరకు కొనసాగుతుందట. దీంతో ఆయా రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. అయితే, ఈ సమయంలో ఏ రాశుల వారికి లాభదాయకంగా ఉంటుందో తెలుసుకుందాం.

Written By Dharmaraju Dhurishetty
Published: Nov 15, 2026, 08:28 AM IST | Updated: Nov 15, 2026, 08:31 AM IST
Image Credit: ZEE TELUGU NEWS
Join

Mars Transit In Leo 2026: జ్యోతిష్య శాస్త్రంలో కుజ గ్రహాన్ని ధైర్యంతో పాటు బలం, సంపద, పనికి సూచికగా చెప్పుకుంటూ ఉంటారు. ఇదిలా ఉంటే 2026 నవంబర్ 12వ తేదీన కుజుడు కర్కాటక రాశిని వదిలిపెట్టి.. సింహరాశిలోకి సంచారం చేశాడు. ఎరుపు గ్రహంగా పరిగణించే ఈ గ్రహం 2027 మార్చి 9వ తేదీ వరకు అదే రాశిలో సంచార దశలో కొనసాగుతుంది. కాబట్టి ఈ సమయంలో కుజుడు కేతువుతో కలిసి ఉంటాడు. కాబట్టి ఈ సమయం కొన్ని రాశుల వారికి అత్యంత శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా ఆర్థికంగా కూడా అద్భుతమైన అవకాశాల అందిస్తుంది. దీంతో వచ్చే ఏడాది మార్చి 9 వరకు కొన్ని రాశుల వారికి ఆర్థిక, వృత్తిపరంగా ఎంతో అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా దిమ్మతిరిగే ధన లాభాలు కలిగే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్యులు నాగరాజ శర్మ తెలుపుతున్నారు. అయితే, ఏ రాశుల వారికి ఈ సమయం లాభదాయకంగా ఉంటుందో? ఇప్పుడు తెలుసుకోండి..

ఈ రాశులవారికి లాభాలు:

మిథున రాశి 
వచ్చే సంవత్సరం మార్చి 9వ తేదీ వరకు మిథున రాశి వారికి చాలా లాభదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా వీరికి నిలిచిపోయిన పనులు ముందుకు సాగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. గతంలో చిక్కుకుపోయిన డబ్బులు కూడా త్వరగా తిరిగి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు నాగరాజ్ శర్మ తెలుపుతున్నారు. ముఖ్యంగా పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న వ్యక్తులకు ఈ సమయం ఎంతో శుభప్రదంగా ఉంటుందట. అలాగే వ్యాపారాల్లో పెట్టాలనుకునే వారు తప్పకుండా మంచి అనుభవం ఉన్న వ్యక్తుల సూచనలు సలహాలు తీసుకోవాల్సి ఉంటుంది.

తులారాశి 
తులా రాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా కుజుడి శక్తివంతమైన ప్రభావం చాలా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా వీరికి ఈ సమయంలో చాలావరకు సృజనాత్మకత పెరగడమే కాకుండా ఎన్నో రకాల సమస్యల నుంచి పరిష్కారం లభించబోతోంది. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు కూడా తప్పకుండా ఊపందుకునే అవకాశాలున్నాయి. ముఖ్యంగా వృత్తికి సంబంధించిన ఏ నిర్ణయమైనా మానుకూలమైన ఫలితాలను అందించే అవకాశాలు కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. స్నేహితులతో పాటు బంధుమిత్రుల మధ్య ఉన్న విభేదాలు కూడా సులభంగా తొలగిపోతాయి.

వృచ్చిక రాశి 
కుజ గ్రహ సంచారం వృశ్చిక రాశి వారికి కూడా ఎంతో ప్రత్యేకంగా ఉండబోతుందని జ్యోతిష్యులు నాగరాజ్ శర్మ తెలుపుతున్నారు. వీరికి ఉద్యోగాల్లో విజయాలు కలగడమే కాకుండా.. కొత్త బాధ్యతలు లభించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఉద్యోగం మానేసి సొంత వ్యాపారం ప్రారంభించాలనుకునే వ్యక్తులకు వారి అద్భుతమైన ప్రణాళికలతో విశేషమైన లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టాలనుకునే వ్యక్తులకు ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ముందుకు సాగడం చాలా మంచిది.

మీన రాశి 
మీన రాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా కుజుడు మార్పు కారణంగా అడ్డంకులన్నీ సులభంగా తొలగిపోతాయి. అంతేకాకుండా నిలిచిపోయిన పనులు కూడా సులభంగా పూర్తవుతాయి. అలాగే ఖర్చులు నియంత్రించుకోవాలనుకునే వ్యక్తులకు ఈ సమయం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న వ్యక్తులకు ఈ సమయం చాలా ప్రయోజనకరంగా ఉండబోతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అలాగే ఆర్థిక మోసాల పట్ల కూడా చాలా జాగ్రత్తగా ఉండి ముందుకు సాగాల్సి ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు..

NOTE:

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

ZEENEWS TRENDING STORIES