SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

చిత్తా నక్షత్రంలో బుధుడు.. ఈ 3 రాశుల వారికి అక్టోబర్ 1 వరకు ధనలాభాలే!

Mercury In Chitra Nakshatra: అక్టోబర్‌ 1వ తేది వరకు బుధుడు చిత్తా నక్షత్రంలో సంచార దశలో కొనసాగడం వల్ల కొన్ని రాశులవారికి అద్భుతమైన లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు తంజావురి నాగరాజు శర్మ తెలిపారు. ఈ సమయంలో విశేషమైన ప్రయోజనాలు కలిగే ఛాన్స్‌లు ఉన్నాయి. అయితే, ఏయే రాశులవారికి బంపర్‌ లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Reported By Dharmaraju Dhurishetty Written By Dharmaraju Dhurishetty
Published: Sep 22, 2026, 12:05 PM IST | Updated: Sep 22, 2026, 12:07 PM IST
Image Credit: Zee Telugu News
Join

Mercury In Chitra Nakshatra In Telugu: గ్రహ కదలికలతో పాటు నక్షత్ర సంచారాలకు జ్యోతిష్య శాస్త్రంలో ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఈ గ్రహ సంచారాల ప్రభావం మానవ జీవితాలపై ఊహించని ప్రభావాన్ని చూపుతూ ఉంటాయి. ఇదిలా ఉంటే బుద్ధితో పాటు వివేకం, వాక్చాతుర్యంతో పాటు వ్యాపారాలకు కారకుడైన బుధ గ్రహానికి చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. అయితే, కుజుడు అధిపతిగా భావించి చిత్తా నక్షత్రంలోకి ప్రవేశించింది. అక్టోబర్‌ 1వ తేది వరకు ఈ సంచారం కొనసాగుతుంది. కాబట్టి అప్పటి వరకు కొన్ని రాశులవారికి శుభఫలితాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.

చిత్తా నక్షత్రంలో బుధుడి ప్రవేశంతో పాటు కుజుడి ప్రభావం విపరీతంగా అన్ని రాశులవారిపై పడడం వల్ల కొన్ని రాశులవారి జీవితాల్లో కీలక మార్పులు సంభవిస్తాయని జ్యోతిష్యలు తెలుపుతున్నారు. అంతేకాకుండా అదృష్టం విపరీతంగా పెరగమే కాకుండా అదృష్టం కూడా రెట్టింపు అవుతుంది. అలాగే దీర్ఘకాలిక సమస్యలతో బాధపడేవారికి ఉపశమనం లభిస్తుంది. అయితే, ఈ సమయంలో అద్భుతమైన లాభాలు పొందే రాశులేవో ఇప్పుడు తెలుసుకుందాం.

1. మిథున రాశి (Gemini): 
మిథున రాశివారికి అధిపతి బుధుడే కావడంతో ఈ నక్షత్ర సంచారం వల్ల మిథున రాశివారికి ఈ సమయం అత్యంత సానుకూలంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అంతేకాకుండా విద్యార్థులకు ఈ సమయం ఎంతో లాభదాయకంగా ఉంటుంది.. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వ్యక్తులకు ఈ ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుందని జ్యోతిష్యులు తంజావురి నాగరాజు శర్మ తెలిపారు. ముఖ్యంగా మార్కెటింగ్‌తో పాటు క్రియేటివ్‌ రంగాల్లో ఉన్నవారికి అద్బుతమైన లాభాలు కూడా కలుగుతాయి. వీరికి ఈ సమయంలో ఆకస్మిక ధనలాభాలు కూడా కలిగే సూచనలు కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.

2. కన్యా రాశి (Virgo): 
బుధుడి శక్తివంతమైన ప్రభావంతో కన్యా రాశివారికి కూడా అత్యంత విశేష ఆదరణ కూడా లభిస్తుంది. ముఖ్యంగా వీరికి కమ్యూనికేషన్‌ నైపుణ్యం కూడా విపరీతంగా పెరుగుతుంది. మీడియాతో పాటు మార్కెటింగ్‌, కన్సల్టెన్సీ వంటి రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కెరీర్‌లో కీలక ముందడుగు పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు నాగరాజు శర్మ తెలిపారు. అలాగే ఉద్యోగాలు చేసేవారికి కేరీర్‌ విశేషమైన మార్పులు కూడా లభిస్తాయి. గతంలో నిలిచిపోయిన పనులు కూడా సులభంగా తీరిపోతాయి. ముఖ్యంగా బ్యాంక్‌ బ్యాలెన్స్ కూడా విపరీతంగా పెరుగుతుంది. అంతేకాకుండా కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి.

3. మకర రాశి (Capricorn): 
మకర రాశివారికి వృత్తి, వ్యాపారాల పరంగా వస్తున్న సమస్యల నుంచి ఉపశమనం కూడా లభిస్తుంది. అంతేకాకుండా అద్భుతమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల బంపర్‌ లాభాలు పొందుతారని జ్యోతిష్యులు తెలపుతున్నారు. కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి. అంతేకాకుండా కొత్త కొత్త నిర్ణయాలు తీసుకోవడం వల్ల అద్భుతమైన లాభాలు కూడా పొందే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. వ్యాపారాల్లో మార్కెట్‌ రంగాల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నవారు కీలక నిర్ణయాలు కూడా సులభంగా తీసుకుంటారు. అంతేకాకుండా దీర్ఘకాలిక సమస్యలు కూడా సులభంగా తొలగిపోతాయి. 
 

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

గమనిక..

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

ZEENEWS TRENDING STORIES