SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

డిసెంబర్ రాకముందే ఈ 4 రాశులకు బంపర్ బెనిఫిట్స్.. బుధుడి సంచారంతో ధనలాభం, ఉద్యోగంలో ప్రమోషన్లు!

Mercury Nakshatra Transit: అతి త్వరలోనే డిసెంబర్ నెల ప్రారంభం కాబోతోంది. అయితే, ఈ నెల ప్రారంభం కాకముందే 25వ తేదీన బుధుడు నక్షత్ర సంచారం చేయబోతున్నాడు. దీని కారణంగా కొన్ని రాశుల వారికి ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ఆర్థికంగా వస్తున్న సమస్యలు కూడా తొలగిపోబోతున్నాయి..

Written By Dharmaraju Dhurishetty
Published: Nov 22, 2026, 10:27 IST | Updated: Nov 22, 2026, 10:29 IST
Image Credit: ZEE TELUGU NEWS
Join

Mercury Nakshatra Transit: మరో 8 రోజులు అయితే నవంబర్ నెల పూర్తయిపోతుంది. దీంతో ఈ ఏడాది చివరి నెల డిసెంబర్ కూడా ప్రారంభమవుతుంది. ఇదిలా ఉంటే నవంబర్ 25వ తేదీన మహా అద్భుతం జరగబోతోంది. బుధుడు వైశాఖ నక్షత్రంలోకి సంచారం చేయబోతున్నాడు. ఈ నక్షత్రానికి అధిపతి దేవగురువు బృహస్పతి కావడం విశేషం.. అయితే, ఈ సమయంలో ముఖ్యంగా నాలుగు రాశుల వారిపై ఊహించని ప్రభావం పడుతుందని ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర నిపుణులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో కొన్ని రాశుల వారికి తెలివితేటలు విపరీతంగా పెరగడమే కాకుండా డబ్బు సంబంధిత సమస్యలు పూర్తిగా తొలగిపోబోతున్నాయి. వ్యాపారాలపరంగా అనుకున్న ధన లాభాలు కూడా సొంతం చేసుకోగలుగుతారు. ఉద్యోగాల తో పాటు ఇతర అంశాల్లో గొప్ప పురోగతి కూడా సంపాదిస్తారని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే ఈ సమయంలో ఎక్కువగా ఏ రాశుల వారికి మేలు జరుగుతుంది? దానికి సంబంధించిన అన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ రాశులవారికి లాభాలు:
మకర రాశి 
ముఖ్యంగా బుధుడి నక్షత్ర సంచారం మకర రాశి వారి జీవితంపై ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు నాగరాజ శర్మ తెలుపుతున్నారు. వీరికి ఆఫీసుల్లో అద్భుతమైన ప్రమోషన్స్ లభించడమే కాకుండా చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు కూడా సకాలంలో పూర్తి కాబోతున్నాయి. జీవితంలో శాంతి కూడా నెలకొనే అవకాశాలు కూడా ఉన్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఈ సమయంలో కుటుంబ సభ్యులకి సంతోషంగా ప్రశాంతంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే వ్యాపారాలు చేసే వారికి ఈ సమయం గోల్డెన్ ఛాన్స్‌గా మారబోతుంది. ముఖ్యంగా ఎలాంటి ప్రయత్నాలు చేసినా అద్భుతమైన విజయాలు కూడా సాధించే అవకాశాలు కనిపించడం విశేషం..

ధనస్సు రాశి 
ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా బుధుడి సంచారం వల్ల విశేషమైన ప్రయోజనాలు కలగబోతున్నాయి. ముఖ్యంగా అనేక సమస్యలు సులభంగా పరిష్కారం కావడమే కాకుండా ఆఫీస్ రాజకీయాల నుంచి కూడా సులభంగా బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు నాగరాజ శర్మ తెలుపుతున్నారు. అంతేకాకుండా ఆఫీసుల్లో వీరికి అద్భుతమైన ప్రశంసలు కూడా లభించబోతున్నాయి. అలాగే ఎలాంటి వ్యాపారాలు చేసిన అద్భుతమైన విజయాలు సాధించే అవకాశాలు ఉన్నాయి. కొత్త పెట్టుబడుల నుంచి భారీ మొత్తంలో ధన లాభాలు కూడా సొంతం చేసుకోగలుగుతారు. ఆర్థిక సమస్యలు కూడా పూర్తిగా పరిష్కారం అయ్యే ఛాన్సులు ఉన్నాయి..

మిధున రాశి 
మిధున రాశి వారికి కూడా బుధ గ్రహ సంచారం చాలా అద్భుతంగా ఉంటుందని జ్యోతిష్యులు నాగరాజ శర్మ తెలుపుతున్నారు. వీరికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులన్నీ సులభంగా పూర్తి కాబోతున్నాయి. ఆఫీసులో వస్తున్న సమస్యలు కూడా సులభంగా పరిష్కారం కాబోతున్నాయి. ముఖ్యంగా వీరికి ఊహించని స్థాయిలో జీతాలు కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని దీని కారణంగా ఆధార వనరులు కూడా మెరుగుపడతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా డబ్బు కోరత వంటి సమస్యలతో బాధపడే వ్యక్తులకు మంచి పరిష్కారాలు కూడా లభించబోతున్నాయి..

మీన రాశి 
మీన రాశి వారికి కూడా బుధ గ్రహ సంచారం ఎంతో అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా వీరికి జీవితంలో అత్యుత్తమ సమయంగా మారబోతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా కుటుంబంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండడం వల్ల విశేషమైన లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. తల్లిదండ్రుల నుంచి కూడా అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ప్రేమ విషయాల్లో కూడా విశేషమైన ధన లాభాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతూ ఉన్నారు.

NOTE:

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

ZEENEWS TRENDING STORIES