SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

సెప్టెంబర్ 18న బుధుడు ఉదయం.. ఈ 3 రాశుల వారికి బంపర్ లాభాలు.. డబ్బు, ఆస్తి, ఉద్యోగంలో శుభ ఫలితాలు!

Mercury Rises Effect On Zodiac: సెప్టెంబర్ 18వ తేదీన కన్యారాశిలో బుధ గ్రహం ఉదయించబోతోందని.. దీని కారణంగా మూడు రాశుల వారికి బంపర్ లాభాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర పండితులు నాగరాజ శర్మ తెలిపారు.. ఈ సమయంలో అనుకున్న లాభాలు కలగడమే కాకుండా కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయని ఆయన అన్నారు.. ఏరాశుల వారికి ఎక్కువగా లాభాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయో ఇప్పుడు తెలుసుకోండి.

Reported By Dharmaraju Dhurishetty Written By Dharmaraju Dhurishetty
Published: Sep 19, 2026, 09:01 AM IST | Updated: Sep 19, 2026, 09:05 AM IST
Image Credit: సెప్టెంబర్ 18న బుధుడు ఉదయం.. ఈ 3 రాశుల వారికి బంపర్ లాభాలు.. డబ్బు, ఆస్తి, ఉద్యోగంలో శుభ ఫలితాలు!
Join

Mercury Rises Effect On Zodiac Telugu: వేద జ్యోతిష్య శాస్త్రంలో భూత గ్రహాన్ని మేధస్సుతో పాటు వ్యాపారం, వాదన, కమ్యూనికేషన్, ఆర్థిక విషయాలకు సూచికగా భావిస్తారని ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తంజావూరి నాగరాజు శర్మ తెలిపారు. 2026 సంవత్సరం సెప్టెంబర్ 18వ తేదీ చాలా ప్రత్యేకమైనదని.. ఈ రోజున బుధుడు తనకు అత్యంత ఇష్టమైన ఉచ్చరాశిగా భావించే కన్యారాశిలో ఉదయించబోతున్నాడని ఆయన అన్నారు.. ఒక గ్రహం ఉదయించినప్పుడు.. శక్తితో పాటు ప్రభావం మరింత పెరుగుతుందని.. దీంతో ఎంతో శక్తివంతమైన భద్ర రాజయోగం ఏర్పడుతుందని పండితులు తెలిపారు.. ముఖ్యంగా కొన్ని రాశుల వారికి ఈ సమయంలో ఆర్థిక పరిస్థితులు బలోపేతం అవ్వడమే కాకుండా.. కోరుకున్న కోరికలు సులభంగా నెరవేరుతాయని ఆయన అన్నారు. ముఖ్యంగా దీర్ఘకాలిక సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుందని ఆయన తెలిపారు.

ఈ రాశుల వారికి బంపర్ లాభాలు..
వృషభ రాశి 
బుధుడు ఉదయించడం కారణంగా అత్యధిక లాభాలు పొందబోయే రాశుల వారిలో వృషభ రాశి ముందు స్థానంలో ఉంటుందని నాగరాజు శర్మ తెలిపారు.. వీరికి ఆకస్మిక ఆర్థిక లాభాలు కలగడమే కాకుండా ఏదైనా పెట్టుబడుల నుంచి భారీ మొత్తంలో లాభాలు కూడా సొంతం చేసుకోగలుగుతారన్నారు. ముఖ్యంగా స్టాక్ మార్కెట్లతో పాటు ట్రేడింగ్, లాటరీలతో సంబంధం ఉన్న వ్యక్తులకు ఊహించని దాని కంటే ఎక్కువగా ధన లాభాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయని ఆయన తెలిపారు.. ముఖ్యంగా ఈ సమయంలో విద్యార్థులకు విశేషమైన ప్రయోజనాలు చేకూరతాయని ఆయన వెల్లడించారు. పోటీ పరీక్షల్లో అద్భుతమైన విజయాలు సాధించగలుగుతారని.. కష్టపడి ఉద్యోగాలు కూడా పొందే అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారు.

మిథున రాశి 
బుధ గ్రహం ఉదయించడం కారణంగా మిధున రాశి వారికి కూడా అద్భుతమైన పురోగతి లభించే అవకాశాలు కనిపిస్తున్నాయని ఆయన తెలిపారు. ముఖ్యంగా వీరు ఈ సమయంలో తప్పకుండా కొత్త ఇల్లులతో పాటు ఆస్తులు కూడా కొనుగోలు చేసి అద్భుతమైన ప్రయోజనాలు పొందగలుగుతారని ఆయన అన్నారు.. పాత వివాదా లేవైనా ఉంటే పరిష్కారం కావడమే కాకుండా గతంలో ఇతరులతో పడ్డ గొడవలకు అద్భుతమైన పరిష్కారం దొరుకుతుందని ఆయన తెలిపారు.. ముఖ్యంగా శుభవార్తలు ఈ సమయంలో తప్పకుండా వింటారని.. మీడియా మార్కెటింగ్ ఐటీ రంగాల్లో పనులు చేసేవారు అద్భుతంగా లాభపడతారని ఆయన అన్నారు.

Also Read: గరుడ పురాణం ప్రకారం.. ఈ 4 అలవాట్లు మిమ్మల్ని పేదవారిగా మారుస్తాయి.. తస్మాత్ జాగ్రత్త..

కన్య రాశి 
కన్య రాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా బుధుడు ఉదయించడంతో ఆలోచన శక్తి ఊహించని స్థాయిలో జరుగుతుందని జ్యోతిష్య పండితులు తెలిపారు.. నిర్ణయాత్మక సామర్థ్యాలు కూడా ఊహించని స్థాయిలో పెరుగుతాయి అన్నారు. ముఖ్యంగా పెండింగ్లో ఉన్న పనులు త్వరగా పూర్తవుడమే కాకుండా వ్యాపారాల్లో ఉన్న వ్యక్తులకు కాంట్రాక్టులు కూడా లభిస్తాయి అని పండితులు తెలిపారు. దీనివల్ల భారీ లాభాలు పొందడమే కాకుండా వ్యక్తిగత జీవితంలో వస్తున్న సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలుగుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు నాగరాజు శర్మ తెలిపారు.. దీని కారణంగా వీరికి సమాజంలో మళ్లీ గౌరవం విపరీతంగా పెరిగి.. అద్భుతమైన ధన లాభాలు చేకూరుతాయని ఆయన అన్నారు.

నోట్.. ఈ సమాచారం జ్యోతిష శాస్త్ర నిపుణులు తంజావూరి నాగరాజు శర్మ నుంచి సేకరించి రాసింది.. దీనిని జీ తెలుగు న్యూస్ అస్సలు ధృవీకరించదు. అలాగే ఈ వార్త మీ నమ్మకాలపై మాత్రమే ఆధారపడి ఉంటుంది.. కాబట్టి ఇతర వివరాల కోసం.. పండితులు: నాగరాజ శర్మ, ఈ మెయిల్‌ ID: tanarsharma@gmail.com
 

Also Read: గరుడ పురాణం ప్రకారం.. ఈ 4 అలవాట్లు మిమ్మల్ని పేదవారిగా మారుస్తాయి.. తస్మాత్ జాగ్రత్త..

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

ZEENEWS TRENDING STORIES