SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Mercury Transit 2026: హస్తా నక్షత్రంలోకి బుధుడు.. ఈ 3 రాశులకు ఊహించని లాభాలు.. డబ్బే డబ్బు!

Mercury Transit In Hasta Nakshatra: బుధుడు సెప్టెంబర్ 13వ తేదీన హస్తా నక్షత్రంలోకి సంచారం చేశాడు. దీని కారణంగా మొత్తం మూడు రాశుల వారి జీవితాల్లో కీలకమైన మార్పులు సంభవించబోతున్నాయి.. మీన రాశి తో పాటు కన్యారాశుల వారికి అంతులేని ఆనందం లభించి ఊహించని ప్రయోజనాలు పొందబోతున్నారు.

Reported By Dharmaraju Dhurishetty Written By Dharmaraju Dhurishetty
Published: Sep 14, 2026, 11:20 AM IST | Updated: Sep 14, 2026, 11:22 AM IST
Image Credit: హస్తా నక్షత్రంలోకి బుధుడు.. ఈ 3 రాశులకు ఊహించని లాభాలు.. డబ్బే డబ్బు!
Join

Mercury Transit Effect 2026: అన్ని గ్రహాలకు రాకుమారుడిగా బుధ గ్రహాన్ని పరిగణిస్తూ ఉంటారు. ఈ గ్రహాన్ని తెలివితేటలు వాక్చాతుర్యం గణాంకాలు వ్యాపారం సంభాషణ వంటి అంశాలకు సూచికగా చెప్పుకుంటూ ఉంటారు. ఇదిలా ఉంటే సెప్టెంబర్ 13వ తేదీన బుధుడు హస్తా నక్షత్రంలోకి ప్రవేశించాడు. ఉదయం 10 గంటల సమయంలో ఈ నక్షత్రంలోకి సంచారం చేశాడు.. అయితే ఈ గ్రహం సెప్టెంబర్ 21వ తేదీ వరకు అదే రాశిలో సంచార దశలో కొనసాగబోతోంది. ఆ తర్వాత ఇది చిత్తా నక్షత్రం లోకి ప్రవేశించబోతోంది. అయితే, బుధుడు హస్తా నక్షత్రంలో సంచార దశలో ఉండడం వల్ల కొన్ని రాశుల వారికి ఊహించని స్థాయిలో మేలు జరుగుతుంది. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితులు మెరుగుపడి.. డబ్బుకు ఎలాంటి కొరత ఉండదని జ్యోతిష్యులు చెబుతున్నారు. వ్యాపారాలపరంగా విశేషమైన ధన లాభాలు చేకూరుతాయి.. కొత్త ఆదాయ మార్గాలు లభించడమే కాకుండా అనుకున్న పనుల్లో అద్భుతమైన విజయాలు సాధించగలుగుతారు. ముఖ్యంగా ఈ సమయంలో మూడు రాశుల వారికి అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఆ రాశులేవో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.

మిథున రాశి 
బుధుడు హస్తా నక్షత్రంలోకి సంచారం చేయడం కారణంగా మిథున రాశి వారికి ఈ సమయం ఎంతో శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా జీవితంలో వీరు ముందుకు సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపారంలో భారీ లాభాలు చేకూరడమే కాకుండా ఉద్యోగంలో అభివృద్ధి కూడా లభించబోతోంది. డబ్బు సమస్యలు సులభంగా పరిష్కారం కాబోతున్నాయి. ఈ సమయంలో సంబంధాలు పెరగడమే కాకుండా మంచి మంచి వ్యక్తులతో అద్భుతమైన పరిచయాలు ఏర్పడతాయి. అలాగే ఇతరులతో కొన్ని విషయాల్లో ముందుకు సాగే అవకాశాలున్నాయి. ముఖ్యంగా మానసిక ప్రశాంతత మెరుగుపడి మేధో శక్తితో సరైన మార్గంలో ముందుకెళ్తారు.

కన్యా రాశి 
కన్యారాశి వారికి కూడా సెప్టెంబర్ 13వ తేదీ నుంచి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి.. ముఖ్యంగా వీరికి కెరీర్లో ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశాలు కూడా లభిస్తాయి. ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులకు భారీ మొత్తంలో పెద్ద జీతాలు కలిగిన జాబులు లభించబోతున్నాయి. అలాగే ఆఫీసుల్లో పనులు చేసే వ్యక్తులందరికీ తప్పకుండా ప్రమోషన్స్ లభిస్తాయి.. ముఖ్యంగా చాలా కాలంగా నిలిచిపోయిన పనులు సులభంగా పూర్తి కాబోతున్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.. ఈ సమయంలో వ్యాపార వృద్ధి లభించడమే కాకుండా భారీ మొత్తంలో లాభాలు సొంతం చేసుకోగలుగుతారని జ్యోతిష్యులు చెబుతున్నారు. అలాగే వీరు కొత్త ఆదాయ మార్గాలు కూడా పొంది డబ్బులు భారీ మొత్తంలో సంపాదించే అవకాశాలు ఉండడం విశేషం. మానసికంగా ఒత్తిడి కూడా తగ్గి అనుకున్న పనులు తొందరగా చేయగలుగుతారు..

మీన రాశి 
బుధుడు హస్తా నక్షత్రంలోకి సంచారం చేయడం కారణంగా మీన రాశి వారికి కూడా ఎంతో లాభదాయకంగా ఉంటుంది. వృత్తి జీవితంలో పురోగతి సాధించడమే కాకుండా.. ఆఫీసుల్లో తమదైన శైలిలో పనులు చేసి మంచి వ్యక్తులుగా పేరు పొందగలుగుతారు.. ఈ సమయంలో వ్యాపారాలు చేయాలనుకుంటున్న వ్యక్తులకు అద్భుతమైన లాభాలు చేకూరుతాయి. అంతేకాకుండా కొత్త ఉద్యోగాలను పొందాలని చూస్తున్న వ్యక్తులకు మంచి ఆఫర్స్ కూడా లభిస్తాయి.. దీంతోపాటు కొన్ని అనుకూలతల వల్ల డబ్బులు కూడా భారీగా సొంతం చేసుకోగలుగుతారు.. గతంలో డబ్బు సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులందరికీ తప్పకుండా మంచి పరిష్కారం లభించబోతోంది. ముఖ్యంగా బ్యాంకుల్లో భారీ మొత్తంలో డబ్బులు జమ చేసుకోగలుగుతారు.

నోట్..ఇక్కడ అందించిన సమాచారం కేవలం జ్యోతిష్య శాస్త్రం నిపుణుల నుంచి సేకరించి రాసింది మాత్రమే.. దీనికి జీ తెలుగు న్యూస్ కి ఎలాంటి సంబంధం లేదు.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

గమనిక..

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..

 

Add Zee News as a Preferred Source

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

ZEENEWS TRENDING STORIES