SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

బుధుడు తులలోకి ఎంట్రీ.. ఈ రాశుల వారికి ఆర్థికంగా గోల్డెన్ టైమ్.. ఊహించని విజయాలు!

Mercury Transit 2026 Effect On Zodiac: బుధుడు సెప్టెంబర్‌ 26న తులా రాశిలోకి సంచారం చేయబోతోంది. దీని కారణంగా ఈ కింది కొన్ని రాశులవారికి బంపర్ లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా వీరికి ఊహించని స్థాయిలో కీర్తి, ప్రతిష్టలు కూడా రెట్టింపు అవుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తంజావురి నాగరాజు శర్మ తెలిపారు. అయితే, ఏయే రాశులవారికి మేలు జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..

Reported By Dharmaraju Dhurishetty Written By Dharmaraju Dhurishetty
Published: Sep 24, 2026, 06:05 PM IST | Updated: Sep 24, 2026, 06:08 PM IST
Image Credit: జీ తెలుగు న్యూస్..
Join

Mercury Transit 2026 Effect On Zodiac Telugu: నవగ్రహాల్లో వ్యాపారంతో పాటు వాక్చాతుర్యానికి అధిపతిగా భావించే బుధుడు త్వరలోనే రాశి సంచారం చేయబోతున్నాడు. అన్ని గ్రహాలకు రాజకుమారుడిగా భావించే బుధుడు సెప్టెంబర్‌ 26వ తేదిన కన్యారాశి నుంచి ఎంతో మిత్రుడిగా భావించే శుక్రుడి సంబంధించిన తులారాశిలోకి ప్రవేశించబోతున్నాడు. డిసెంబర్‌ 2వ తేది వరకు బుధుడు ఇదే రాశిలో సంచార దశలో కొనసాగుతూ ఉంటాడు. దీంతో పలు రాశులవారికి బంపర్‌ లాభాలు కలిగే అవకాశాలు ఉన్నట్లు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తంజావురి నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితులు మెరుగుపడడమే కాకుండా కీర్తి, ప్రతిష్టలు కూడా విపరీతంగా పెరుగుతాయి. అయితే, ఈ సమయంలో ఏయే రాశులవారికి బంపర్ లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకోండి.

ఆ 8 అదృష్ట రాశులు..
మేష రాశి: 
మేష రాశివారికి ఈ బుధుడి ప్రభావంతో వ్యాపారంలో అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఊహించని పురోగతి కూడా లభిస్తుంది. దాంపత్య జీవితంలో వస్తున్న సంతోషం కూడా రెట్టింపు అవుతుంది. జీవిత భాగస్వామితో కలిగి మంచి మధురమైన క్షణాలు కూడా అనుభవించే ఛాన్స్‌లు కనిపిస్తున్నాయి. ఆకస్మిక ధన లాభాలు కలిగి.. ఆర్థికంగా బాగా రాణిస్తారని, దీని కారణంగా ఆర్థికస్థితి కూడా చాలా వరకు మెరుగుపడుతుందని జ్యోతిష్యలు నాగరాజు శర్మ తెలిపారు.

వృషభ రాశి: 
జ్యోతిష్యులు నాగరాజు శర్మ అందించిన సమాచారం ప్రకారం.. ఉద్యోగ, కార్యాలయాల్లో కీలకమైన విజయాలు కూడా సాధిస్తారు. అలాగే పెద్ద పెద్ద హోదాలు కూడా పెరుగుతాయి. వీరు తప్పకుడా సానుకూల వార్తలు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్థికంగా స్థిరత్వం కూడా ఏర్పడుతుంది.. కుటుంబంలో అవగాహన పెరిగి.. జీవిత భాగస్వామితో సత్సంబంధాలు కూడా ఊహించని స్థాయిలో మెరుగుపడతాయి..

మిథున రాశి: 
జ్యోతిష్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పరిశోధన, కళాత్మక రంగాల వారికి ఇది గోల్డెన్‌ ఛాన్స్‌గా భావించవచ్చు. వ్యాపారస్తులు ఈ సమయంలో తప్పకుండా భారీ ఒప్పందాలు కుదిరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అదృష్టం కలిసివచ్చి.. పెండింగ్‌లో ఉన్న పనులన్నీ చకచకా పూర్తవుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.

సింహ రాశి: 
ఈ సమయంలో సింహ రాశివారికి కూడా ఆత్మవిశ్వాసం, ధైర్యసాహసాలు రెట్టింపు అవుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.. ముఖ్యంగా చిన్నపాటి ప్రయాణాలు అనుకూలించి భారీ మొత్తంలో ధన లాభాలు కూడా కలుగుతాయి.. సమాజంలో పేరుప్రతిష్టలు విపరీతంగా పెరుగుతాయి. కెరీర్‌ పరంగా సరికొత్త బాధ్యతలు లేదా ఉన్నత ప్రాజెక్టులు దక్కే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి.

మకర రాశి: 
బుధుడి ప్రభావంతో మకర రాశివారికి బోలెడు లాభాలు కలుగుతాయి. వీరికి కెరీర్‌ పరంగా వస్తున్న సమస్యలు కూడా సులభంగా తొలగిపోయే ఛాన్స్‌లు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉన్నతాధికారుల నుంచి అద్భుతమైన ప్రశంసలు కూడా పొందుతారు. సమాజంలో మంచి గుర్తింపు లభించి.. దిమ్మతిరిగే ధన లాభాలు కూడా పొందుతారు. బ్యాంక్‌ బ్యాలెన్స్‌ కూడా ఊహించని స్థాయిలో పొందుతారు.

గమనిక.. ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష్య శాస్త్ర నిపుణులు నుంచి స్వీకరించి రాసింది మాత్రమే.. దీనిని జీ తెలుగు న్యూస్‌ అస్సలు దృవీకరించదు..

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

ZEENEWS TRENDING STORIES