Mercury Transit In Virgo: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. నవగ్రహాల్లో బుధ గ్రహానికి చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది.. అక్టోబర్ 17 వరకు ఇదే రాశిలో సంచార దశలో ఉంటాడు. చాలా రోజుల తర్వాత బుధుడు కన్యా రాశిలోకి సంచారం చేశాడు. కాబట్టి దీని కారణంగా కొన్ని రాశులవారిపై ఊహించని ప్రభావం పడుతుంది. ముఖ్యంగా అక్టోబర్ నెల వరకు అద్బుతమైన లాభాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. కోరుకుంటున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి. అలాగే అనుకోకుండా వస్తున్న సమస్యలు కూడా పూర్తిగా పరిష్కారమవుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే, ఈ గ్రహ సంచారంతో ఏయే రాశులవారికి బంపర్ లాభాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఏ రాశులకు ప్రయోజనాలు?
తులారాశి:
తులా రాశివారికి కూడా ఈ సమయంలో ఆదాయం పెరగుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతాయి. దీంతో పాటు వ్యాపారాల పరంగా వస్తున్న సమస్యలు తొలగిపోయి.. ప్రయోజనాలు కూడా చాలా వరకు చేకూరుతాయి. అలాగే ఈ సమయంలో భారీ మొత్తంలో డబ్బులు కూడా సులభంగా సొంతం చేసుకుంటారు. ఏదైన పనులు చేయడం వల్ల సులభంగా విజయాలు సాధిస్తారు.
కర్కాటక రాశి:
కర్కాటక రాశివారికి కూడా ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. వీరికి ఊహించని స్థాయిలో సామర్థ్యం కూడా పెరుగుతుంది. ముఖ్యంగా పనుల్లో వస్తున్న అడ్డంకులు కూడా సులభంగా తొలగిపోయే ఛాన్స్‌లు కనిపిస్తున్నాయి. పెండింగ్‌లో ఉన్న ప్రతి పని ఎంతో సులభంగా పూర్తవుతుంది. ఉద్యోగాలు చేసేవారికి కొత్త కొత్త అవకాశాలు కూడా కలిగే ఛాన్స్‌లు కనిపిస్తున్నాయి.
మేష రాశి:
రాబోయే 30 రోజులలో సూర్య గ్రహానికి సంబంధించిన రాశిలో బుధుడు ఉండడం వల్ల మేష రాశివారికి కూడా చాలా రకాల ప్రయెజనాలు చేకూరుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఉద్యోగాలు చేసేవారికి కొత్త అవకాశాలు కూడా లభిస్తాయి. అంతేకాకుండా అకస్మాత్తుగా డబ్బులు కూడా పొందుతారు. దీంతో పాటు ఈ సయంలో అసంపూర్తిగా ఉన్న పనులు కూడా పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితులు కూడా గతంలో కంటే, ఇప్పుడు మరింత బాగుంటాయి.
ధనుస్సు రాశి:
మేష రాశివారికి కూడా ఈ సమయంలో కొత్త బాధ్యతలు కూడా లభిస్తాయి. వ్యాపారాల పరంగా వస్తున్న ఒప్పందాలు కూడా కుదురుతాయి. అలాగే ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుందని జ్యోతిష్యులు తెలిపారు. వీరు మంచి ప్లానింగ్స్‌తో పనులు చేస్తే అద్భుతమైన విజయాలు కలుగుతాయి. అంతేకాకుండా డబ్బులు కూడా భారీగా సంపాదించే అవకాశాలు కలుగుతాయి. అనుకోని విధంగా డబ్బులు కూడా పొందుతారు.
వృశ్చిక రాశి:
వృశ్చిక రాశివారికి ఈ సమయంలో అనుకోని ధన లాభాలు కలిగే అశకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పనుల్లో కొత్త కొత్త బాధ్యతలు కూడా సులభంగా లభిస్తాయి. ఉద్యోగాల పరంగా వస్తున్న సమస్యలు కూడా సులభంగా తొలగిపోతాయి. ముఖ్యంగా ఈ సమయంలో సమాజంలో గౌరవం కూడా విపరీతంగా పెరుగుతుంది. హోదా కూడా విపరీతంగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు నాగరాజ్ శర్మ తెలిపారు.
గమనిక: ఇవి జ్యోతిష్య శాస్త్ర నిపుణులు నాగరాజు శర్మ అందించిన అంచనాలు మాత్రమే.. దీనిని జీ తెలుగు న్యూస్ అస్సలు ధృవీకరించదు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..