• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆధ్యాత్మికం
  • /ఇంట్లోని మనీ ప్లాంట్ ఆకులు పసుపు పడితే బిగ్ అలర్ట్.. వాస్తు ప్రకారం అది దేనికి సంకేతమో తెలుసా?

ఇంట్లోని మనీ ప్లాంట్ ఆకులు పసుపు పడితే బిగ్ అలర్ట్.. వాస్తు ప్రకారం అది దేనికి సంకేతమో తెలుసా?

వాస్తు శాస్త్రం ప్రకారం మనం ఇంటి నిర్మాణం చేయడమే కాకుండా, ఇంట్లోని వస్తువులను కూడా వాస్తు నియమాల ప్రకారమే అమర్చుకుంటాం. ఇంట్లో ఉండే మొక్కలు కూడా కొన్ని సంకేతాలను ఇస్తాయి. తద్వారా ఇంటికి శుభమో లేదా అశుభమో తెలుసుకోవచ్చు. ఉదాహరణకు, ఇంట్లోని మనీ ప్లాంట్ మొక్క పసుపు రంగులోకి మారితే దాని అర్థం ఏమిటో తెలుసా?

Written ByRenuka Godugu
Published: Sep 25, 2026, 05:58 PM IST|Updated: Sep 25, 2026, 06:01 PM IST
joinshare
ఇంట్లోని మనీ ప్లాంట్ ఆకులు పసుపు పడితే బిగ్ అలర్ట్.. వాస్తు ప్రకారం అది దేనికి సంకేతమో తెలుసా?
Image Credit: Money plant vastu Tips

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Money plant vastu Tips: ఇంట్లో మనీ ప్లాంట్ మొక్క పసుపు రంగులోకి మారిపోతే దానిని తేలికగా తీసుకోకండి. వాస్తు ప్రకారం అది కొన్ని అశుభ ఫలితాలను ఇవ్వవచ్చు. సాధారణంగా మనం ఇంట్లో తులసి, కలబంద, మనీ ప్లాంట్ వంటి మొక్కలను పెంచుకుంటాం. కానీ ముళ్ళ మొక్కలను మాత్రం పెంచకూడదు. మనీ ప్లాంట్, తులసి మొక్కలను వాస్తు ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేయడం వల్ల ఇంట్లోకి పాజిటివిటీ, సుఖసంతోషాలు వస్తాయి. అయితే, ఇటువంటి మొక్కలు ఎండిపోవడం లేదా పసుపు రంగులోకి మారడం వాస్తు ప్రకారం అశుభ సూచకం. మనీ ప్లాంట్ మొక్కను ఎంతో పవిత్రమైనదిగా, ఇంటి సుఖశాంతులతో ముడిపడి ఉన్నదిగా పరిగణిస్తారు, కాబట్టి అది పసుపు రంగులోకి మారితే ఏం జరుగుతుందో తెలుసుకోవాలి.

ఇంట్లో మనీ ప్లాంట్ ఆకులు పసుపు రంగులోకి మారితే, అది వాస్తు ప్రకారం కొన్ని ఆర్థిక సమస్యలను తీసుకురావచ్చు. దీనిని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు, ఎందుకంటే ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. వాస్తు ప్రకారం మనీ ప్లాంట్‌ను పాజిటివిటీ కోసం పెంచుతాము కాబట్టి, అది పసుపు రంగులోకి మారితే ఇంట్లో అశాంతి నెలకొనే అవకాశం ఉంది.

అందువల్ల, ఇంట్లోని మనీ ప్లాంట్ మొక్క ఆరోగ్యంగా ఉండటానికి ఎల్లప్పుడూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆకులు ఎండిపోవడం లేదా పసుపు రంగులోకి మారడాన్ని అస్సలు అశ్రద్ధ చేయకండి; అలా జరిగితే ఇంట్లో అశాంతి పెరిగి గొడవలు వచ్చే అవకాశం ఉంది, అలాగే పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తికావు. ఎదుగుదల కూడా తగ్గుతుంది. ఇలాంటి సూచికలు కనిపిస్తుంటాయి.

అదేవిధంగా, వాస్తు ప్రకారం మనీ ప్లాంట్ మొక్కను ఆగ్నేయ దిశలో ఏర్పాటు చేసుకోవాలి. మొక్కకు సరైన దిశ, ఆకులు ఎండిపోకుండా చూసుకోవడం చాలా ముఖ్యం, లేకపోతే అది ఇంట్లో నెగెటివిటీని పెంచుతుంది. ఆ మొక్కకు క్రమం తప్పకుండా పోషణ, సరైన సంరక్షణ అందించడం అలవాటు చేసుకోవాలి, తద్వారా మొక్క పాడవకుండా ఉంటుంది.

మనీ ప్లాంట్‌ను ఇండోర్ లేదా అవుట్‌డోర్ మొక్కగా, నీటిలో కూడా సులభంగా పెంచుకోవచ్చు. ఈ మొక్కను పెంచేటప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఇంట్లోని ఆక్సిజన్ స్థాయి పెరుగుతుంది. ఇంటికి ఎంతో అందాన్ని ఇస్తుంది. ఇది మంచి పాజిటివిటీని ఇచ్చే గుణాన్ని కలిగి ఉంటుంది కాబట్టి, మనీ ప్లాంట్ సంరక్షణ ఎప్పుడూ అవసరం. మొక్కను నాటేటప్పుడు తొట్టి, నీటి వ్యవస్థ సరిగ్గా ఉందో లేదో చూసుకోవా. అలాగే మొక్కకు మరీ ఎక్కువగా లేదా మరీ తక్కువగా నీరు పోయకూడదు.

Add Zee News as a Preferred Source
TAGS:
Spirituality