SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

డిసెంబర్ 5 వరకు త్రిగ్రాహి యోగం.. ఈ రాశుల వారికి బంపర్ లాభాలు.. కోరుకున్న కోరికలు నెరవేరుతాయి!

Trigrahi Yoga 2026: డిసెంబర్ 5వ తేది వరకు త్రిగ్రాహి యోగ ప్రభావం కొనసాగుతుంది. అప్పటి వరకు కొన్ని రాశులవారికి బంపర్‌ లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. వీరికి కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి. అంతేకాకుండా వ్యాపారాల పరంగా అద్భుతమైన లాభాలు కలిగే ఛాన్స్‌లు ఉన్నాయి.

Written By Dharmaraju Dhurishetty
Published: Nov 21, 2026, 10:13 IST | Updated: Nov 21, 2026, 10:14 IST
Image Credit: ZEE TELUGU NEWS
Join

Trigrahi Yoga 2026 Effect: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గ్రహాల కదలికలతో పాటు వాటి కలయికలకు చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. వీటి ప్రభావం మానవ జీవితాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ప్రస్తుతం సూర్యభగవానుడి సొంత రాశిగా చెప్పుకునే సింహరాశిలో ఒక అరుదైన ఖగోళ, జ్యోతిష్య పరిణామం చోటుచేసుకుందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ఇప్పటికే సింహరాశిలో దేవగురువు బృహస్పతి, కేతువుల కలయిక జరిగింది. నవంబర్ 12వ తేదీన గ్రహాలకు అధిపతి అయిన కుజుడు కూడా ఇదే రాశిలోకి సంచారం చేశాడు.. దీంతో సింహరాశిలో కుజ, గురు, కేతువుల కలయికతో జరిగింది. ఈ గ్రహాల కలయికతో ఎంతో శక్తివంతమైన త్రిగ్రాహి యోగం ఏర్పడిందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు.

ఈ అరుదైన గ్రహ సంయోగం డిసెంబర్ 5వ తేదీ వరకు కొనసాగనుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. కేతువు సింహరాశిని వదిలి కర్కాటక రాశిలోకి సంచారం చేసే వరకు ఈ యోగ ప్రభావం కొనసాగుతుందట. అప్పటివరకు ఈ త్రిగ్రాహి యోగ ప్రభావం ద్వాదశ రాశులపై ప్రభావం పడుతుంది. ముఖ్యంగా మూడు రాశుల వారికి మాత్రం ఊహించని స్థాయిలో అదృష్టం కలుగుతుందని జ్యోతిష్యులు జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. అయితే, ఏయే రాశులవారికి బంపర్‌ లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ రాశులవారికి బంపర్‌ లాభాలు:
తులా రాశి:
తులా రాశి వారికి పదకొండవ స్థానంలో కుజ, గురు, కేతువుల కలయిక జరిగింది.. కాబట్టి వీరికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి.. ఫలితంగా ఆదాయ మార్గాలు కూడా సులభంగా విస్తారిస్తారు. ఎప్పటినుంచో వృత్తిపరమైన ఎదుగుదలలో సమస్యలు ఎదర్కొంటున్నవారు ఈ సమయంలో మంచి ఫలితాలు కూడా పొందుతారు. ఉద్యోగులకు పదోన్నతులు లేదా కొత్త బాధ్యతలు లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. వ్యాపారస్తులకు కొత్త పరిచయాలు ఏర్పడి.. వాటి నుంచి భారీ లాభాలు కూడా పొందుతారు.

వృశ్చిక రాశి:
వృశ్చిక రాశి వారికి కర్మ స్థానమైన పదవ స్థానంలో ఈ మహా సంయోగం ఏర్పడబోతోందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. పైగా ఈ రాశికి అధిపతి కుజుడు కావడం వల్ల ఈ గోచారం వీరికి మరింత లాభదాయకంగా ఉంటుంది.. కెరీర్ పరంగా మీరు ఉన్నత శిఖరాలను కూడా చేరుకుంటారు. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న నిరుద్యోగులకు మంచి ఆఫర్లు కూడా సులభంగా లభిస్తాయి. ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నవారికి కీలక బాధ్యతలు కూడా లభిస్తాయి.. ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు కష్టాల నుంచి ఉపశమనం కూడా సులభంగా పొందుతారు.

కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారికి ఈ త్రిగ్రాహి యోగం వల్ల విశేషమైన లాభాలు కలిగే ఛాన్స్‌లు కనిపిస్తున్నాయి. దీనివల్ల ఈ రాశి వారికి ఆర్థికంగా తిరుగులేకుండా ఉంటుంది. ఆకస్మిక ధనలాభాలు కలిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. గతంలో పెట్టిన పెట్టుబడులు లేదా చేసిన కష్టానికి ఇప్పుడు మంచి ప్రతిఫలాలు రావడం ప్రారంభమవుతాయి. ఉద్యోగస్తులు తమ పనితీరుతో ఉన్నతాధికారుల ప్రశంసలు కూడా సులభంగా పొందుతారు. మీ మాట తీరుతో క్లిష్టమైన పనులను సైతం సులభంగా పూర్తి చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. కుటుంబంలో మీ మాటకు విలువ, గౌరవం కూడా సులభంగా పెరుగుతాయి..

NOTE:

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

ZEENEWS TRENDING STORIES