Nav pancham raj yog 2026: నవపంచమ రాజయోగం ప్రభావం.. ఈ రాశులకు ఆకస్మిక ధనలాభంతో పాటు లగ్జరీలైఫ్.!.
Nav pancham raj yog effect: ముఖ్యంగా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అమావాస్య వేళ నవపంచమ రాజయోగం ఏర్పడుతుంది. దీని ప్రభావం వల్ల కొన్ని రాశులకు జీవితంలో ఆకస్మిక ధనలాభం కల్గుతుంది.
Nav pancham raj yog effect 2026 these are lucky zodiac signs: జ్యోతిష్య పండితుల ప్రకారం ఒక మనిషి జీవిత గమనాన్ని నవగ్రహాలు శాసిస్తాయని చెప్తారు. గ్రహలు శుభ స్థానాల్లో ఉంటే గొప్ప ఫలితాలు, అదే విధంగా చెడు స్థానంలో ఉంటే , అంతే చెడు ఫలితాలు కల్గుతాయి. ఈ క్రమంలో సర్వ పితృ అమావాస్య వేళ అక్టోబర్ 10న నవపంచమ రాజయోగం ఏర్పడుతుంది. దీని ప్రభావం వల్ల కొన్ని రాశులకు అనుకొని విధంగా ధనలాభంతో పాటుజీవితంలో గొప్ప మార్పులు సంభవిస్తాయి. అమావాస్య వేళ కర్కాటక రాశిలో గురుడు 9వ స్థానంలోను, శుక్రుడు 5వ స్థానంలో వచ్చి ఉంటున్నారు. దీని ప్రభావం మొత్తంగా ద్వాదశ రాశులపై ఉంటుంది. ఆ లక్కీ రాశులు ఏంటో చూద్దాం.
మేషం.. ఈ రాశుల వారు కోర్టు కేసులలో విజయాలు సాధిస్తారు. జీవితంలో పట్టుకున్నదంతా బంగారం అవుతుంది.సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కోరుకున్న యువతితో పెళ్లి కుదురుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో రాణిస్తారు.
కన్య.. ఈ రాశుల వారికి సంఘంలో పలుకు బడి కల్గిన వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. విదేశాలకు వెళ్లే వారికి శుభవార్తలు అందుతాయి. ఆకస్మికంగా ధనలాభంతో పాటు, ఉద్యోగాల్లో ప్రమోషన్లు కూడా వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి.
మకరం.. వీరికి లాభస్థానాల్లో గురువు, శుక్రుడి సంచారంవల్ల జీవితంలోని సమస్యలు క్రమ క్రమంగా దూరమౌతాయి. పేరు, ప్రతిష్టలు పెరుగుతాయి. రాదనుకున్న డబ్బులు మీ సొంతమౌతాయి. పలుకు బడి కల్గిన వ్యక్తులతో పరిచయాలతో రాజకీయాల్లోరాణిస్తారు.
మీనం.. ఈ రాశుల వారికి భూమి సంబంధ లావాదేవీలు, స్టాక్ మార్కెట్ లు, ఆర్థికపర అంశాలపై పెట్టే పెట్టుబడిపై ధనలాభం కన్పిస్తుంది. వీరు చేపట్టిన ప్రతిపనిలో కూడా విజయం సాధిస్తారు. సంఘంలో వీరికి మంచి పలుకు బడి కల్గుతుంది. జీవితంలో గొప్పగా విజయాలను సాధిస్తారు. సంతానం విషయంలో శుభవార్తలు వింటారు. ( గమనిక- ఈ స్టోరీ నమ్మకం, విశ్వాసాలపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. జీ తెలుగు మీడియా దీనికి బాధ్యతవహించదు..)