• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆధ్యాత్మికం
  • /నవ పంచమి రాజయోగం ఎఫెక్ట్‌.. ఈ 4 రాశులకు పట్టిందల్లా బంగారమే, బంపర్‌ జాక్‌పాట్‌!

నవ పంచమి రాజయోగం ఎఫెక్ట్‌.. ఈ 4 రాశులకు పట్టిందల్లా బంగారమే, బంపర్‌ జాక్‌పాట్‌!

Nava Panchami Raj Yoga Effect: సెప్టెంబర్ 26వ తేదీన గురు చంద్రగ్రహాల కలయిక కారణంగా ఎంతో శక్తివంతమైన నవ పంచమి రాజయోగం ఏర్పడిందని ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తంజావూరి నాగరాజు శర్మ తెలిపారు. ఈ సమయంలో కొన్ని రాశుల వారికి పూర్తిగా ఒత్తిడి తొలగిపోయి.. మానసిక సమస్యల నుంచి విముక్తి కలుగుతుందని ఆయన చెబుతున్నారు.. అయితే, ఈ సమయంలో అద్భుతమైన లాభాలు పొందే రాశులేవో తెలుసుకోండి..

Reported ByDharmaraju DhurishettyEdited ByDharmaraju Dhurishetty
Published: Sep 27, 2026, 09:57 AM IST|Updated: Sep 27, 2026, 10:01 AM IST
joinshare
నవ పంచమి రాజయోగం ఎఫెక్ట్‌.. ఈ 4 రాశులకు పట్టిందల్లా బంగారమే, బంపర్‌ జాక్‌పాట్‌!
Image Credit: జీ తెలుగు న్యూస్..

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Nava Panchami Raj Yoga Effect On Zodiac: కొన్ని గ్రహాలు సంచారం చేయడం కారణంగా అన్ని రాశుల వారిపై శుభ ప్రభావాలను చూపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా కొన్ని గ్రహాలు ఒకే రాశిలో కలయిక జరిపినప్పుడు యోగాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. ఇదిలా ఉంటే సెప్టెంబర్ 26వ తేదీ ఉదయం 5 గంటలకు ఓ అద్భుతమైన యోగం ఏర్పడింది. ముఖ్యంగా ఈ సమయంలో చంద్రుడు మీన రాశిలోకి ప్రవేశించడంతోపాటు.. కర్కాటక రాశికి అధిపతి అయిన గురుడు ప్రభావం రెట్టింపు కావడంతో ఈ సమయంలో ఎంతో శక్తివంతమైన నవ పంచమి రాజయోగం ఏర్పడింది.


జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురు గ్రహాన్ని జ్ఞానంతో పాటు అదృష్టం సంపద సంతానానికి అధిపతిగా పరిగణిస్తూ ఉంటారు. మరోవైపు చంద్రుడిని మనస్సుతోపాటు ఆనందం, ఆర్థిక స్థితికి ప్రతీకగా చెప్పుకుంటారు. అయితే, ఈ రెండు గ్రహాలు కలిసినప్పుడు ఎంతో శక్తివంతమైన నవ పంచమి రాజయోగం ఏర్పడుతుందని ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తంజావూరి నాగరాజు శర్మ తెలిపారు. దీని ఫలితంగా సుఖసంతోషాలు పెరగడమే కాకుండా ఆదాయం ఊహించని స్థాయిలో పెరుగుతుందని డబ్బు సంబంధిత కోరత కూడా పూర్తిగా తొలగిపోతుందని ఆయన అన్నారు. అయితే, ఈ సమయంలో అద్భుతమైన లాభాలు పొందే రాశులేవో తెలుసుకోండి.

వృషభ రాశి 
వృషభ రాశి వారికి ఈ శక్తివంతమైన నవ పంచమి రాజయోగం ప్రభావంతో ఆదాయం విపరీతంగా పెరుగుతుందని ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తంజావూరి నాగరాజు శర్మ తెలిపారు. కొత్త ఆదాయ మార్గాలు లభించడమే కాకుండా సంపాదన కూడా విపరీతంగా పెరుగుతుంది. వ్యాపారంలో భారీ ఆదాయాలు రావడం ప్రారంభమవుతాయని ఆయన తెలిపారు. వ్యాపారాలు చేసే వ్యక్తులకు కొత్త ప్రాజెక్టులు లభించడమే కాకుండా డబ్బు విపరీతంగా లభిస్తుంది. అంతేకాకుండా కష్టాలన్నీ తొలగిపోయి జీవితంలో నుంచి అశాంతి పూర్తిగా తొలిగిపోతుందని ఆయన తెలుపుతున్నారు. అనవసరంగా ఆందోళన చెంది.. మానసిక సమస్యల బారిన పడకుండా ఉండడం మంచిదన్నారు.

కర్కాటక రాశి 
గురుచంద్ర గ్రహాల కలయిక కారణంగా కర్కాటక రాశి వారికి అదృష్టం విపరీతంగా పెరగబోతా ఉందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఉద్యోగంలో ప్రతిష్ట విపరీతంగా పెరిగి సమాజంలో గౌరవం కూడా అధికమవుతుంది. అంతేకాకుండా పెద్ద పెద్ద వ్యాపారాలు చేసే వారికి ఈ సమయంలో విశేషమైన గుర్తింపు లభించబోతోంది. వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటున్న వ్యక్తులకు ఈ సమయం ఎంతో లాభదాయకంగా ఉంటుంది. అలాగే గతంలో పెట్టిన డబ్బులు కూడా సులభంగా వచ్చే అవకాశాలున్నాయి. డబ్బు గురించి చింతన వదిలేసి జీవితంలో ముందుకు సాగితే అంతా శుభమే జరుగుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.


వృశ్చిక రాశి 
గురు చంద్రగ్రహాల కలయికతో వృచ్చిక రాశి వారికి కూడా ఎలాంటి ధన కొరత ఉండదని ప్రముఖ జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలిపారు. ముఖ్యంగా వీరికి జీవితంలో కష్టాలు తీరిపోయి.. అనేక రకాల సమస్యల నుంచి విముక్తి లభించబోతోంది. అలాగే ధార్మిక కార్యకలాపాలపై కూడా ఆసక్తి ఊహించని స్థాయిలో పెరుగుతుంది. ఉద్యోగంలో మెరుగుదల లభించడమే కాకుండా పెద్ద మొత్తంలో వ్యాపారాలు చేయాలనుకుంటున్న వ్యక్తులకు ఈ సమయం ఎంతో లాభదాయకంగా ఉంటుంది. అంతేకాకుండా కొత్త ఆదాయ మార్గాలు లభించడంతో వీరు భారీ మొత్తంలో డబ్బులు పొందగలుగుతారు. అనుకుంటున్న పనుల్లో విజయాలు కూడా సులభంగా సాధించగలుగుతారు.

మీనరాశి 
మీన రాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా ఈ సమయం చాలా లాభదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా జీవితంలో వస్తున్న కష్టాలు తొలగిపోయి అశాంతి నుంచి విముక్తి లభిస్తుంది. అలాగే మానసిక ఒత్తిడి కూడా పూర్తిగా తగ్గి పెద్దపెద్ద సమస్యల నుంచి పరిష్కారం దొరుకుతుంది.. అంతేకాకుండా ఒత్తిడి నుంచి విముక్తి లభించి అనేక సమస్యలు తొలగిపోతాయని ప్రముఖ జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. వీరికి అనుకుంటున్న పనుల్లో అద్భుతమైన విజయాలు కలుగుతాయి.. ముఖ్యంగా ఇతరులతో మంచి సమయాన్ని గడిపి సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు..

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

గమనిక..

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News
Telugu Astrology
Astrological Remedies