SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ఇంట్లో పొరపాటున కూడా ఈ 5 మొక్కలు పెంచకండి.. దరిద్రం, నెగిటివ్ ఎనర్జీ వచ్చే ప్రమాదం!

ఇంట్లో కొన్ని మొక్కలు పెంచుకోవడం వల్ల ఇంటికి శుభప్రదం కలుగుతుంది. అదే విధంగా కొన్ని మొక్కలను ఇంట్లో పెట్టుకుంటే నెగెటివిటీ పెరుగుతుంది. ఇంట్లో అలా పెట్టకూడని ఐదు మొక్కల జాబితా ఏమిటో తెలుసుకుందాం.

Written By Renuka Godugu
Published: Nov 15, 2026, 17:40 IST | Updated: Nov 15, 2026, 17:43 IST
Image Credit: Vastu Tips:
Join

Vastu Tips: సాధారణంగా ప్రతి ఒక్కరి ఇళ్లలో సుఖశాంతులు వెల్లివిరియాలని కోరుకుంటారు. దీనికోసం ప్రతిరోజు ఇంట్లో పూజతో పాటు వాస్తు ప్రకారం వస్తువులను, ఇంటి నిర్మాణాలను అనుగుణంగా మార్చుకుంటారు. అయితే ఇంట్లో నెగెటివిటీ ప్రభావం తగ్గితేనే ఇంట్లో సుఖశాంతులు వెల్లివిరుస్తాయి. పొరపాటున కూడా ఈ ఐదు రకాల మొక్కలు ఇంట్లో ఉంటే సుఖశాంతులు ఉండవు. వాస్తు ప్రకారం ధనాకర్షణను, పాజిటివిటీని పెంచే మొక్కలనే ఇంట్లో పెట్టుకోవాలి. ఇతర మొక్కలను పెట్టుకోవడం వల్ల అడ్డంకులు ఏర్పడతాయి. అలాంటి మొక్కల జాబితా ఏమిటో తెలుసుకుందాం.

బోన్సాయ్ మొక్కలు..
ఇంటికి కాస్త అలంకరణగా ఉంటుందని చాలా మంది బోన్సాయ్ మొక్కలు పెంచుకుంటున్నారు. ఈ మొక్కలు ఇంట్లో ఉండటం వాస్తుపరంగా శుభప్రదమని చెప్పలేము. ఇవి చిన్నగా ఉంటాయి కాబట్టి పెరుగుదలకు అడ్డుగా మారతాయి. కాబట్టి ఇంట్లో వీటిని ఏర్పాటు చేసుకోకూడదు. దీనివల్ల కెరీర్ పరంగా పురోగతి తగ్గి, అభివృద్ధి ఉండకపోవచ్చు. బోన్సాయ్ మొక్కలు కావాలంటే ఆఫీసులో లేదా బాల్కనీలో ఏర్పాటు చేసుకోవచ్చు. ఇంట్లో ప్రధానంగా ఉండే హాల్ వంటి ప్రాంతాల్లో వీటిని ఉంచకూడదు.

కాక్టస్..
కాక్టస్ మొక్కలను కూడా ఇంట్లో పెట్టుకోకూడదు. వాస్తు ప్రకారం ఇవి అశుభం, నెగెటివిటీని పెంచుతాయి. ఇంట్లో కాక్టస్ పెంచడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లోపించే అవకాశం ఉంది. వీటిని ఇంటి బాల్కనీలో లేదా టెర్రస్‌పై పెట్టుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఇంటిపై చెడు దృష్టి తగ్గుతుంది.
ఇవే కాకుండా ఇంట్లో చింతపండు లేదా పత్తి వంటి మొక్కలు కూడా ఉండకూడదు. ఇవి వాస్తు ప్రకారం అశుభకరం, కాబట్టి ఇంట్లో పెంచుకోకూడదు. ఇవి నెగెటివ్ ఎనర్జీకి దోహదం చేస్తాయి.

గోరింటాకు మొక్క..
మెహందీ అంటే అందరికీ ఇష్టమే, గోరింటాకు పెట్టుకోవడమూ ఇష్టమే. అయితే ఈ మొక్కకు ముళ్ళు ఉంటాయి కాబట్టి ఇంట్లో పెట్టుకోకూడదు. ఇది ఇంట్లో అశుభాన్ని తీసుకువస్తుంది, గొడవలు పెరిగే అవకాశం ఉంది. వాస్తు ప్రకారం దీన్ని ఇంటి బయట ప్రాంతంలో ఏర్పాటు చేసుకోవచ్చు.

Read Also: ఇంట్లో ఎన్ని కిటికీలు ఉంటే లక్ష్మీదేవి కొలువై ఉంటుందో తెలుసా? ఈ నియమాలు తెలుసుకోండి!
Read Also: ఇంట్లో ఇత్తడి తాబేలును ఎందుకు ఉంచాలి? ధన ప్రాప్తికి, విజయానికి 5 శక్తివంతమైన కారణాలు ఇవే!

అంతేకాకుండా ఇంట్లో ఎండిపోయిన మొక్కలు ఉంటే వాటిని ఎప్పటికప్పుడు తొలగించాలి. చనిపోయిన మొక్కలు ఇంటికి ఆశీర్వాదాన్ని తీసుకురావు, నెగెటివిటీని పెంచుతాయి. మొక్కలు ఎప్పుడూ తాజాగా ఉండేలా చూసుకోవాలి. ఎండిపోయిన మొక్కలు ఉంటే వెంటనే తీసేసి కొత్త మొక్కలను ఏర్పాటు చేసుకోవాలి.

రావి చెట్టు..
హిందూ మతంలో రావి చెట్టును అత్యంత పవిత్రంగా భావిస్తారు, చాలా మంది దీనికి పూజలు చేస్తుంటారు. అయితే రావి చెట్టును ఇంట్లో పెట్టుకోవడానికి అది మంచి వాతావరణం కాకపోవచ్చు. దీని వేర్లు పెద్దగా ఉంటాయి కాబట్టి గోడలు, పునాదులకు కూడా విస్తరించే అవకాశం ఉంది. అందువల్ల ఇంటికి కాస్త దూరంలో ఈ మొక్కను పెంచుకోవడం మంచిది.(Disclaimer: ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం సాధారణ నమ్మకాలు, పంచాంగాలు, జ్యోతిష్య అభిప్రాయాల ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. దీనిని శాస్త్రీయంగా నిర్ధారించబడిన సమాచారంగా పరిగణించరాదు. ఈ సమాచారాన్ని మా Zee Telugu News స్వతంత్రంగా ధృవీకరించలేదు.)

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Read More

ZEENEWS TRENDING STORIES