October 7 Astrology Telugu: బుధవారం అక్టోబర్ 7వ తేదికి జ్యోతిష్య శాస్త్రం పరంగా చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. అయితే, ఈ సమయంలో ఒకే రాశిలో చంద్రుడితో పాటు కేతువు ఉండడబోతున్నాయి. అలాగే ఈ సమయంలో బుధుడు తులారాశిలో.. శుక్రడితో కలయిక జరపడం కారణంగా ద్వంద్వ గ్రహ యోగం ఏర్పడింది. అలాగే గురుడు, కుజ గ్రహాల కలయిక వల్ల నీచ స్థితి కూడా ఏర్పడబోతోందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు.. దీంతో అక్టోబర్ 7వ తేది నుంచి ఈ యోగ ప్రభావంతో కొన్ని రాశులవారికి బంపర్ లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా ఆర్థికంగా వస్తున్న సమస్యలు కూడా ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి. అయితే, ఈ సమయంలో ఏయే రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందో? అద్భుతమైన లాభాలు పొందే రాశులవారి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ రాశులవారికి ఈ రోజు నుంచి లాభాలే లాభాలు:
ధనుస్సు రాశి:
ధనుస్సు రాశివారికి ఈ సమయంలో కొత్తకొత్త మార్పులు రావడం ప్రారంభమవుతాయని జ్యోతిష్యులు తంజావురి నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ముఖ్యంగా అన్ని ప్రయత్నాల్లో కూడా విపరీతమైన విజయాలు కూడా కలుగుతాయి. ఆర్థిక పరిస్థితులు కూడా చాలా వరకు శుభప్రదంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి కూడా బోలెడు లాభాలు పొందే ఛాన్స్‌లు ఉన్నట్లు జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అలాగే కొత్త పెట్టుబడుల నుంచి మంచి అవకాశాలు కూడా లభిస్తాయి. చాలా కాలంగా ఖర్చు చేసిన డబ్బులు కూడా తిరిగి పొందుతారు.
వృశ్చిక రాశి:
వృశ్చిక రాశివారికి కూడా ఈ సమయంలో ఎంతో శుభప్రదంగా ఉంటుంది. వీరికి పనుల్లో వస్తున్న అడ్డంకులు కూడా పూర్తిగా తొలగిపోతాయి. అంతేకాకుండా ఉద్యోగాల్లో కూడా కీలక మార్పులు వస్తాయి. వీరు ఈ సమయంలో ఉద్యోగాల పరంగా పదవులు కూడా లభిస్తాయి. పై అధికారుల నుంచి అద్భుతమైన ప్రశంసలు కూడా లభించి.. ఆర్థికంగా అద్భుతమైన లాభాలు పొందుతారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
మేష రాశి:
మేష రాశివారికి ఈ సమయంలో ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉంటుంది. ఆకస్మిక ఆర్థిక లాభాలు కలగడమే కాకుండా వ్యాపారాలు పరంగా చాలా వరకు కలిసి రాబోతోందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. వీరికి ఉద్యోగంలో కూడా చాలా వరకు సానుకూలమైన మార్పులు వస్తాయి. కుటుంబ సభ్యుల నుంచి కూడా మంచి శుభవార్తలు వింటారు. దీర్ఘకాలికంగా వస్తున్న సమస్యలు కూడా చాలా వరకు పరిష్కారం లభిస్తుంది.
కర్కాటక రాశి:
కర్కాటక రాశివారికి కూడా ఈ సమయంలో అనేక విధాలుగా బోలెడు లాభాలు చేకూరుతాయి. వీరికి దీర్ఘకాలికంగా వస్తున్న కుటుంబ సంబంధిత సమస్యలు కూడా చాలా వరకు పరిష్కారమవుతాయి. పూర్వీకుల ఆస్తుల నుంచి కూడా భారీ లాభాలు కూడా పొందుతారు. అంతేకాకుండా ఇల్లు లేదా వాహనాలు కొనుగోలు చేయాలనుకునేవారికి ఈ సమయం ఎంతో లాభదాయకంగా ఉంటుంది. వృత్తివిషయంలో కూడా బోలెడు లాభాలు చేకూరుతాయని జ్యోతిష్యలు నాగరాజు శర్మ తెలుపుతున్నారు.