SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

పితృ పక్షంలో ఈ పనులు చేస్తే ఇంట్లో దరిద్రం చుట్టుముడుతుందా? తప్పక తెలుసుకోండి!

రేపటి నుండి పితృపక్షాలు ప్రారంభం కానున్నాయి. పూర్వీకులకు తర్పణం ఇవ్వడం వెనుక ఒక ఆచారం ఉంది. భద్రపాద బహుళ పాడ్యమి నుండి అమావాస్య వరకు వచ్చే 15 రోజులను మహాలయ పక్షం అని పిలుస్తారు. ఈ పక్షంలో పితృదేవతలకు తర్పణం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో, ఈ 15 రోజుల పాటు కొన్ని పనులు పొరపాటున కూడా చేయకూడదు, అవేంటో తెలుసుకుందాం.

Written By Renuka Godugu
Published: Sep 26, 2026, 07:26 AM IST | Updated: Sep 26, 2026, 07:28 AM IST
Image Credit: Pitru Paksha 2026
Join

Pitru Paksha 2026: రేపటి నుండి, అంటే సెప్టెంబర్ 27వ తేదీ నుండి పితృపక్షం ప్రారంభం కానుంది. రేపు ఆదివారంతో మొదలై అక్టోబర్ 10వ తేదీ సర్వపితృ అమావాస్యతో ఇది ముగుస్తుంది. ఈ 15 రోజుల పాటు పితృదేవతలకు శ్రాద్ధ, తర్పణం వంటివి నిర్వహిస్తారు. ఈ పితృపక్ష సమయంలో కొన్ని పనులు పొరపాటున కూడా చేయకూడదు, లేదంటే పితృ దేవతల ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉంది.

హిందూమతంలో పితృపక్షానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. మన పితృదేవతల ఆశీస్సులు పొందడానికి, వారికి మోక్షం కలిగించడానికి ఈ సమయంలో పిండప్రదానం, శ్రాద్ధ వంటివి నిర్వహిస్తారు. అలాగే ఈ రోజుల్లో దానధర్మాలకు కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.

పితృపక్షంలో పితృదేవతల తిథిని బట్టి శ్రద్ధ కర్మలను నిర్వహిస్తారు. వారి పేరు మీద దానధర్మాలు చేస్తారు. ప్రత్యేకంగా బ్రాహ్మణులకు భోజనం పెట్టడం, పేదవారికి దానధర్మాలు చేయడం వల్ల వారి ఆత్మ శాంతిస్తుందని నమ్ముతారు. 2026లో పితృపక్షం సెప్టెంబర్ 27వ తేదీ ఆదివారంతో ప్రారంభమవుతుంది. ఈ రోజు నుండి 15 రోజుల పాటు తిథుల ఆధారంగా పితృదేవతలకు తర్పణం, పిండప్రదానం వంటివి చేస్తారు. ప్రధానంగా మన పూర్వీకుల మరణ తేదీని ఆధారంగా చేసుకుని ఈ శ్రద్ధ కర్మలను నిర్వహించడం ఆనవాయితీ. ఒకవేళ తెలియని వారు అమావాస్య రోజున నిర్వహించుకోవచ్చు.

అయితే, పితృపక్షంలో చతుర్దశి తిథినాడు సహజ మరణించిన వారికి శ్రద్ధ చేయరు. హింస లేదా అసాధారణ ప్రమాదాల వల్ల మరణించిన వారి కోసం చతుర్దశి తిథి రోజున శ్రద్ధ నిర్వహించడం ఆనవాయితీ.

పితృపక్షంలో చేయకూడని పనులు..
పితృపక్షంలో కొన్ని పనులు పొరపాటున కూడా చేయకూడదు. ఈ రోజుల్లో కేవలం సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి.
మద్యం, మాంసానికి దూరంగా ఉండాలి. 
ప్రధానంగా పితృకర్మ నిర్వహించే రోజున ఎంతో సాత్వికమైన ఆహారం మాత్రమే తీసుకోవాలి.స్వచ్ఛంగా ఉండాలి.
పితృపక్షం రోజుల్లో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు. వివాహాలు, గృహప్రవేశాలు కూడా నిషేధం. 
పితృపక్షంలో గోళ్లు కత్తిరించడం, చుట్టలు కట్ చేసుకోవడం, హెయిర్ కట్ వంటివి కూడా చేయకూడదు.
ఈ సమయాల్లో దానధర్మాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.
మీ సామర్థ్యాన్ని బట్టి ఆహారం, ధాన్యాలు, బట్టలు దానం చేయాలి. ఇంట్లో కేవలం ప్రశాంతమైన వాతావరణం మాత్రమే ఉండాలి. పితృదేవతలను స్మరిస్తున్న సమయంలో గొడవలకు దూరంగా ఉండాలి. పూర్వీకులకు, పితృదేవతలకు నల్ల నువ్వులు, నీళ్లు సమర్పించే ఆచారం కూడా ఉంది. ఈ సమయంలో ఆవులకు, కాకులకు, కుక్కలకు ఆహారం పెట్టడం పితృ కర్మలో భాగంగా పరిగణించబడుతుంది.

అక్టోబర్ 10వ తేదీన అమావాస్య వస్తుంది. ఇది పితృపక్షం చివరి తేదీ. పితృ తిథి తెలియని వారు అమావాస్య రోజున శ్రద్ధ నిర్వహించడం సాంప్రదాయం. ఏ తేదీనైనా నిర్వహించకపోయినా, అమావాస్య రోజున చేయడం ముఖ్యమైనదిగా పరిగణిస్తారు.(Disclaimer: ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం సాధారణ నమ్మకాలు, పంచాంగాలు, జ్యోతిష్య అభిప్రాయాల ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. దీనిని శాస్త్రీయంగా నిర్ధారించబడిన సమాచారంగా పరిగణించరాదు. ఈ సమాచారాన్ని మా Zee Telugu News స్వతంత్రంగా ధృవీకరించలేదు.)

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES