• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆధ్యాత్మికం
  • / Pitru paksha 2026: పితృపక్షాలు పదిహేను రోజులే ఎందుకు..?.. దీని వెనకున్న అసలు స్టోరీ ఏంటో తెలుసా..?..

Pitru paksha 2026: పితృపక్షాలు పదిహేను రోజులే ఎందుకు..?.. దీని వెనకున్న అసలు స్టోరీ ఏంటో తెలుసా..?..

Pitru paksha significance: ప్రతిఏటా భాద్రపద మాసంలో పౌర్ణమి రోజు నుంచి మనం అమావాస్య వరకున్న పదిహేను రోజుల పాటు పదిహేను రోజుల పాటు పితృపక్షంను పాటిస్తు వస్తారు.అసలు దీని వెనక అసలు కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం.

Written ByInamdar Paresh
Published: Sep 26, 2026, 09:39 PM IST|Updated: Sep 26, 2026, 09:41 PM IST
joinshare
 Pitru paksha 2026: పితృపక్షాలు పదిహేను రోజులే ఎందుకు..?.. దీని వెనకున్న అసలు స్టోరీ ఏంటో తెలుసా..?..
Image Credit: pitrupaksha(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Pitru paksha 2026 significance and tradition rules: ప్రస్తుతం పితృపక్షం  ప్రారంభమైంది. సెప్టెంబర్ 26 పౌర్ణమి నుంచి అక్టోబర్ 10 వరకు మనం పదిహేను రోజుల పాటు దీన్ని జరుపుకుంటాం. చివరి రోజున మహాలయం అమావాస్య అని కూడా పిలుస్తారు. ఈ రోజుల్లో చనిపోయిన మన పూర్వీకుల కోసం శ్రాద్దకర్మలు, వారికి ఇష్టమైన వాటిని దానంగా ఇస్తారు.కనీసం ఏడాదికి ఒక్కరోజైన వారిని స్మరించుకుంటూ వారికి ఇష్టమైన పదార్థాలను స్వయంగా వారి పిల్లలు వండి శ్రాద్దధికాలు చేయాలంటారు. ఇది సాధ్యం కానీ వారు కనీసం సాహిత్య దానం అయిన ఇచ్చుకొవాలి. 

ముఖ్యంగా నదీతీరంగా చేసుకునే శ్రాద్దకర్మలకు, చేసే తర్పణాలకు విశేషమైన ఫలితం కల్గుతుందని పండితులు చెబుతుంటారు. ఈ పదిహేను రోజుల పాటు పితృదేవతలు భూమి మీదకు వచ్చి తమ పిల్లలు తమ కోసం ఏమిచేస్తారో, ఎలాంటి శ్రాద్దకర్మలు చేస్తారోఅని చూస్తారంట. 

ఈ విధంగా వారిమీద ప్రేమతో శ్రాధ్దకర్మలు, దానాలు చేసిన వారిని పితృ దేవతలు సంతోషంగా ఉండమని దీవించి తిరిగి వారి లోకాలకు వెళ్లిపోతారంట. ఒకవేళ ఎవరైతే ఈ పదిహేను రోజుల్లో ఒక్క రోజు కూడా స్మరించకుండా వారిచ్చిన ఆస్తిని అనుభవిస్తు ఏవిధమైన శ్రాద్దకర్మలు చేయరో అలాంటి వారిని శపించి వెళ్తారంట. అందుకే కొంత మంది తరచుగా పితృ శాపంతో బాధపడుతుంటారు.

కర్ణుడి పౌరాణిక కారణం..

మహాభారతంలో కుంతి పుత్రుడు కర్ణుడు గతించిన తర్వాత ఆయన  స్వర్గానికి చేరుకుంటాడు. అక్కడ కేవలం బంగారం, రత్నాలు, ఆభరణాలను మాత్రమే ఆయనకు ఆహారంగా ఇస్తారు. ఇది చూసి తనకు ఆకలిగా ఉందని అన్నం  పెట్టాలని దేవతలను కోరతాడు .అప్పుడు వారు నీ జీవితంలో అందరికి బంగారం, రత్నాలు, ఆభరణాలు మాత్రమే దానం చేశావు. అందుకే నీకు అవి పుణ్యంగా మరల నీకు దక్కుతున్నాయి. 

నీ పూర్వీకులకు అన్నంకానీ, తర్పణం కానీ చేయలేదు. ఇక ఎవరికి పట్టడన్నంపెట్టలేవని చెప్తారు. దీంతో కర్ణుడు తన తప్పును తెలుసుకుని ఒక పదిహేను రోజులు భూమి మీదకు వెళ్లే వరం ఇవ్వాలని కోరుకుంటాడు. దీంతో యమధర్మరాజు మరల కర్ణుడికి  పూర్వీకులకు అన్నదానం, తర్పణాలు అర్పించడానికి 15 రోజుల పాటు భూమిపైకి వెళ్లేందుకు అనుమతిస్తాడు. 

ఆ 15 రోజులే పితృపక్షాలుగా మారాయని పురాణాలు చెబుతున్నాయి.  అప్పటి నుంచి పదిహేను రోజుల పాటు గతించిన వారు భూమి మీదకు మరల వస్తారని,  తమ వంశస్థుల ఇళ్లలో నివసిస్తూ, వారు పెట్టే పిండ ప్రదానాలు, తర్పణాలను స్వీకరిస్తారని నమ్ముతారు.

అందుకే తప్పకుండా ఈ పదిహేను రోజుల్లో ఏదో ఒక రోజు భక్తితో పిండ ప్రదానాలు చేయాలంటారు.  ఈవిధంగా ఆహరం పెట్టి వాటిని ఆవులకు లేదా కాకులకు పెట్టాలంటారు. పూర్వీకుల పేరు మీదుగా దానధర్మాలు చేయాలంటారు. ఈ పదిహేనుల తర్వాత మరల పూర్వీకులు వారి యథాస్థానంకు వెళ్లిపోతారని అనాదీగా ఈ పితృపక్షం ఆచారంను పాటిస్తు వస్తున్నాం.
 

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu Astrology