Pitru paksha 2026: పితృపక్షాలు పదిహేను రోజులే ఎందుకు..?.. దీని వెనకున్న అసలు స్టోరీ ఏంటో తెలుసా..?..
Pitru paksha significance: ప్రతిఏటా భాద్రపద మాసంలో పౌర్ణమి రోజు నుంచి మనం అమావాస్య వరకున్న పదిహేను రోజుల పాటు పదిహేను రోజుల పాటు పితృపక్షంను పాటిస్తు వస్తారు.అసలు దీని వెనక అసలు కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం.
Pitru paksha 2026 significance and tradition rules: ప్రస్తుతం పితృపక్షం ప్రారంభమైంది. సెప్టెంబర్ 26 పౌర్ణమి నుంచి అక్టోబర్ 10 వరకు మనం పదిహేను రోజుల పాటు దీన్ని జరుపుకుంటాం. చివరి రోజున మహాలయం అమావాస్య అని కూడా పిలుస్తారు. ఈ రోజుల్లో చనిపోయిన మన పూర్వీకుల కోసం శ్రాద్దకర్మలు, వారికి ఇష్టమైన వాటిని దానంగా ఇస్తారు.కనీసం ఏడాదికి ఒక్కరోజైన వారిని స్మరించుకుంటూ వారికి ఇష్టమైన పదార్థాలను స్వయంగా వారి పిల్లలు వండి శ్రాద్దధికాలు చేయాలంటారు. ఇది సాధ్యం కానీ వారు కనీసం సాహిత్య దానం అయిన ఇచ్చుకొవాలి.
ముఖ్యంగా నదీతీరంగా చేసుకునే శ్రాద్దకర్మలకు, చేసే తర్పణాలకు విశేషమైన ఫలితం కల్గుతుందని పండితులు చెబుతుంటారు. ఈ పదిహేను రోజుల పాటు పితృదేవతలు భూమి మీదకు వచ్చి తమ పిల్లలు తమ కోసం ఏమిచేస్తారో, ఎలాంటి శ్రాద్దకర్మలు చేస్తారోఅని చూస్తారంట.
ఈ విధంగా వారిమీద ప్రేమతో శ్రాధ్దకర్మలు, దానాలు చేసిన వారిని పితృ దేవతలు సంతోషంగా ఉండమని దీవించి తిరిగి వారి లోకాలకు వెళ్లిపోతారంట. ఒకవేళ ఎవరైతే ఈ పదిహేను రోజుల్లో ఒక్క రోజు కూడా స్మరించకుండా వారిచ్చిన ఆస్తిని అనుభవిస్తు ఏవిధమైన శ్రాద్దకర్మలు చేయరో అలాంటి వారిని శపించి వెళ్తారంట. అందుకే కొంత మంది తరచుగా పితృ శాపంతో బాధపడుతుంటారు.
కర్ణుడి పౌరాణిక కారణం..
మహాభారతంలో కుంతి పుత్రుడు కర్ణుడు గతించిన తర్వాత ఆయన స్వర్గానికి చేరుకుంటాడు. అక్కడ కేవలం బంగారం, రత్నాలు, ఆభరణాలను మాత్రమే ఆయనకు ఆహారంగా ఇస్తారు. ఇది చూసి తనకు ఆకలిగా ఉందని అన్నం పెట్టాలని దేవతలను కోరతాడు .అప్పుడు వారు నీ జీవితంలో అందరికి బంగారం, రత్నాలు, ఆభరణాలు మాత్రమే దానం చేశావు. అందుకే నీకు అవి పుణ్యంగా మరల నీకు దక్కుతున్నాయి.
నీ పూర్వీకులకు అన్నంకానీ, తర్పణం కానీ చేయలేదు. ఇక ఎవరికి పట్టడన్నంపెట్టలేవని చెప్తారు. దీంతో కర్ణుడు తన తప్పును తెలుసుకుని ఒక పదిహేను రోజులు భూమి మీదకు వెళ్లే వరం ఇవ్వాలని కోరుకుంటాడు. దీంతో యమధర్మరాజు మరల కర్ణుడికి పూర్వీకులకు అన్నదానం, తర్పణాలు అర్పించడానికి 15 రోజుల పాటు భూమిపైకి వెళ్లేందుకు అనుమతిస్తాడు.
ఆ 15 రోజులే పితృపక్షాలుగా మారాయని పురాణాలు చెబుతున్నాయి. అప్పటి నుంచి పదిహేను రోజుల పాటు గతించిన వారు భూమి మీదకు మరల వస్తారని, తమ వంశస్థుల ఇళ్లలో నివసిస్తూ, వారు పెట్టే పిండ ప్రదానాలు, తర్పణాలను స్వీకరిస్తారని నమ్ముతారు.
అందుకే తప్పకుండా ఈ పదిహేను రోజుల్లో ఏదో ఒక రోజు భక్తితో పిండ ప్రదానాలు చేయాలంటారు. ఈవిధంగా ఆహరం పెట్టి వాటిని ఆవులకు లేదా కాకులకు పెట్టాలంటారు. పూర్వీకుల పేరు మీదుగా దానధర్మాలు చేయాలంటారు. ఈ పదిహేనుల తర్వాత మరల పూర్వీకులు వారి యథాస్థానంకు వెళ్లిపోతారని అనాదీగా ఈ పితృపక్షం ఆచారంను పాటిస్తు వస్తున్నాం.