శ్రాద్ధ కర్మలు అంటే ఏమిటి? పితృదేవతలకు శ్రాద్ధం ఏ రోజు పెట్టాలో తెలుసుకోండి!
హిందువులకు పితృపక్షం అత్యంత ముఖ్యమైన సమయం. ఈ రోజుల్లో ప్రధానంగా పితృదేవతలకు తర్పణాలు, శ్రద్ధ వంటివి నిర్వహించడం ద్వారా పితృ దోషం నుండి తప్పించుకోవచ్చు. ఈ పౌర్ణమి నుండి పక్షాలు ప్రారంభమవుతున్నాయి, కావున ఏ రోజు ఏ శ్రద్ధ నిర్వహించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Pitru Paksha Dates 2026: రేపటి నుంచి పితృపక్షం ప్రారంభం కానుంది. మొత్తం 16 రోజుల పాటు కొనసాగే ఈ పక్ష రోజులలో పితృదేవతల కోసం శ్రద్ధ, తర్పణాలు నిర్వహిస్తారు. హిందువులకు పితృపక్షం ఎంతో విశిష్టమైనది. తమ పితరుల కోసం చేసే శ్రాద్ధ వారికి అందుతుందని నమ్మకం. దీనివల్ల పితృ దోషాలు కలగకుండా ఉండటమే కాకుండా, పితరుల ఆత్మలకు శాంతి కలిగి మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం. ఈ కార్యక్రమాలు మొత్తం 16 రోజుల పాటు జరుగుతాయి.
పితృపక్షంలో ఈ శ్రాద్ధలు నిర్వహించడానికి ప్రధాన కారణం ఏమిటంటే, ఈ 16 రోజులు మన పితరులు భూమిపైకి వస్తారని నమ్మకం. ఈ సమయంలో మనం చేసే శ్రాద్ద వారు స్వీకరించి, సంతోషించి, మనకు సుఖ సంతోషాలు కలగాలని ఆశీర్వదిస్తూ వెళ్తారని భావిస్తారు. సెప్టెంబర్ 26న ప్రారంభమయ్యే ఈ పితృపక్షం అక్టోబర్ 10 వరకు కొనసాగుతుంది. ఈ పక్షంలో శ్రద్ధలు నిర్వహిస్తారు.
అయితే, పితృపక్షం ఎప్పుడు మొదలవుతుందనే విషయంలో చాలామంది గందరగోళానికి గురవుతున్నారు. కొందరు 26వ తేదీన ప్రారంభమవుతుందని అంటే, మరికొందరు సెప్టెంబర్ 27న ప్రారంభమవుతుందని చెబుతున్నారు. తర్పణాలు, పిండప్రదానం వంటివి ఈ సమయాల్లో నిర్వహిస్తారు.
నిజానికి శుక్ల పౌర్ణమి సెప్టెంబర్ 26న రాగా, కృష్ణ పక్ష ప్రతిపద తిథి సెప్టెంబర్ 27న ప్రారంభమవుతుంది. పౌర్ణమి రోజున చేసే శ్రద్ధను పితృపక్ష ప్రధాన తేదీల్లో చేర్చలేము. కావున, సెప్టెంబర్ 27న కృష్ణ పక్ష ప్రతిపద తిథితో మహాలయ పక్షం ప్రారంభమవుతుంది. పితృపక్షం సెప్టెంబర్ 27న ప్రతిపద తిథితో ప్రారంభమై, అక్టోబర్ 10న సర్వపితృ అమావాస్యతో ముగుస్తుంది.
పితృపక్ష తేదీలు:
సెప్టెంబర్ 26 - పూర్ణిమ శ్రద్ధ
సెప్టెంబర్ 27 - ప్రతిపద
సెప్టెంబర్ 28 - ద్వితీయ
సెప్టెంబర్ 29 - తృతీయ
సెప్టెంబర్ 30 - చతుర్థి
అక్టోబర్ 1 - పంచమి
అక్టోబర్ 2 - అష్టమి
అక్టోబర్ 3 - నవమి
అక్టోబర్ 4 - దశమి
అక్టోబర్ 5 - ఏకాదశి
అక్టోబర్ 6 - ద్వాదశి
అక్టోబర్ 7 - త్రయోదశి
అక్టోబర్ 8 - చతుర్దశి
అక్టోబర్ 9 - అమావాస్య (మహాలయ అమావాస్య)
అయితే పితృపక్షం సమయంలో కొన్ని పనులు పొరపాటున కూడా చేయకూడదు. గోళ్లు, జుట్టు కత్తిరించడం వంటిది చేయకూడదు. కొంతమంది పితృపక్షం రోజుల్లో నాన్ వెజ్ వంటివి కూడా తినరు, ఉల్లి వెల్లుల్లికి కూడా దూరంగా ఉంటారు. ఈ పక్షంలో పెళ్లిళ్లు, శుభకార్యాలు, గృహప్రవేశం వంటివి కూడా చేయరు.
శ్రాద్దకర్మలు అంటే మరణించిన మన పూర్వీకుల కోసం అత్యంత భక్తిశ్రద్ధలతో వారిని స్మరిస్తూ నిర్వహించే ఒక ఆచారం. హిందూ సంప్రదాయం ప్రకారం, వారి వర్ధంతి రోజున లేదా మహాలయ అమావాస్య రోజున దీనిని నిర్వహిస్తారు. వారి ఆత్మలకు శాంతి కలగాలని, వారి రుణాన్ని తీర్చుకోవడానికి ఈ కార్యక్రమం చేస్తారు. ప్రధానంగా ఈ రోజుల్లో దానధర్మాలకు కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. అలాగే తర్పణాలు, పిండ ప్రదానాలు చేస్తారు.(Disclaimer: ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం సాధారణ నమ్మకాలు, పంచాంగాలు, జ్యోతిష్య అభిప్రాయాల ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. దీనిని శాస్త్రీయంగా నిర్ధారించబడిన సమాచారంగా పరిగణించరాదు. ఈ సమాచారాన్ని మా Zee Telugu News స్వతంత్రంగా ధృవీకరించలేదు.)