SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Poornam Boorelu: వినాయక చవితి స్పెషల్ నైవేద్యం..లంబోదరుడికి ఇష్టమైన పూర్ణం బూరెలు క్రిస్పీగా, రుచికరంగా ఎలా చేయాలి?

Poornam Boorelu Recipe: వినాయక చవితి పండుగ నాడు ఎన్నో రకాల నైవేద్యాలు వండి గణపతికి సమర్పిస్తారు. అయితే అందులో పూర్ణం బురెలు వినాయకునికి ఎంతో ప్రీతికరమైనవని భక్తులు చెబుతుంటారు. అలాగే కుడుములు, పాలతళికలు, పెసరపప్పు పాయసం కూడా లంబోదరునికి ఎంతో ఇష్టమని అంటుంటారు. అయితే అత్యంత ప్రీతికరమైన పూర్ణం బూరెలు రుచిగా ఎలా తయారు చేసుకోవాలనే చిట్కాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Written By Harish Darla
Published: Sep 13, 2026, 08:43 PM IST | Updated: Sep 13, 2026, 08:48 PM IST
Join

Poornam Boorelu Recipe: వినాయక చవితి పండుగ సందర్భంగా గణనాథుడికి సమర్పించే వివిధ రకాల నైవేద్యాలలో పూర్ణం బూరెలు ఎంతో ప్రత్యేకమైనవి. శనగపప్పు, బెల్లం, మైదా, శనగపిండి వంటి సులువైన పదార్థాలతో ఇంట్లోనే ఎంతో రుచికరంగా వీటిని తయారు చేసుకోవచ్చు. సరైన కొలతలు, తయారీ విధానం, క్రిస్పీగా రావడానికి పాటించాల్సిన ముఖ్యమైన చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు..
శనగపప్పు: 1 కప్పు (200 గ్రాములు)
నీళ్లు: సరిపడా
బెల్లం: 1 కప్పు (150-200 గ్రాములు) (తీపి తక్కువగా కావలసినవారు ¾ కప్పు వాడవచ్చు)
ఏలకుల పొడి: ½ టీస్పూన్
తురుము కొబ్బరి: 2 టేబుల్ స్పూన్లు (ఐచ్ఛికం)
నెయ్యి: 2 టీస్పూన్లు
మైదా: 1 కప్పు (120 గ్రాములు)
ఉప్పు: చిటికెడు
శనగపిండి: ½ కప్పు (50 గ్రాములు)
నూనె: వేయించడానికి సరిపడా

పూర్ణం మిశ్రమం తయారీ..
1) ముందుగా శనగపప్పును 3-4 గంటల పాటు నానబెట్టి, చిటికెడు ఉప్పు వేసి మెత్తగా ఉడికించి నీళ్లను వడకట్టుకోవాలి.
2) ఆ తర్వాత మిక్సీలో మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి.
3) బెల్లాన్ని నీళ్లలో కరిగించి వడకట్టాలి.
4) బాణలిలో నెయ్యి వేసి, శనగపప్పు పేస్ట్, బెల్లం పాకం పోసి బాగా కలుపుతూ ఉడికించాలి.
5) అందులోనే నెయ్యి, యాలుకల పొడి వేసి కలపాలి.
6) పూర్ణం పిండి చేతికి అంటుకోకుండా ఉండలు చేసుకునేంత గట్టిపడిన తర్వాత దించి, ఇష్టమైతే తురుముకున్న కొబ్బరిని కలుపుకోవచ్చు.
7) చల్లారిన తర్వాత చిన్న ఉండలుగా చేసుకోవాలి.
8) పూర్ణం ఎక్కువ మెత్తగా ఉంటే కొద్దిగా శనగపిండి కలుపుకోవాలి

తోడు పిండి, బూరెల తయారీ..
1) మైదా, సెనగపిండి తీసుకుని కొద్దిగా ఉప్పు, నీళ్లు పోస్తూ మెత్తని పిండిలా కలుపుకోవాలి.
2) ఈ పిండి మరీ గట్టిగా, మరీ పలచగా ఉండకూడదు.
3) పిండిని తయారుచేసుకుని 20 నిమిషాల పాటు నానబెట్టాలి.
4) పిండిని కొద్దిగా తీసుకుని చేతికి నూనె రాసుకుని పలచగా చేసి, మధ్యలో పూర్ణం ఉండ పెట్టి మూసి గుండ్రంగా చేసుకోవాలి.
5) బాణలిలో నూనె బాగా వేడి చేసి, మీడియం ఫ్లేమ్‌పై రెండు వైపులా బంగారు రంగు వచ్చేలా వేయించాలి.

ముఖ్యమైన చిట్కాలు: తోడు పిండి గట్టిగా ఉంటే పూర్ణాలు పగులుతాయి కాబట్టి పిండి మెత్తగా ఉండేలా చూసుకోవాలి. నూనె బాగా వేడిగా ఉన్నప్పుడే వేయించాలి, ఎక్కువసేపు ఉంచకూడదు. ఈ విధంగా తయారుచేసిన సాఫ్ట్‌గా, క్రిస్పీగా ఉండే తియ్యని పూర్ణం బూరెలను వినాయకుడికి నైవేద్యంగా సమర్పించి అందరూ ఆస్వాదించవచ్చు.

Also Read: వినాయక చవితి వేళ ఆర్టీసీ ప్రయాణికులకు బిగ్ షాక్..ఆర్టీసీ బస్సుల్లో 40% ఛార్జీల మోత!

Also Read: వినాయక చవితి స్పెషల్..దేశంలో 5 ఫేమస్ గణపతి ఆలయాలు..కాణిపాకం ఉందా?


 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

Add Zee News as a Preferred Source

About the Author

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.

ZEENEWS TRENDING STORIES