Pratiyuti Yoga Effect On Zodiac: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. కొన్ని గ్రహాలు చేసే సంచారాలకు చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ప్రతి నెల అనేక గ్రహాలు రాశి సంచారం చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా గ్రహాల అధిపతి అయిన సూర్యుడితో పాటు కర్మ ఫలప్రదాత అయిన శని దేవుడి స్థానాల మార్పులను బట్టి కూడా అన్ని రాశులవారిపై ప్రభావం పడుతుంది. ఇదిలా ఉంటే అక్టోబర్ 4వ తేదిన సూర్యుడు కన్యా రాశిలోకి.. శని మీన రాశిలో వక్రగతిలోకి వెళ్లి ఒకదానికొకటి 180 డిగ్రీల కోణంలో ఎదురెదురుగా వస్తాయి..
ఈ గ్రహాల మార్పుల కారణంగా ప్రతియుతి యోగం ఏర్పడబోతోంది. అయితే, రెండు గ్రహాలు ఒకదానికొకటి ఎదురు రావడం వల్ల కొన్ని రాశులవారికి అద్భుతమైన శుభఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా చిరకాల సమస్యలు నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది. అలాగే ఈ కింది రాశులవారి జీవితాల్లో కీలక మార్పులు వస్తాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలిపారు. అయితే, ఈ సమయంలో ఏయే రాశులవారికి అత్యంత శుభప్రదంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ రాశులవారికి లాభాలే లాభాలు:
సింహ రాశి (Leo):
సింహ రాశివారికి ఈ గ్రహాల కలయిక అద్భుతమైన మార్పులను తీసుకు వస్తుందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలిపారు.. వీరికి చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలు క్రమంగా తొలగిపోతాయి. అంతేకాకుండా నూతనంగా పెట్టిన పెట్టుబడుల నుంచి కూడా భారీ లాభాలు పొందుతారు. ముఖ్యంగా వీరికి అదనపు ఆదాయ మార్గాలు కూడా లభిస్తాయి. ఉద్యోగాలు చేసే అధికారులకు మంచి మంచి ప్రశంసలు కూడా లభిస్తాయి. అలాగే ఉద్యోగాలు చేసేవారికి జీతాలు కూడా విపరీతంగా పెరుగుతాయి.
కన్యా రాశి (Virgo):
కన్యా రాశి లగ్నంలో సూర్యుడు, సప్తమ స్థానంలో శని సంచరించడం వల్ల ఏర్పడిన ఈ యోగం వీరికి అదృష్టాన్ని అందిస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా గత కొంతకాలంగా వేధిస్తున్న ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది.. ఆరోగ్యం, వ్యక్తిత్వ వికాసంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టే ఛాన్స్‌లు కూడా కనిపిస్తున్నాయి. భాగస్వామితో ఉన్న చిన్నపాటి విభేదాలతో పాటు అపార్థాలు కూడా తొలగిపోతాయి. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా కూడా మారే ఛాన్స్‌లు కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
ధనుస్సు రాశి (Sagittarius)
ధనుస్సు రాశి వారికి సూర్య-శనుల ఎఫెక్ట్‌తో అద్భుతమైన లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఉద్యోగంలో వస్తున్న సమస్యలు కూడా సులభంగా తొలగిపోతాయి. వీరికి జీవితంలో సానుకూలమైన నిర్ణయా కలిగి ముందుకే వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అలాగే దీర్ఘకాలిక సమస్యలు కూడా దూరమవుతాయి. దీంతో పాటు అనుకున్న పనుల్లో సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి..