దసరా నవరాత్రులు.. పూజకు ముందు ఇల్లు శుభ్రం చేస్తున్నారా? ఈ 5 పొరపాట్లు అస్సలు చేయొద్దు!
దసరా నవరాత్రులు అక్టోబర్ 11వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈలోపే అక్టోబర్ 10వ తేదీన పెద్ద అమావాస్య కూడా వస్తోంది. నవరాత్రులు జరుపుకునే వారు ముందే ఇంటిని శుభ్రం చేసుకుంటూ ఉంటారు. మీరు కూడా నవరాత్రుల కోసం ఇంటిని శుభ్రం చేస్తున్నట్లయితే, ఈ ఐదు తప్పులు పొరపాటున కూడా చేయకూడదు.
దేశవ్యాప్తంగా దసరాను ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. తొమ్మిది రోజుల పాటు తొమ్మిది అమ్మవారి అవతారాలను ఎంతో భక్తిశ్రద్ధలతో
కొలుస్తారు. ఒక్కో రోజు ఒక్కో అవతారంలో అమ్మవారిని పూజిస్తారు. నవరాత్రులకు ముందుగా ఇంటిని శుభ్రం చేసుకోవడం ఒక ఆనవాయితీ. మీరు కూడా ఇంటిని శుభ్రం చేసుకునేటప్పుడు కొన్ని నియమాలను పాటించాలి. సాధారణంగా పండుగ సమయాల్లో ఇళ్లను, వస్తువులను శుభ్రం చేయడం అలవాటే.
ఇంటిని క్లీన్ చేసుకునే ఈజీ ట్రిక్స్..
నవరాత్రుల కోసం సిద్ధమవుతున్న వారు ఇంట్లో ఉండే పెద్ద సామగ్రి నుంచి చిన్నవి కూడా శుభ్రం చేస్తారు. బరువుగా ఉండే వస్తువులను ముందుగానే క్లీన్ చేసుకోవడం మంచిది. నవరాత్రి సమయంలో అమ్మవారి విగ్రహాలను లేదా ఫోటో ఫ్రేమ్‌లను అప్పటికప్పుడు కడగకూడదు. వాటిని ముందే సిద్ధం చేసుకోవాలి. ఇత్తడి దీపాలను నిమ్మరసం లేదా పితాంబరి వంటి వాటితో శుభ్రం చేస్తే త్వరగా మెరుస్తాయి.
ఇంట్లో దేవుడి ఫోటోలు, విగ్రహాలను తుడుచుకోవడానికి ఈసారి ప్రత్యేకంగా కొత్త గుడ్డను తెచ్చి వాడండి. పాత వాటిని పారేయండి. ఎరుపు రంగు గుడ్డను ఉపయోగించడం శ్రేయస్కరం. ఇంట్లోని ప్రధాన ద్వారం, కిటికీలను ముందుగానే శుభ్రం చేయండి. అక్కడ దుమ్ము ధూళి పేరుకుంటే ఇంట్లోకి పాజిటివిటీ రాదు.
ఇంట్లో మంత్రోచ్ఛారణలు శక్తివంతంగా వినిపించాలన్నా, మనసు ప్రశాంతంగా ఉండాలన్నా ఇల్లు శుభ్రంగా ఉండాలి.
నవరాత్రుల ముందు రోజు ఉదయం ఇల్లు తుడుస్తున్నప్పుడు, నీటిలో కొంచెం రాతి ఉప్పు కలిపి తుడవండి. ఇది ఇంట్లోని ప్రతికూలతలను తొలగించి పాజిటివిటీని పెంచుతుందని నమ్ముతారు. సముద్రపు ఉప్పును వాడటం ఎంతో మంచిది.
పూజగదితో పాటు కిచెన్‌ను కూడా ముందే శుభ్రం చేసుకోవడం మంచిది. స్టవ్ క్లీన్ చేయండి. నవరాత్రుల్లో చాలామంది ఉల్లి, వెల్లుల్లి తినరు కాబట్టి, వాటిని ఇంట్లో నుండి తీసివేసి ప్రత్యేకంగా వేరే చోట ఏర్పాటు చేసుకోండి, లేదంటే అవి త్వరగా వాసన వస్తాయి.
కేవలం ఇల్లు తుడవడం మాత్రమే కాకుండా, శుభ్రం చేసిన తర్వాత ధూప దీపాలు వెలిగించాలి. నవరాత్రుల్లో ప్రతిరోజు సూర్యాస్తమయ సమయంలో అమ్మవారి వద్ద నెయ్యి దీపం వెలిగించడం వల్ల ఇంట్లో పాజిటివిటీ పెరగడమే కాకుండా మంచి పరిమళం కూడా నిండుతుంది. తొమ్మిది రోజుల పాటు ధూపం, దీపాలు, నైవేద్యాలు సమర్పించడం వల్ల అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది.
9 రోజులు పూజ చేయాలనుకునే వారు తొమ్మిది రోజుల పాటు ఈ నియమాలను పాటిస్తూ, మొదటి రోజు బాలాత్రిపుర సుందరి దేవి నుంచి నవరాత్రులను నిష్టగా చేసుకోవచ్చు. ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు మనసును ప్రశాంతంగా ఉంచుకుని అమ్మవారిని పూజించాలి.
కేవలం విగ్రహాలనే కాదు, మీ ఇంటి షెల్ప్‌లలో ఉన్న అమ్మవారి చిత్రాలను కూడా శుభ్రంగా ఉంచుకోండి. ఇంట్లో ఏ మూలన దుమ్ము లేకుండా జాగ్రత్త వహించండి, తద్వారా పాజిటివిటీ ప్రసరిస్తుంది.
మీ ఇల్లు మెరిసిపోవాలి. నవరాత్రుల శుభ్రతలో మొదట పెద్ద విగ్రహాలతో ప్రారంభించి, ఆ తర్వాత ఫోటోలు, నగలు వంటివి శుభ్రం చేయండి.
అంతేకాకుండా, నవరాత్రుల్లో ఇంటి ఫ్లోర్ ఎంతో శుభ్రంగా, డీప్ క్లీన్ చేసి ఉండాలి. మైక్రో ఫైబర్ మాప్ ఉపయోగించడం వల్ల పని సులభమవుతుంది.
Read Also: దసరా, సద్దుల బతుకమ్మ ఎప్పుడంటే? పండితులు ప్రకటించిన పండుగ వివరాలు!
నవరాత్రుల సమయంలో ఉపవాసాలు ఉండటం వల్ల అమ్మవారికి నైవేద్యాలు తయారు చేయాల్సి ఉంటుంది. కాబట్టి కిచెన్ వస్తువులు, కౌంటర్ టాప్, టైల్స్, సింక్ ఎప్పుడూ నీటుగా ఉండేలా చూసుకోండి.
ఇంట్లోని అద్దాలు, ఫ్యాన్లు, అల్మారాలను కూడా శుభ్రం చేయండి. ఇంటి మూలలను శుభ్రం చేసి, రంగురంగుల రంగోలీలు, దీపాలు ఏర్పాటు చేసుకోవడానికి అనుగుణంగా సిద్ధం చేసుకోండి.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆధునిక క్లీనింగ్ టెక్నిక్స్‌ను ఉపయోగించి సులభంగా పని పూర్తి చేయండి. ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు. భక్తిశ్రద్ధలతో పూజ చేసే క్రమంలో ఆరోగ్య సమస్యలు రాకుండా, ఈ ఈజీ టెక్నిక్స్‌తో ఇంటిని శుభ్రం చేసుకోవచ్చు.
నవరాత్రుల సమయంలోనే తెలంగాణాలో బతుకమ్మ పండుగను కూడా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఉత్తరాది వారు దాండియా, గర్బా నృత్యాలతో వేడుకలు చేసుకుంటారు.(Disclaimer: ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం సాధారణ నమ్మకాలు, పంచాంగాలు, జ్యోతిష్య అభిప్రాయాల ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. దీనిని శాస్త్రీయంగా నిర్ధారించబడిన సమాచారంగా పరిగణించరాదు. ఈ సమాచారాన్ని మా Zee Telugu News స్వతంత్రంగా ధృవీకరించలేదు.)