• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆధ్యాత్మికం
  • /రాహు-చంద్ర కలయికతో అదృష్టం డబుల్.. సెప్టెంబర్ 23 నుంచి ఈ రాశులకు రాజయోగం?

రాహు-చంద్ర కలయికతో అదృష్టం డబుల్.. సెప్టెంబర్ 23 నుంచి ఈ రాశులకు రాజయోగం?

Rahu-moon Conjunction Effect On Zodiac: రాహు-చంద్ర సంయోగంతో ఈ కింది రాశులవారి జీవితాల్లో అద్భుతమైన మార్పులు వస్తాయని జ్యోతిష్యులు తంజావురి నాగరాజు శర్మ తెలిపారు. వీరికి ఆర్థికంగా వస్తున్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. అయితే, ఈ సమయంలో ఏయే రాశులవారికి బంపర్‌ లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Reported ByDharmaraju DhurishettyEdited ByDharmaraju Dhurishetty
Published: Sep 24, 2026, 11:51 AM IST|Updated: Sep 24, 2026, 11:54 AM IST
joinshare
రాహు-చంద్ర కలయికతో అదృష్టం డబుల్.. సెప్టెంబర్ 23 నుంచి ఈ రాశులకు రాజయోగం?
Image Credit: జీ తెలుగు న్యూస్..

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Rahu-moon Conjunction Effect On Zodiac Telugu: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కదలికలతో పాటు వాటి సంచారాలకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుందని జ్యోతిష్యులు తంజావురి నాగరాజు శర్మ తెలిపారు. ఈ గ్రహం సంచారం చేసిన ప్రతిసారి మానవ జీవితాలపై ఊహించని ప్రభావం పడుతుంది. ముఖ్యంగా ద్వాదశ రాశులు ప్రభావితమువుతుంటాయి. ఇదిలా ఉంటే శనిదేవుడి సొంత రాశిగా భావించే కుంభరాశిలో అరుదైన గ్రహ సంయోగం ఏర్పడబోతోంది. ఇప్పటికే కుంభరాశిలో ఛాయాగ్రహం పరిగణించే రాహువు సంచారం దశలో కొనసాగుతున్నాడు. అయితే, ఈ సెప్టెబర్‌ 23వ తేదిన చంద్రుడు కూడా అదే రాశిలో సంచారం చేశాడు. దీని కారణంగా రాహువు, చంద్ర గ్రహాల కలయిక జరుగుతుంది. దీంతో మూడు రాశులవారి జీవితాల్లో కీలక మార్పులు సంభవించబోతున్నాయి. మూడు రాశులవారికి ఊహించని స్థాయిలో అదృష్టం కూడా రెట్టింపు అవుతుంది. అంతేకాకుండా ఆర్థికంగా వస్తున్న సమస్యలు కూడా పూర్తిగా దూరమవుతాయి. అయితే, ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలాంటి లాభాలు కలుగుతాయో జ్యోతిష్యులు నాగరాజు అందించిన సమాచారం ప్రకారం ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ రాశులవారికి బంపర్‌ లాభాలు:
ధనుస్సు రాశి:
రాహు-చంద్రుల కలయికతో ధనుస్సు రాశివారికి కూడా ఈ సమయంలో అదృష్టం విపరీతంగా పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో అద్భుతమైన పురోగతి కూడా లభిస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. గతంలో నిలిచిపోయిన ధన లాభాలు కూడా పొందుతారు. దీంతో పాటు వ్యాపారాలు చేసేవారికి బంపర్‌ ప్రయోజనాలు కలుగుతాయి. రియల్ ఎస్టేట్, స్థిరాస్తి కొనుగోలతో పాటు ఇంటి మరమ్మతులు చేయించుకోవాలనుకునేవారికి బోలెడు లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా తల్లిదండ్రులతో సత్సంబంధాలు కూడా కూడా సులభంగా మెరుగుపడతాయి. కుటుంబంతో కలిసి ఈ సమయంలో విహారయాత్రలకు కూడా వెళ్లే ఛాన్స్‌లు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా సంతోషకరమైన వాతావరణంలో పెరుగుతారు.

కన్యా రాశి:
కన్యా రాశివారికి ఈ సమయంలో ఆత్మవిశ్వాసం ఊహించని స్థాయిలో రెట్టింపు అవుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఆర్థిక సమస్యలు తొలగిపోవడమే కాకుండా పాత అప్పులు తీర్చుకోగలుగుతారు. కెరీర్‌ పరంగా వస్తున్న సమస్యలు కూడా దూరమవుతాయి. దీర్ఘకాలికంగా వస్తున్న సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. ముఖ్యంగా ఆగిపోయిన మొండి బాకీలు కూడా సులభంగా పొందుతారు. అలాగే భారీ మొత్తంలో ఆదాయం కూడా సంపాదించుకుంటారు. తప్పకుండా వీరు కొత్త కొత్త ఆదాయ వనరులు కూడా పొందుతారు. ఉద్యోగాల్లో ఉన్నతాధికారుల నుంచి మంచి గుర్తింపు కూడా పొందుతారు. అలాగే మంచి మంచి ప్రశంసలు కూడా పొందుతారు.

మేష రాశి:
మేష రాశివారికి చంద్రుడితో పాటు రాహువు గ్రహాల కలయిక చాలా సానుకూలంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. గతకొంత కాలంగా వేధిస్తున్న మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా జీవితంలో ప్రశాంతత కూడా నెలకొంటుంది. ముఖ్యంగా కుటుంబ పరంగా వస్తున్న అనేక రకాల సమస్యలు కూడా దూరమవుతాయి. అలాగే కొత్త మార్గాల నుంచి డబ్బులు కూడా భారీ మొత్తంలో సొంతం చేసుకుంటారు. గతంలో నిలిపోయిన పనులు కూడా సులభంగా ఊపందుకుంటాయి. అలాగే బంధాలు కూడా మరింత బడపడి విశేషమైన లాభాలు కూడా సొంతం చేసుకుంటారు.

(నోట్‌: ఈ సమాచారం జ్యోతిష్య శాస్త్ర నిపుణుల నుంచి సేకరించి తీసుకుని రాసింది మాత్రమే.. దీనిని జీ తెలుగు న్యూస్‌ ధృవీకరించదు.. వ్యక్తుల వ్యక్తిగత జాతక చక్రాలను బట్టి ఫలితాల్లో మార్పులు ఉంటాయి.)

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

గమనిక..

 

Add Zee News as a Preferred Source
TAGS:
Rashi Phalalu