SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Rahu Transit 2026: డిసెంబర్ 5న మకరంలోకి రాహువు.. ఈ 3 రాశులకు ఊహించని ఆర్థిక లాభాలు!

Rahu Transit 2026: డిసెంబర్‌ 5వ తేదిన రాహువు గ్రహం సంచారం చేయబోతోంది. మకర రాశిలో ఈ సంచారం జరగుతుంది. దీని కారణంగా ఈ కింది రాశులవారి జీవితాల్లో కీలక మార్పులు వస్తాయి. ఆర్థికంగా కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి.

Reported By Dharmaraju Dhurishetty Written By Dharmaraju Dhurishetty
Published: Sep 17, 2026, 11:05 AM IST | Updated: Sep 17, 2026, 11:08 AM IST
Image Credit: Rahu Transit 2026: డిసెంబర్ 5న మకరంలోకి రాహువు.. ఈ 3 రాశులకు ఊహించని ఆర్థిక లాభాలు!
Join

Rahu Transit 2026 Effect: జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత కీడు గ్రహం, నీడ గ్రహంగా రాహువును చెప్పుకుంటారు. ఇదిలా ఉంటే మరో కీడు గ్రహంగా పరిగణించే శని గ్రహం కుంభ రాశిలో సంచార దశలో ఉంది. ఇదిలా ఉంటే ఈ ఏడాది చివరి నెలలో మరో కీలక గ్రహం సంచారం చేస్తోంది. దాదాపు 80 రోజుల తర్వాత, డిసెంబర్‌ 5వ తేదిన రాహువు గ్రహం కుంభరాశిని వదలి పెట్టి.. శని పాలించే మకర రాశిలోకి సంచారం చేయబోతోంది. 2027 సంవత్సరం జూన్ 23వ తేది వరకు సంచారం చేస్తుంది. అయితే, ఈ సమయంలో మూడు రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా కొన్ని రాశులవారికి బంపర్‌ లాభాలు కలుగుతాయి. డబ్బుల పరంగా వస్తున్న సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. అయితే, ఈ సమయంలో ఏయే రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఆ మూడు అదృష్ట రాశుల వివరాలు:
మేష రాశి (Aries): 
మేష రాశివారికి రాహువు సంచారంతో అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. వీరికి ఊహించని స్థాయిలో బ్యాంక్‌ బ్యాలెన్స్‌ కూడా రెట్టింపు అవుతుంది. అంతేకాకుండా నూతన అవకాశాలు కూడా కలుగుతాయి. ఆర్థికంగా వీరు ముందడుగు వేసే ఛాన్స్‌లు కనిపిస్తున్నాయి. వ్యాపారాల పరంగా విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయి. వ్యాపారాల పరంగా వస్తున్న భారీ ఒప్పందాలు కూడా సులభంగా కుదురుతాయి. కెరీర్‌తో పాటు వ్యాపారాల పరంగా వస్తున్న సమస్యులు కూడా దూరమవుతాయి. అంతేకాకుండా కార్యాలయాల్లో అద్భుతమైన శుభవార్తలు కూడా వింటారు. కష్టానికి తగిన ప్రఫలం కూడా లభిస్తుంది.

కన్యా రాశి (Virgo): 
రాహువు ప్రభావంతో కన్యా రాశివారికి ఈ సమయం ఎంతో సానుకూలంగా ఉంటుంది. వీరు అద్భుతమైన నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా సులభంగా విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి కూడా విపరీతంగా పెరుగుతుంది. ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వ్యక్తులకు ఈ సమయం ఎంతో లాభదాయకంగా ఉంటుంది. పెరిగిన ఆత్మావిశ్వాసంలో వృత్తిపరమైన జీవితంలో మంచి ఎదుగుల కూడా కనిపిస్తుంది. కెరీర్‌ పరంగా కీలకమైన విజయాలు కూడా సాధిస్తారు. అంతేకాకుండా ఆర్థికంగా వస్తున్న చిన్న చిన్న సమస్యలు కూడా తొలగిపోతాయి. ఆరోగ్యం కూడా చాలా వరకు మెరుగుపడుతుంది.

ధనుస్సు రాశి (Sagittarius): 
ధనుస్సు రాశివారికి సామాజికంగా విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. కుటుంబ సభ్యుల నుంచి భారీ మొత్తంలో లాభాలు కూడా సొంతం చేసుకుంటారు. అంతేకాకుండా ఎలాంటి పనులు చేసిన బోలెడు లాభాలు సొంతం చేసుకుంటారు. ముఖ్యంగా ప్రేమ జీవితంలో వస్తున్న సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. బంధాలు మరింత బలంగా మారడమే కాకుండా ఊహించని సానుకూలమైన మార్పులతో అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు. వీరికి అద్భుతమైన ఆత్మవిశ్వాసంలో మంచి ఫలితాలు కూడా పొందుతారు.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

గమనిక..

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..

Add Zee News as a Preferred Source

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

ZEENEWS TRENDING STORIES