• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆధ్యాత్మికం
  • / Sarvapitru Amavasya 2026: సర్వపితృ అమావాస్య ఎప్పుడు..?. పితృ పక్షాల్లో ఈ రోజుకు ఉన్న ప్రాముఖ్యత ఏమిటంటే..?..

Sarvapitru Amavasya 2026: సర్వపితృ అమావాస్య ఎప్పుడు..?. పితృ పక్షాల్లో ఈ రోజుకు ఉన్న ప్రాముఖ్యత ఏమిటంటే..?..

Pitru paksha pinda Pradhan: చాలా మంది అమావాస్య రోజున పిండ ప్రదానాలు చేస్తారు. ఈ రోజున పూర్వీకులకు చేసే దానాలు, శాంతులు మంచి ఫలితాలను ఇస్తాయని చెబుతుంటారు.

Written ByInamdar Paresh
Published: Oct 01, 2026, 10:33 AM IST|Updated: Oct 01, 2026, 10:40 AM IST
joinshare
 Sarvapitru Amavasya 2026: సర్వపితృ అమావాస్య ఎప్పుడు..?. పితృ పక్షాల్లో ఈ రోజుకు ఉన్న  ప్రాముఖ్యత ఏమిటంటే..?..
Image Credit: sarvapitruamavasya(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Sarvapitru Amavasya 2026 date tithi tradition: హిందూ సంప్రదాయాల్లో పితృ పక్షానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. ప్రస్తుతం సెప్టెంబర్ 26 నుండి ప్రారంభమై, అక్టోబర్ 10న సర్వ పితృ అమావాస్యతో ముగుస్తుంది. ఈ క్రమంలో 15 రోజుల పాటు పిండ ప్రదానాలుచేస్తారు. ముఖ్యంగా చనిపోయిన పూర్వీకులు ఈ పదిహేను రోజుల పాటు భూమిమీదకు వస్తారని వారికోసం పిండ ప్రదానాలు, తిలతర్పణాలు, దానాలు చేయాలని పండితులు చెబుతున్నారు. 

సాధాణంగా నదీతీరాల్లో శ్రాద్దకర్మలు చేయడం వల్ల విశేషమైన శుభఫలితాలు కలుగుతాయని జ్యోతిష్యులు చెబుతుంటారు. చనిపోయిన వారి తిథి రోజున శ్రాధ్దకర్మలు చేయాలి. ఈసారి మనం అక్టోబరు 10న సర్వపితృ అమావాస్యను జరుపుకుంటాం.  ఒకవేళ కుదరని వాళ్లు సర్వపితృ అమావాస్య రోజున కానీ పిండ ప్రదానాలు , శ్రాద్దకర్మలు చేయాలని పండితులు చెబుతుంటారు.
ఈరోజు  భక్తితో మధ్యాహ్నం 12 తర్వాత పిండ ప్రదానం మొదలు పెట్టాలి.

 తిలతర్పణాలు, దశదానాలు మొదలైనవి చేయాలి. శ్రాద్ద పిండాలను నదుల్లో వేయడం లేదా ఆవులకు పెట్టడం కానీ చేయాలి. మిగత రోజుల్లో కంటే సర్వ పితృ అమావాస్య రోజున చేసే పిండప్రదానం, దానాలు, తిలతర్పణంకు అత్యంత విశేషమైన పుణ్య ఫలం దక్కుతుందని జ్యోతిష్య పండితులు చెబుతుంటారు. అందుకే చాలా మంది సర్వ పితృ అమావాస్య రోజున శ్రాద్దకర్మలు చేస్తారు.

శాస్త్రాల ప్రకారం, ఈ రోజున బ్రాహ్మణులకు అన్నదానం చేస్తారు. పేదలకు దానధర్మాలు, పుణ్యకార్యాలు చేస్తారు. ఒకవేళ ఎవరైతే తమ పూర్వీకుల తేదీలు తెలియని వారికి ఆ రోజున శ్రాద్ధం సమర్పిస్తారు. చనిపోయిన పూర్వీకులు సూక్ష్మ రూపంలో వచ్చి భోజనం చేస్తారని చాలా మంది నమ్మకం.

 ఈ రోజున ఆవులు, చీమలు, కుక్కలు, కాకులకు ఆహారం పెట్టాలి. ఈ రోజున పూర్వీకులకు అన్నదానం చేయడం ద్వారా వారి ఆత్మలకు శాంతి చేకూరుతుందని, వారి అనుగ్రహం వారి సంతానంకు మంచి ఫలితాలు కల్గుతాయని పండితులు అనాదీగా చెబుతుంటారు. 
 

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu Astrology
Astrological Remedies