SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

శని నక్షత్ర మార్పుతో ఈ 3 రాశులకు మహర్దశ.. 2027లో డబ్బే డబ్బు!

Saturn Revati Nakshatra Transit 2027: శని నక్షత్ర మార్పుల కారణంగా కొన్ని రాశులవారికి బంపర్‌ లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా ఆర్థికంగా వస్తున్న సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. దీర్ఘకాలిక సమస్యలు కూడా సులభంగా దూరమవుతాయి. అయితే, ఏయే రాశులవారికి బంపర్‌ లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Written By Dharmaraju Dhurishetty
Published: Nov 21, 2026, 11:19 IST | Updated: Nov 21, 2026, 11:21 IST
Image Credit: ZEE TELUGU NEWS
Join

Saturn Revati Nakshatra Transit 2027: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం.. మనం చేసే కర్మలకు అనుగుణంగా శని భగవానుడు ఫలితాలను అందిస్తూ ఉంటాడు. శని గ్రహ గమనంలో జరిగే ప్రతి చిన్న మార్పు మేషం నుంచి మీనం వరకు పన్నెండు రాశుల వారి ఆర్థిక, వృత్తితో పాటు వ్యక్తిగత జీవితాలపై ఊహించని ప్రభావాన్ని చూపుతూ ఉంటాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. రాబోయే 2027వ సంవత్సరంలో శని సంచారంలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. 2027 ఫిబ్రవరి 8వ తేదీన శని తన మిత్ర గ్రహమైన బుధుడికి సంబంధించిన రేవతి నక్షత్రంలోకి సంచారం చేయబోతోంది. జూన్ 3వ తేదీ వరకు దాదాపు నాలుగు నెలల పాటు శని ఇదే నక్షత్రంలో కొనసాగుతాడని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు.

జ్యోతిషశాస్త్రంలోని 27 నక్షత్రాలలో రేవతి చివరిదిగా భావిస్తూ ఉంటారు. ఇది పాత పనుల ముగింపుకు.. సరికొత్త ప్రారంభాలకు సంకేతంగా చెప్పుకుంటారు. మిత్ర గ్రహమైన బుధుడి నక్షత్రంలోకి శని రావడం వల్ల కొన్ని రాశులవారికి శని చెడు ప్రభావం తగ్గి.. ఊహించని ఫలితాలను అందిస్తుందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ఈ నాలుగు నెలల పాటు కొన్ని రాశులవారికి దీర్ఘకాలంగా నిలిచిపోయిన పనులను పూర్తవుతాయి.. అంతేకాకుండా అద్భుతమైన లాభాలు కూడా కలిగే ఛాన్స్‌లు కూడా ఉన్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.

అదృష్టం రాశులు ఇవే..
మకర రాశి: 
శని ప్రభావంతో ఈ సమయంలో మకర రాశివారికి వ్యక్తిత్వ వికాసం, సామాజిక హోదా విపరీతంగా పెరుగుతుంది. ఉద్యోగం మారాలనుకునే వారికి మంచి అవకాశాలు కూడా లభిస్తాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఆర్థిక స్థితి మెరుగుపడటమే కాకుండా భవిష్యత్తు అవసరాల కోసం ధనాన్ని పొదుపు చేయగలుగుతారు..

వృషభ రాశి: 
వృషభ రాశివారికి కెరీర్ పరంగా అద్భుతమైన మార్పులు కలుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఉద్యోగంలో పదోన్నతులు, కొత్త బాధ్యతలు లభించే ఛాన్స్‌లు ఉన్నాయి. నిరుద్యోగుల కోసం చూస్తున్నవారికి ఈ సమయంలో మంచి ఫలితాలు కలుగుతాయి. వ్యాపారవేత్తలకు ఆర్థిక స్థిరత్వం కూడా లభిస్తుంది.. కొత్త ఆదాయ మార్గాలు కూడా రావడం ప్రారంభమవుతాయి.

మిథున రాశి: 
వృత్తి జీవితంలో అద్బుతమైన లాభాలు కలుగుతాయి. మీరు పడిన కష్టానికి తగిన గుర్తింపు కూడా లభిస్తుంది. పైఅధికారుల ప్రశంసలు దక్కే ఛాన్స్‌లు ఉన్నాయి. ఆగిపోయిన పనులు వేగంగా పూర్తి కూడా కాబోతున్నాయి. కొత్త పెట్టుబడులు పెట్టడానికి మరియు ఆర్థికంగా బలోపేతం కావడానికి ఇది మంచి సమయంగా భావించవచ్చు..
NOTE:

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

ZEENEWS TRENDING STORIES