SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Mouse In Dream Hindu: వినాయక చవితి రోజు ఎలుక కనిపిస్తే శుభమా? జ్యోతిష్య శాస్త్రం ఏం చెబుతోంది?

Seeing Mouse In Dream Hindu: వినాయక చవితి పండుగ రోజున గణనాథుడి వాహనమైన మూషికం (ఎలుక) కంటపడటం వెనుక అనేక ఆధ్యాత్మిక, జ్యోతిష్య సంకేతాలు దాగి ఉన్నాయి. ఎలుక కనిపిస్తే కష్టాలు తొలగుతాయా? ఇంట్లో ఎలాంటి మార్పులు వస్తాయి? తెల్ల ఎలుక కనిపించడం లేదా కలలో రావడం వల్ల కలిగే విశేష ఫలితాలేమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

Written By Harish Darla
Published: Sep 14, 2026, 03:07 PM IST | Updated: Sep 14, 2026, 05:03 PM IST
Join

Seeing Mouse In Dream Hindu: గణేశుడు అంటే విఘ్నాలను నివారించే విఘ్నేశ్వరుడు మాత్రమే కాదు, చిట్టి ఎలుకను తన వాహనంగా చేసుకుని ముల్లోకాలను చుట్టే పార్వతీపరమేశ్వరుల ముద్దుల తనయుడు. ప్రతి ఏటా వినాయక చవితి పండుగను భక్తులు ఎంతో వేడుకగా జరుపుకొంటారు. ఈ పండుగ రోజున చంద్రుడిని చూడకూడదని ఇతిహాసాలు స్పష్టం చేస్తుండగా, మూషిక దర్శనం విషయంలో జ్యోతిష్య శాస్త్రం కొన్ని కీలక విషయాలను వెల్లడిస్తోంది.

సాధారణంగా ఇళ్లల్లో లేదా పొలాల్లో ఎలుకలు కనిపించడం సహజమే అయినా, పండుగ రోజున గణనాథుడి పూజతో పాటు ఆయన వాహనమైన మూషికానికి కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. భక్తులు చేసే ప్రతి పూజ, ప్రార్థన ఈ మూషికం ద్వారానే విఘ్నేశ్వరునికి చేరుతుందని నమ్ముతారు.

చవితి సమయంలో ఎలుక కనిపించే విభిన్న పరిస్థితులను బట్టి పండితులు చెప్పే ఫలితాలు ఇలా ఉండబోతాయట.
ఇంటి నుంచి బయటకు వెళ్తే: వినాయక చవితి పండుగ రోజున మీ ఇంట్లో ఉన్న ఎలుక బయటకు వెళ్తున్నట్లు కనిపిస్తే దానిని అత్యంత శుభ సూచకంగా భావించాలి. ఇది ఇంట్లోని పేదరికాన్ని, సమస్త కష్టాలను తొలగిస్తుందని అర్థం. వినాయకుడి ఆశీస్సులతో ఆ కుటుంబంలో సంతోషం, శ్రేయస్సు నెలకొంటాయి.

తెల్ల ఎలుక కనిపించడం: లంబోదరుడి పండుగ నాడు తెల్ల ఎలుక కంటపడితే అది తీవ్ర సానుకూలతకు (పాజిటివిటీకి) సంకేతం. త్వరలోనే ఇంట్లోని దీర్ఘకాలిక సమస్యలన్నీ పూర్తిగా తీరిపోతాయని జ్యోతిష్య నిపుణులు పేర్కొంటున్నారు.

విగ్రహం చుట్టూ తిరిగితే: పూజ మంటపంలో గణపతి విగ్రహం చుట్టూ ఎలుక ప్రదక్షిణ చేస్తున్నట్లు తిరిగితే అది ఎంతో మంగళకరం. మీరు నిర్వర్తించిన పూజకు స్వామివారు సంతృప్తి చెందారని, ఆయన దివ్య ఆశీస్సులు మీపై నిరంతరం ఉంటాయని దీని అర్థం.

స్వప్న శాస్త్రం ప్రకారం.. పండుగ రోజున కలలో ఎలుక కనిపించినా లేదా ఎలుక పంజరం నుంచి తప్పించుకుని పారిపోతున్నట్లు కల వచ్చినా శుభ పరిణామంగా పరిగణించాలి. త్వరలోనే ఏదైనా పెద్ద కష్టం లేదా మానసిక బాధ నుంచి విముక్తి లభిస్తుందని, జీవితంలో ఊహించని సానుకూల మార్పులు వస్తాయని స్వప్న శాస్త్రం వివరిస్తోంది.

మొత్తానికి, వినాయక చవితి వేళ మూషిక రూపంలో లంబోదరుడి అనుగ్రహం లభించడం భక్తుల జీవితాల్లో నూతన వెలుగులను నింపుతుందని జ్యోతిష్య పండితులు విశ్వసిస్తున్నారు.

(గమనిక: ఇచ్చిన సమాచారం కేవలం కొందరు జోతిష్య నిపుణుల సలహాలు, సూచనల మేరకు మత విశ్వాసాల ఆధారంగా రూపొందించింది. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.)

Also Read: వినాయక చవితి స్పెషల్..దేశంలో 5 ఫేమస్ గణపతి ఆలయాలు..కాణిపాకం ఉందా?

Also Read: అన్నీ స్కూళ్లు, కాలేజీలకు సెలవు..ఎట్టకేలకు సెలవు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం!


 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

Add Zee News as a Preferred Source

About the Author

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.

ZEENEWS TRENDING STORIES