SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Shani Trayoshi: శని నక్షత్రంలో త్రయోదశి.. ఈ రహస్య రెమిడీలు పాటిస్తే సాడేసాతి దోషాల నుంచి శాశ్వతంగా రిలీఫ్ .!.

Shanidev Puja: శనివారం రోజున కొన్ని పూజలు, వ్రతాలు చేస్తే సాడేసాతి దోషాల నుంచి విముక్తి లభిస్తుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఈక్రమంలో సాడేసాతి దోషాలు, అర్ధష్టమి, అష్టమ దోషాలతో చాలా మంది బాధపడుతుంటారు. ఇలాంటి వారు చేయాల్సిన రెమిడీలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

Written By Inamdar Paresh
Published: Oct 23, 2026, 07:57 AM IST | Updated: Oct 23, 2026, 08:08 AM IST
Image Credit: shanidev effect(file)
Join

Shani trayodashi effect lord shani dev puja Vidhi: జ్యోతిష్య పండితుల ప్రకారం నవగ్రహాల్లో శనిదేవుడు అత్యంత శక్తివంతుడని చెబుతారు. ఆయన కర్మలకు ప్రభువు. మనం ఎలాంటి పనులు చేస్తే అలాంటి ఫలితాలు మనకు కల్గుతాయి. ముఖ్యంగా సాడేసాతి శని ప్రభావం, అర్దాష్టమ, అష్టమి శని ప్రభావం వల్ల కొంత మంది తమజీవితాల్లో అనుకొని కష్టాలు సంభవిస్తాయని బాధపడుతారు. ఈ క్రమంలో శని దోషాలతో ఉద్యోగ జీవితంలో ఎదుగుదల ఉండదు. పెళ్లిలో ఆటంకాలు ఏర్పడతాయి. ఆర్థిక పరసమస్యలు ఏర్పడతాయి. కోర్టుకేసుల్లో ఇరుక్కుకుంటారు. 

ఈ క్రమంలో శనిదేవుడు చెడు ప్రభావం నుంచి బైటపడాలంటే శనివారం రోజున కొన్ని పరిహారాలు పాటించాలి. అంతే కాకుండా శనిత్రయోదశి శనిభాగవానుడికి అత్యంత ప్రీతికరమైన తిథి. మనం అక్టోబరు 24న శనిత్రయోదశిని జరుపుకుంటాం. ఈ రోజున శనికి ఇష్టమైన శనికి ప్రీతికమైన నక్షత్రం అనురాధ కూడా కలిసి రావడం చాలా శుభప్రదంగా చెబుతున్నారు. అందుకే కొన్ని పరిహరాలు చేస్తే అన్ని రకాల శనిపీడల నుంచి శాశ్వతంగా విముక్తిని పొందవచ్చు...

శని పీడ నివారణలు..

శనిత్రయోదశి రోజు బ్రాహ్మీ మూహుర్తంలో నిద్రలేవాలి. స్నానం మొదలైన పనుల్ని పూర్తి చేసుకొవాలి. ఆ తర్వాత  శుభ్రవస్త్రాలను ధరించాలి. దేవువి వద్ద దీపం పెట్టి, మంచి సంకల్పంతో పూజలు చేయాలి. ఈ విధంగా చేస్తే అన్ని రకాలుగా మంచి జరుగుతుందని పెద్దలు చెబుతారు.  శనిత్రయోదశి రోజు బ్రాహ్మీ మూహుర్తంలో నిద్రలేవాలి. స్నానం మొదలైన పనుల్ని పూర్తి చేసుకొవాలి. ఆ తర్వాత  శుభ్రవస్త్రాలను ధరించాలి. దేవువి వద్ద దీపం పెట్టి, మంచి సంకల్పంతో పూజలు చేయాలి. ఈ విధంగా చేస్తే అన్ని రకాలుగా మంచి జరుగుతుందని పెద్దలు చెబుతారు. నవగ్రహలు ఉన్న ఆలయంకు వెళ్లాలి. అక్కడ శనికి ఎదురుగా కాకుండా ఒక పక్కన ఉండి శనీకి తొలుత శుభ్రమైన మంచినీటితో అభిషేకం చేసి ఆతర్వాత తైలంతో అభిషేకం చేయాలి.

శనిదేవుడికి తైలాభిషేకం అంటే అత్యంత ప్రీతికరమైనది. అంతే కాకుండా శని వారం రోజున కొన్ని నల్లని వస్త్రంను, నల్లని నువ్వులను శనీభగవానుడికి సమర్పించుకొవాలి.  నవధాన్యాలు దానంగా ఇవ్వాలి. నెయ్యితో దీపం వెలిగించాలి.  శునకాలకు, ఆవులకు రోట్టెలు పెట్టాలి. కాకులకు ఏదైన పదార్థాలు తినిపించాలి. ఈ విధంగా చేస్తే శనిదోషాల నుంచి రిలీఫ్ దొరుకుతుంది. 

శనిదేవుడికి స్తోత్రాలు, అష్టోత్తర శతనామావళిని పఠించాలి. శనిదేవుడికి సూర్య భగవానుడు, వెంకటేశ్వర స్వామి, హనుమంతుడు అంటే అత్యంత భక్తి. అందుకే హనుమాన్ చాలీసా, వెంకటేశ్వర స్వామి వ్రతం, విష్టు సహస్రనామాలు, హనుమంతుడిని తమలపాకుల మాల సమర్పించడం చేస్తే శనిదేవుడి అనుగ్రహం వల్ల దోషాలు అన్నిపోతాయి. అందుకే శనిత్రయోదశి వేళ పైన సూచించిన పూజలు, రెమిడీలు ఆచదరించాలని పండితులు చెబుతున్నారు.

 

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES