Shani trayodashi: అదృష్టం తెచ్చి పెడుతున్న శనిత్రయోదశి.!. ఈ రాశులకు బంపర్ శుభవార్త.. మీరున్నారా..?..
Shani dev effect: శని వారం రోజున త్రయోదశి కలసి రావడం అత్యంత శుభప్రదంగా జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.ముఖ్యంగా దీని ప్రభావం వల్ల కొన్ని రాశులకు ఆకస్మిక ధనప్రాప్తితో పాటు జీవితంలో పెనుమార్పులు సంభవిస్తాయి.
Shani Trayodashi yog lucky zodiac signs: జ్యోతిష్య పండితులు ప్రకారం చాలా మంది తరచుగా శని ప్రభావం వల్ల అనేక సమస్యలు ఎదుర్కొంటారు. అర్దాష్టమ, ఏలినాటి, సాడేసాతి మొదలైన ప్రభావంతో ఇబ్బందులుపడతారు. ఈ క్రమంలో మనం అక్టోబరు 24వ తేదీనశనివారం రోజు శని త్రయోదశిని జరుపుకుంటాం. అది కూడా శనివారం కలిసి రావడంతో భారీ శుభయోగాలు ప్రాప్తిస్తాయి. ముఖ్యంగా శని త్రయోదశి వేళ త్రిగ్రహ రాజయోగంతో పాటు,పారిజాతయోగంలు కూడా ఏర్పడుతున్నాయి. దీని ప్రభావం వల్ల కొన్ని రాశులకు ఊహించని విధంగా శుభయోగాలు కల్గుతాయి.
చాలా మంది శనిదేవుడి ప్రభావం వల్ల కష్టాలు పడుతున్నామని చెబుతుంటారు. కానీ ఆయన మనం చేసుకున్న కర్మలను బట్టి మాత్రమే ఫలితాలను ఇస్తాడు.అందుకే మంచి పనులు చేయాలని, ఒకరి గురించి చెడు ఆలోచనలు, చెడు భావనలు చేయోద్దని పండితులు సూచిస్తున్నారు.
మేష రాశి.. ఈ రాశుల వారికి శని త్రయోదశి ప్రభావం వల్ల ఆకస్మిక ధన ప్రాప్తి కల్గుతుంది. చాలా రోజుల నుంచి పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. లాటరీలు తగిలుతాయి. విదేశాల నుంచి శుభవార్తలు అందుతాయి. పూర్వీకుల ఆస్తులు మీకు సొంతమౌతాయి.
కన్యా.. ఈరాశి వారికి శనిదేవుడి అనుకూల ప్రభావం వల్ల ఉద్యోగంలో ప్రమోషన్లు సొంతం చేసుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో రాణిస్తారు. పెళ్లిలో ఎదురౌతున్న ఆటంకాలు దూరమౌతాయి. సంఘంలో పేరు, ప్రఖ్యాదులు పెరుగుతాయి. బిజినెస్ రంగంలో పెట్టే ఇన్వెస్ట్ మెంట్ మంచి లాభాల్ని తెచ్చిపెడుతుంది.
ధనస్సు.. ఈ రాశుల వారు కోర్టు కేసులు మీకు అనుకూలంగా తీర్పులు వస్తాయి. బంధువులతో ఏర్పడిన వివాదాలు సమసిపోతాయి. రాజకీయ నేతలు, అధికారులతో పరిచయం ఏర్పడాతాయి. రాదినుకున్న మొండిబాకీలు వసూలు అవుతాయి.
కుంభం.. ఈరాశుల వారికి శని ప్రభావం వల్ల సంతానం విషయంలో శుభవార్తలు వింటారు. కెరీర్ లో డెవలప్ మెంట్ కన్పిస్తుంది. రాజకీయాల్లో రాణిస్తారు. ఉన్నత పదవుల్ని ఆశ్రయిస్తారు. గతంలో మీరుసాయంచేసిన వారంతా మీకు ధనం రూపంలో కష్టకాలంలో అండగా ఉంటారు. ఉద్యోగంలో ప్రమోషన్లు,స్థాన చలనం కన్పిస్తుంది.
మొత్తంగా ద్వాదశ రాశులపై శనీదేవుడి ప్రభావం ఉండనుంది. దీంతో మిగత రాశుల వారు శనిదేవుడికి తైలాభిషేకం, నల్లని వస్త్రాల దానం, ఉప్పు, ఇనుప వస్తువులు, నవధాన్యాలు దానంగా ఇవ్వాలి. నెయ్యి దీపారాధన, శునకాలు, ఆవులకు ఆహర పదార్థాలు పెట్టాలి. ఈ విధంగా పలు రెమిడీలు పాటిస్తే శనిదోషాల నుంచి విముక్తి లభిస్తుంది. ( గమనిక- ఈ స్టోరీ పూర్తిగా నమ్మకం, విశ్వాసాలపై మాత్రమే ఆధార పడి ఉంటుంది. జీ తెలుగు మీడియా దీనికి బాధ్యత వహించదు..)