Pawan kalyan deputy cmo office serious fake whatsapp channel: ఆంధ్ర ప్రదేశ్ లో ఇటీవల సోషల్ మీడియాలో ఫెక్ పోస్టులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుంది. ఈ క్రమంలో ముఖ్యంగా రాజకీయ నేతలు, మహిళల్ని టార్గెట్ చేసుకుని విషపు ప్రచారాలు చేస్తున్న వారిపై, పోస్టులపై కఠిన చర్యలు తీసుకొవాలని ఏపీ ప్రభుత్వం పోలీసుల్ని ఆదేశించింది. ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ పేరిట కొనసాగుతున్న వాట్సాప్ ఛానెల్ పై డిప్యూటీ సీఎంవో కార్యాలయం సీరియస్ గా స్పందించింది. డిప్యూటీ సీఎంవో, ఆంధ్ర ప్రదేశ్ పేరుతో కొనసాగుతున్న ఆ ఛానెల్ కు, తమ కార్యాలయంకు సంబంధంలేదని స్పష్టం చేసింది.
కార్యాలయం గుర్తింపును దుర్వినియోగం చేస్తు ఫెక్ ప్రచారంను నమ్మోద్దని అధికారులు స్పష్టం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఈ నకిలీ వాట్సాప్ ఛానెల్ లో పోస్టులను, అందులోని సమాచారంను నమ్మవద్దని డిప్యూటీ సీఎంవో తెల్చిచెప్పింది.
అంతే కాకుండా.. రాజకీయంగా నేరుగా ఎదుర్కోలేక.. వైసీపీ నేతలే కావాలని ఇలాంటి ఫెక్ ఛానెళ్లను క్రియేట్ చేసి, తప్పుడు ప్రచారం చేస్తున్నారని జనసేన నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. ఇటీవల సోషల్ మీడియాలో.. https://www.whatsapp.com/channel/0029VamW9QT11ulKolFqhK2w లింక్ ద్వారా .. డిప్యూటీ సీఎంఓ, ఆంధ్రప్రదేశ్ అంటూ ఫెక్ వాట్సాప్ ఛానెల్ నడుస్తొంది. దీనిలోని పోస్టులు, సమాచారంతో చాలా మంది పవన్ కళ్యాన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు నిజమనుకుని ఫాలో అయ్యారు.
ఈ క్రమంలో దీనిపై పలు సందర్భాల్లో డిప్యూటీ సీఎంవో అధికారులకు సంప్రదించగా దీనిలోని కంటెంట్ కు తమకు సంబంధంలేదని చెప్పడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వివాదం వేళ ఈ ఫెక్ ఛానెల్ ఘటన కాస్త వార్తలలో నిలిచింది.