నవరాత్రులు 2026 ఎప్పుడు ప్రారంభం? 9 రోజులు దుర్గాదేవి అలంకారాలు, ధరించాల్సిన రంగు, విశిష్టతలివే!
ప్రతి ఏడాది దసరా పండుగ మన దేశంలో అత్యంత విశిష్టంగా జరుపుకొంటారు. ఈ ఏడాది దసరా నవరాత్రులు అక్టోబర్ 11వ తేదీ ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. నవరాత్రిల్లో దుర్గా దేవిని పూజిస్తాం. ఒక్కోరోజు ఒక్కో అమ్మవారి అవతారాన్ని పూజిస్తారు. ప్రత్యేకమైన రంగు దుస్తులను ధరించి పూజిస్తారు. అయితే, నవరాత్రి అమ్మవారి అవతారాలు విశిష్టత తెలుసుకుందాం.
Navratri 9 Avatars List 2026: దసరా నవరాత్రులు 2026 అక్టోబర్ 11వ తేదీ నుంచి ప్రారంభం అవుతాయి. ఇది మహర్నవమి 19న పూర్తవుతుంది. ఆ మరుసటి రోజే దసరా అక్టోబర్ 20వ తేదీన జరుపుకొంటారు. అమ్మవారి నవరాత్రి అవతారాల విశిష్టత తెలుసుకుందాం.
దసరా మహోత్సవములు 2026 11వ తేదీ ఆదివారం ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి నుంచి 20వ తేదీ మంగళవారం దశమి వరకు జరుపుకోనున్నారు. అయితే, మొదటి రోజు 11వ తేదీ బాలత్రిపుర సుందరి దేవి అవతారం ఉండనుంది.
మొదటి రోజు తెలుపు రంగు దుస్తులు ధరించి పూజ చేసుకుంటారు. ఇక సోమవారం 12వ తేదీ విదియ రోజు శ్రీ గాయత్రి దేవి అలంకరణ ఉంటుంది. ఇక ఈరోజు ఎరుపు రంగు ధరిస్తే శుభకరం.
నవరాత్రుల్లో మూడవరోజు శుద్ధ తదియ మంగళవారం రానుంది. 13వ తేదీ శ్రీ అన్నపూర్ణ దేవి అవతారంలో దుర్గామాతను కొలుస్తారు. ఈరోజు అమ్మవారికి ఇష్టమైన రంగు రాయల్ బ్లూ కలర్ రంగు దుస్తులు ధరిస్తారు.
ఇక నవరాత్రుల్లో నాలుగవరోజు 14వ తేదీ బుధవారం ఆశ్వయుజ శుద్ధ చవితిరోజు శ్రీ మహాచండీ దేవి అవతారం. ఈరోజు అమ్మవారిని ఆరెంజ్ రంగు దుస్తులు ధరించి పూజిస్తారు.
Read Also: శరన్నవరాత్రుల్లో అఖండ దీపం వెలిగిస్తున్నారా? దిశ, నూనె, వత్తుల విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
ఇక 15వ తేదీ గురువారం శుద్ధ పంచమి రోజున శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిని పూజిస్తారు. ఈరోజు బూడిదరంగులో ఉండే దుస్తులను ధరిస్తారు.
శారదీయ నవరాత్రుల్లో 16వ తేదీ శుక్రవారం ఆశ్వయుజ శుద్ధ షష్టి రోజున శ్రీ సరస్వతి దేవిని కొలుస్తారు. ఈరోజు మూలా నక్షత్రం ఉండునుంది. ఈరోజు అక్షరాభ్యాసం కూడా నిర్వహిస్తారు. ఇక ఈ రోజు నెమలిపచ్చ రంగు దుస్తులు ధరిస్తారు.
అక్టోబర్ 17వ తేదీ శనివారం రోజున సప్తమి శ్రీ మహాలక్ష్మి అవతారంలో దుర్గా దేవిని పూజిస్తారు. ఈరోజు ఆకుపచ్చ రంగు ధరించాలి.
ఇక అక్టోబర్ 18వ తేదీ ఆదివారం రోజున అష్టమి దుర్గాదేవిని పూజిస్తారు. ఈరోజు దుర్గాష్టమి కూడా నిర్వహిస్తారు. ఈరోజు గులాబీ రంగు దుస్తులు ధరించాలి.
నవరాత్రుల్లో 19వ తేదీ సోమవారం నవమి రోజున మహర్నవమి ఉంటుంది. ఈరోజు మహిషాసుర మర్ధిని అవతారంలో అమ్మవారు ఆశీర్వదిస్తారు. ఈరోజు ఆయుధ పూజ కూడా చేయడం ఆనవాయితీ. దశమి రోజు విజయ దశమి నిర్వహిస్తారు.(Disclaimer: ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం సాధారణ నమ్మకాలు, పంచాంగాలు, జ్యోతిష్య అభిప్రాయాల ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. దీనిని శాస్త్రీయంగా నిర్ధారించబడిన సమాచారంగా పరిగణించరాదు. ఈ సమాచారాన్ని మా Zee Telugu News స్వతంత్రంగా ధృవీకరించలేదు.)