• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆధ్యాత్మికం
  • /శరన్నవరాత్రుల్లో అఖండ దీపం వెలిగిస్తున్నారా? దిశ, నూనె, వత్తుల విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

శరన్నవరాత్రుల్లో అఖండ దీపం వెలిగిస్తున్నారా? దిశ, నూనె, వత్తుల విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

నవరాత్రులు 2026 అక్టోబర్‌ 11వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. 9 రోజులపాటు దుర్గాదేవిని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. హిందూమతంలో శరన్నవరాత్రులను ఎంతో కఠినంగా అనుసరిస్తారు. అయితే, ఈ నవరాత్రుల్లో మీ ఇంట్లో అఖండ దీపం వెలిగిస్తున్నారా? అయితే, కొన్ని నియమాలు ఉన్నాయి.. వాటిని అనుసరించి దుర్గాదేవికి దీపం వెలిగించాలి.

Written ByRenuka Godugu
Published: Oct 05, 2026, 02:40 PM IST|Updated: Oct 05, 2026, 02:42 PM IST
joinshare
శరన్నవరాత్రుల్లో అఖండ దీపం వెలిగిస్తున్నారా? దిశ, నూనె, వత్తుల విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
Image Credit: Akhand Deepam Rules 2026

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
TV Anchor Turned To Actress: ఒకప్పుడు బుల్లితెర యాంకర్..నేడు ఒక్క సినిమాకి రూ.20 కోట్ల పారితోషికం తీసుకునే స్టార్ హీరోయిన్‌!

TV Anchor Turned To Actress: ఒకప్పుడు బుల్లితెర యాంకర్..నేడు ఒక్క సినిమాకి రూ.20 కోట్ల పారితోషికం తీసుకునే స్టార్ హీరోయిన్‌!

2

Kavitha Strike: ఆమరణ దీక్ష చేస్తానని కవిత ప్రకటన.. ఏ డిమాండ్‌పై అంటే?

3

Mahabubabad: గురుకుల హస్టళ్లలో ఎలుకల కలకలం.. రాత్రిళ్లు చేతులు, కాళ్లను కొరుకుతూ.. లబో దిబో మంటున్న విద్యార్థులు.!.

4

దసరా పండగకు ముందు కార్మికులకు మోదీ సర్కార్ గుడ్ న్యూస్ .. వేరియబుల్ DA పెంచుతూ నిర్ణయం..!!

5

Srinidhi Shetty: యష్ కంటే నానినే బెస్ట్ అంటున్న శ్రీనిధి.. అసలు కారణం ఇదే!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Akhand Deepam Rules 2026: నవరాత్రల్లో అఖండ దీపం వెలిగిస్తారు. ఈసారి దసరా పండుగ 2026 అక్టోబర్‌ 20వ తేదీన జరుపుకోనున్నారు. దీనికి ముందుగానే నవరాత్రులు అక్టోబర్‌ 11వ తేదీనే ప్రారంభం అవుతాయి. ఒక్కోరోజు ఒక్కో దుర్గాదేవి అవతారాలను పూజిస్తారు. అయితే, నవరాత్రులను అత్యంత భక్తి శ్రద్ధలతో చేసుకుంటారు. ఈ నవరాత్రులకు మీ ఇంట్లో అఖండ దీపం వెలిగిస్తున్నారా? ఇది తప్పనిసరి. చెడుపై మంచి విజయానికి ప్రతీక. అఖండ జ్యోతి 9 రోజులపాటు వెలుగుతూ ఉండాలి. ఈ పండుగ మన ఇంటికి సుఖసంతోషాలను అందిస్తుంది. అయితే, ఇంట్లో అఖండ జ్యోతి వెలిగించినప్పుడు కొన్ని వాస్తు నియమాలను అనుసరించి పెట్టాలి. తద్వారా ఆ ఇల్లును దుర్గామాత పాజిటివ్‌ ఎనర్జీతో నింపుతుంది. శరన్నవరాత్రులు కలశస్థాపన కూడా చేస్తారు. దసరాతో ఈ నవరాత్రులు ముగుస్తాయి. అయితే, ఈ నవరాత్రుల మొదటిరోజు అఖండ జ్యోతి వెలిగించాలి. తొమ్మిదిరోజులపాటు వెలిగిస్తారు. దీనివల్ల ఇంట్లో నెగిటివ్‌  ఎనర్జీ కూడా తొలగిపోతుంది.

వాస్తు నిపుణుల ప్రకారం అఖండ జ్యోతి వెలిగించడానికి కొన్ని నియమాలు ఉన్నాయి.. వాటిని అనుసరించి వెలిగించాలి. ఇంట్లో కలశంతోపాటు ఈ అఖండ దీపం ఇంటికి ఒక సానుకూల వాతావరణాన్ని తీసుకువస్తుంది.

అయితే, ఈ అఖండ జ్యోతి వెలిగిస్తే స్వచ్చమైన నెయ్యి వాడాలి. నెయ్యితో అఖండ జ్యోతి వెలిగిస్తే దుర్గామాతకు కుడివైపున పెట్టాలి. ఒక వేళ నూనెతో వెలిగిస్తే ఎడమవైపున ఏర్పాటు చేసుకోవాలి. అంతేకాదు ఈ అఖండ దీపం అడుగు భాగంలో కూడా కాస్త బియ్యం, నల్ల నువ్వులు, మినపప్పు కూడా వేసి పెట్టాలి. ఈ దీపం తూర్పు, పడమర, ఉత్తరం దిక్కున ఉండేలా చూడాలి. దక్షిణం దిశగా పొరపాటున కూడా పెట్టుకూడదు.

దీపం పెట్టేముందు నెయ్యి లేదా నూనె నిండుగా వేయాలి. తద్వారా దీపం కొండెక్కకుండా ఉంటుంది. అయితే, దీపం పెట్టి దానిపై ఒక గాజు చిమ్మి కూడా పెడితే గాలికి అఖండ దీపం కొండెక్కకుండా ఉంటుంది.

ఎందుకంటే నవరాత్రుల్లో తొమ్మిదిరోజులపాటు ఈ దీపం కొండెక్కకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఒకవేళ పొరపాటున దీపం కొండెక్కితే అమ్మవారికి మనస్పూర్తిగా పూజించి, క్షమించమని అడిగి.. మరో వత్తి వేసి వెలిగించండి. అయితే, అఖండ జ్యోతి తొమ్మిది రోజులు గడచిన తర్వాత కూడా వెలుగుతుంటే పొరపాటున కూడా ఆర్పకండి. నూనె లేదా నెయ్యి పూర్తవ్వనివ్వండి.

నవరాత్రల్లో తొమ్మిది రోజులపాటు ఈ అఖండ దీపం వెలిగిస్తే ఇంట్లో నెగిటివ్‌ ఎనర్జీ తొలగిపోతుంది.  ఎలాంటి కష్టాలు వచ్చినా తొలగుతాయి. ఆర్థిక స్థిరత్వం పొందుతారు. ఇంట్లో సుఖసంతోషాల వాతావరణం నెలకొంటుంది. ఇలా దీపం వెలిగించడం వల్ల ఇంట్లో ఉన్నవారికి కూడా విజయం వరిస్తుంది. (Disclaimer: ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం సాధారణ నమ్మకాలు, పంచాంగాలు, జ్యోతిష్య అభిప్రాయాల ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. దీనిని శాస్త్రీయంగా నిర్ధారించబడిన సమాచారంగా పరిగణించరాదు. ఈ సమాచారాన్ని మా Zee Telugu News స్వతంత్రంగా ధృవీకరించలేదు.)

Add Zee News as a Preferred Source
TAGS:
Festivals