డిసెంబర్ 15 వరకు ఈ 4 రాశులకు పరీక్షా కాలమే.. సూర్యుడి సంచారంతో మానసిక ఒత్తిడి!
Sun Transit In Scorpio 2026: సూర్యుడి సంచార ప్రభావం డిసెంబర్ 15వ తేదీ వరకు కూడా కొనసాగుతూ ఉంటుందని జ్యోతిష్యులు నాగరాజ్ శర్మ తెలుపుతున్నారు. అప్పటివరకు కూడా కొన్ని రాశుల వారికి సమస్యలు తప్పవని.. ముఖ్యంగా మానసిక ఒత్తిడి పెరుగుతుందని ఆయన అంటున్నారు. కాబట్టి ఈ సమయంలో ఏ రాశిల వారు ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలుసుకోండి.
Sun Transit In Scorpio 2026: జ్యోతిష్య శాస్త్రంలో అన్ని గ్రహాలకు ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది.. అలాగే సూర్యగ్రహానికి మరింత ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ఈ గ్రహాన్ని ఆత్మవిశ్వాసంతో పాటు గౌరవం ప్రతిష్ట వృత్తి నాయకత్వ లక్షణాలకు అధిపతిగా భావిస్తూ ఉంటారు. కాబట్టి ఈ గ్రహం సంచారం చేస్తే మొత్తం 12 రాశులు ప్రభావితమవుతాయి. ముఖ్యంగా నవంబర్ 16వ తేదీన సూర్యుడు తులా రాశిని వదిలి పెట్టి వృశ్చిక రాశిలోకి సంచారం చేశాడు. తులా రాశిలో సూర్యుడు బలహీనంగా ఉండడంవల్ల కొన్ని రాశుల వారిపై అశుభ ప్రభావం పడింది. అయితే సూర్యుడికి మిత్రుడు గా భావించే కుజుడు వృశ్చిక రాశికి అధిపతిగా వ్యవహరించడం విశేషం. దీని కారణంగా డిసెంబర్ 16వ తేదీ వరకు ఈ రెండు గ్రహాల ప్రభావం అన్ని రాశుల వారిపై కొనసాగుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో కొన్ని రాశుల వారికి దిమ్మతిరిగే ధన లాభాలు కలగబోతున్నాయి. ఆర్థికంగా వస్తున్న సమస్యలు పూర్తిగా తొలగిపోయే ఛాన్సులు కూడా ఉన్నాయి. అదేవిధంగా ఈ సమయంలో కొన్ని రాశుల వారికి అనేక సమస్యలు కూడా తలెత్తవచ్చు. ఏరాశుల వారికి ఈ సమయం కష్టకారంగా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
వీరికి లాభాలే లాభాలు:
మేష రాశి
సూర్యుడి ప్రభావంతో ఈ సమయంలో మేషరాశి వారికి అనేక రకాల సమస్యలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు నాగరాజ్ శర్మ తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో ఆకస్మిక ఖర్చులు కూడా రావచ్చు. అలాగే పనుల్లో ఏదైనా నిర్ణయాలు తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించడం మంచిదని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో వివాదాలు కూడా తలెత్తవచ్చని.. కాబట్టి ఎంతో జాగ్రత్తగా ముందుకు సాగాల్సి ఉంటుందని జ్యోతిష్యులు నాగరాజ్ శర్మ తెలుపుతున్నారు. కాబట్టి మానసికంగా చాలా వరకు ఆరోగ్యంగా ఉండడం చాలా మంచిది..
వృషభ రాశి
వృషభ రాశి వారికి కూడా ఈ సమయంలో ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. ముఖ్యంగా వైవాహిక జీవితంలో అనేక మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. భాగస్వామి అభిప్రాయ విభేదాలతో చిన్న చిన్న సమస్యలు రావచ్చు. పని ప్రదేశాల్లో కూడా కొన్ని రకాల సమస్యలు వస్తాయి. ముఖ్యంగా అధిక కోపమున్న వ్యక్తులు తప్పకుండా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అలాగే అభిప్రాయాలు వ్యక్తం చేసే క్రమంలో కూడా ఆచితూచి వ్యవహరించడం ఎంతో మంచిది..
కర్కాటక రాశి
కర్కాటక రాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా సూర్యుడి సంచారం కాస్త కష్టతరంగానే ఉండబోతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. వృత్తిపరంగా ఏకాగ్రత లోపించడం వల్ల అనేక రకాల సమస్యలు రావచ్చు. ముఖ్యంగా ఈ సమయంలో అపార్ధాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ప్రేమ వ్యవహారాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండడం మంచిదని జ్యోతిష్యులు నాగరాజ శర్మ తెలుపుతున్నారు. రిస్కు తీసుకోకుండా ముందుకు సాగితే అద్భుతమైన లాభాలు కూడా పొందగలుగుతారు..
సింహరాశి
సింహరాశికి అధిపతి సూర్యుడే కాబట్టి.. వీరికి కూడా కొన్ని రకాల సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని.. ఈ సమయంలో వీరు చాలా జాగ్రత్తగా ఉండడం మంచిదని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ముఖ్యంగా ఇల్లుతో పాటు భూమి ఆస్తి సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తల్లి ఆరోగ్యంపై ఆందోళన కూడా చాలా వరకు పెరుగుతుంది. మానసిక అస్థిరత కూడా ఏర్పడి అనేక రకాల సమస్యలు వస్తాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
NOTE: