• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆధ్యాత్మికం
  • /అక్టోబర్ 24న స్వాతి నక్షత్రంలోకి సూర్యుడు.. ఈ 4 రాశుల వారికి అదృష్టం కలిసొస్తుందా?

అక్టోబర్ 24న స్వాతి నక్షత్రంలోకి సూర్యుడు.. ఈ 4 రాశుల వారికి అదృష్టం కలిసొస్తుందా?

Sun Transit Effect: సూర్యుడు అక్టోబర్ 24వ తేదీన స్వాతి నక్షత్రం లోకి సంచారం చేయబోతున్నాడు. దీని ప్రభావంతో కొన్ని రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ చెబుతున్నారు. ముఖ్యంగా ఈ క్రింది నాలుగు రాశుల వారికి బంపర్ జాక్పాట్ లభిస్తుంది.

Reported ByDharmaraju Dhurishetty
Published: Oct 17, 2026, 08:44 AM IST|Updated: Oct 17, 2026, 08:46 AM IST
joinshare
అక్టోబర్ 24న స్వాతి నక్షత్రంలోకి సూర్యుడు.. ఈ 4 రాశుల వారికి అదృష్టం కలిసొస్తుందా?
Image Credit: ZEE TELUGU NEWS

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

Trending

  • News
  • Photos
  • Videos
BJP అగ్ర నేత LK అద్వానీకి తీవ్ర అస్వస్థత..

BJP అగ్ర నేత LK అద్వానీకి తీవ్ర అస్వస్థత..

2

రాహు గ్రహ సంచారంతో అదృష్టం మారనుందా? ఈ రాశుల వారికి కీలక సూచనలు..

3

డిసెంబర్ 5 నుంచి ఈ 4 రాశుల జీవితాల్లో మార్పులు? కేతువు సంచార ఫలితాలు ఇవే..

4

ఇంద్రకీలాద్రిపై ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు.. ఏడో రోజు మహాలక్ష్మి దేవిగా దుర్గమ్మ..

5

అక్టోబర్ 24న స్వాతి నక్షత్రంలోకి సూర్యుడు.. ఈ 4 రాశుల వారికి అదృష్టం కలిసొస్తుందా?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Sun Transit Effect On Zodiac: జ్యోతిష్య శాస్త్రంలో సూర్యుడిని ఆత్మవిశ్వాసంతో పాటు నాయకత్వ లక్షణాలకు కారకుడిగా భావిస్తూ ఉంటారని.. ఈ గ్రహం ప్రభావంతో అనేక రాశులు ప్రభావితం అవుతాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ముఖ్యంగా సూర్యుడు అక్టోబర్ 24వ తేదీన స్వాతి నక్షత్రంలోకి సంచారం చేయబోతున్నాడని.. ఈ నక్షత్రానికి అధిపతి రాహువు కావడం విశేషమని ఆయన చెబుతున్నారు. ముఖ్యంగా సూర్యగ్రహం దాదాపు నవంబర్ 8వ తేదీ వరకు అదే నక్షత్రంలో సంచార దశలో కొనసాగబోతున్నాడు. దీని కారణంగా కొన్ని రాశుల వారికి వృత్తి తో పాటు ఆర్థిక పరిస్థితులు చాలా వరకు మెరుగుపడబోతున్నాయి. ముఖ్యంగా కొత్త అవకాశాలు లభించడమే కాకుండా.. అనుకున్న లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. అయితే, ఈ సమయంలో అద్భుతమైన లాభాలు పొందే రాశులేవో ఇప్పుడు మనం తెలుసుకుందాం..


ఈ రాశుల వారికి సూర్యుడి అనుగ్రహం..
మిధున రాశి 
స్వాతి నక్షత్రంలోకి సూర్యుడు ప్రవేశించడం వల్ల నవంబర్ 8వ తేదీ వరకు మిధున రాశి వారికి అద్భుతమైన పురోగతి లభించబోతోంది. ముఖ్యంగా ఉద్యోగాలు చేసే వారికి కొత్త కొత్త అవకాశాలు కూడా లభించబోతున్నాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. వీరికి ఉద్యోగంలో నాయకత్వ లక్షణాలు పెరిగి ఉన్నతాధికారుల నుంచి అద్భుతమైన సపోర్టు పొందగలుగుతారు. అంతేకాకుండా వ్యాపారాలు చేసే వారికి కొత్త ప్రాజెక్టులు కూడా లభించబోతున్నాయి. ఆర్థిక పరిస్థితులు గతంలో కంటే ఇప్పుడు మరింత మెరుగుపడే సూచనలు ఉన్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. కుటుంబ జీవితంలో కూడా అనేక రకాల సానుకూలమైన మార్పులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తులారాశి
తులా రాశిలో జన్మించిన వ్యక్తులకు సూర్యుడి నక్షత్ర సంచారం కారణంగా ఆర్థికంగా ఊహించని స్థాయిలో మార్పులు రాబోతున్నాయి. ముఖ్యంగా వీరికి వృత్తిపరమైన విషయాల్లో చాలా అనుకూలంగా ఉంటుందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. అంతేకాకుండా గతంలో నిలిచిపోయిన ప్రాజెక్టుల నుంచి కూడా అద్భుతమైన పురోగతి లభించబోతోంది. ఉద్యోగాలు చేసే వారికి కష్టానికి తగిన ప్రతిఫలాలు కూడా లభిస్తాయి. ముఖ్యంగా వ్యాపారవేత్తలకు ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉండబోతున్నదని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. కొత్త పరిచయాల వల్ల వ్యాపారాలను విస్తరించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంతే కాకుండా వ్యక్తిగత జీవితంలో పరస్పర అవగాహన పెరిగి ఊహించని మార్పులు పొందుతారు.

వృశ్చిక రాశి 
వృశ్చిక రాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్యులు నాగరాజ్ శర్మ తెలుపుతున్నారు. ముఖ్యంగా వృత్తి జీవితంలో అద్భుతమైన లాభాలు కలగడమే కాకుండా ఉద్యోగాలపరంగా కొత్త కొత్త బాధ్యతలు లభించబోతున్నాయి. అలాగే ఉద్యోగాలు చేసే వారికి వారి అధికారుల నుంచి అద్భుతమైన ప్రశంశాలు కూడా లభిస్తాయి. దీంతోపాటు ఉద్యోగం మారాలని ఆలోచిస్తున్న వ్యక్తులకు కొత్త అవకాశాలు కూడా లభించబోతున్నాయి. కొత్త పరిచయాలు భవిష్యత్తులోని లాభదాయకంగా మారవచ్చని జ్యోతిష్యులు నాగరాజు శర్మ చెబుతూ వస్తున్నారు. ముఖ్యంగా ఇతరులతో పెట్టుకున్న విభేదాలు కూడా ఈ సమయంలో పరిష్కారం అవుతాయి.

కుంభరాశి 
కుంభ రాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా సూర్యుడి నక్షత్ర సంచారం విశేషమైన గుర్తింపును తీసుకురాబోతోంది. ముఖ్యంగా వీరికి ఆదాయం విపరీతంగా పెరగడమే కాకుండా ఉద్యోగాలపరంగా అద్భుతమైన శుభవార్తలు వినబోతున్నారు. వ్యాపారంలో కొత్త ప్రణాళిక ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. దీని కారణంగా వీరికి ఆదాయ వనరులు కూడా విపరీతంగా పెరగబోతున్నాయి. ముఖ్యంగా పెట్టుబడుల నిర్ణయాలు అద్భుతమైన ఫలితాలను అందించబోతున్నాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. అలాగే వీరికి ఆత్మవిశ్వాసం కూడా అంచలంచలుగా పెరుగుతుంది. వ్యక్తిగత జీవితంలో కూడా సానుకూలమైన వాతావరణం ఏర్పడుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.

గమనిక..


 

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News
Telugu Astrology
Astrological Remedies