• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆధ్యాత్మికం
  • /రాహు గ్రహ సంచారంతో అదృష్టం మారనుందా? ఈ రాశుల వారికి కీలక సూచనలు..

రాహు గ్రహ సంచారంతో అదృష్టం మారనుందా? ఈ రాశుల వారికి కీలక సూచనలు..

Rahu Transit: డిసెంబర్ నెలలో రాహు గ్రహ సంచారంతో కొన్ని రాశుల వారికి ఈ సమయం ఎంతో లాభదాయకంగా మారబోతోందని జ్యోతిష్యులు నాగరాజ్ శర్మ తెలుపుతున్నారు. ముఖ్యంగా కోరుకుంటున్న కోరికలు కూడా చాలా వరకు నెరవేరి.. అనుకున్న ధన లాభాలు కూడా సొంతం చేసుకోగలుగుతారు. అలాగే ఆర్థికపరమైన నిర్ణయాలు కూడా తీసుకొని ఖర్చులు తగ్గించుకోగలుగుతారని ఆయన తెలుపుతున్నారు..

Reported ByDharmaraju Dhurishetty
Published: Oct 17, 2026, 09:00 AM IST|Updated: Oct 17, 2026, 09:02 AM IST
joinshare
రాహు గ్రహ సంచారంతో అదృష్టం మారనుందా? ఈ రాశుల వారికి కీలక సూచనలు..
Image Credit: ZEE TELUGU NEWS

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

Trending

  • News
  • Photos
  • Videos
BJP అగ్ర నేత LK అద్వానీకి తీవ్ర అస్వస్థత..

BJP అగ్ర నేత LK అద్వానీకి తీవ్ర అస్వస్థత..

2

రాహు గ్రహ సంచారంతో అదృష్టం మారనుందా? ఈ రాశుల వారికి కీలక సూచనలు..

3

డిసెంబర్ 5 నుంచి ఈ 4 రాశుల జీవితాల్లో మార్పులు? కేతువు సంచార ఫలితాలు ఇవే..

4

ఇంద్రకీలాద్రిపై ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు.. ఏడో రోజు మహాలక్ష్మి దేవిగా దుర్గమ్మ..

5

అక్టోబర్ 24న స్వాతి నక్షత్రంలోకి సూర్యుడు.. ఈ 4 రాశుల వారికి అదృష్టం కలిసొస్తుందా?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Rahu Transit Effect On Zodiacs: డిసెంబర్ ప్రారంభంలో రాహు సంచారం జ్యోతిష్య శాస్త్రం పరంగా చాలా ప్రత్యేకమైనదిగా ఉండబోతుందని ప్రముఖ జ్యోతిష్యులు నాగరాజ్ శర్మ తెలుపుతున్నారు. ముఖ్యంగా రాహు కుంభరాశిలో సంచార దశలో కొనసాగుతూ ఉన్నాడు.. ఇదిలా ఉంటే డిసెంబర్ ఐదవ తేదీన మకర రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. దీని ప్రభావం మొత్తం 12 రాశుల వారిపై పడబోతుందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ చెబుతున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో కొన్ని రాశుల వారు వృత్తి వ్యాపారాల పరంగా విశేషమైన ధన లాభాలు సొంతం చేసుకోగలుగుతారు. ఆర్థిక విషయాల్లో భారీ మొత్తంలో లాభాలు పొందగలుగుతారని.. కోరుకున్న కోరికలు కూడా చాలా వరకు నెరవేరబోతున్నాయని ఆయన చెబుతున్నారు. ప్రమాదకరమైన నిర్ణయాలను తీసుకోకుండా ముందుకు సాగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే, ఈ సమయంలో ఏ రాశుల వారికి లాభదాయకంగా ఉంటుందో తెలుసుకోండి.

ఈ రాశుల వారికి బంపర్ జాక్పాట్..
సింహరాశి 
రాహు సంచారంతో సింహ రాశి వారికి ఈ సమయం లాభదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారాలతో పాటు వృత్తిపరంగా అనేక రకాల మార్పులు వస్తాయి. ముఖ్యంగా కొత్త ప్రాజెక్టులు ప్రారంభించాలనుకునే వ్యక్తులకు ఈ సమయం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. పనుల్లో పురోగతి లభించి.. ముందుకెళ్తారని జ్యోతిష్యులు నాగరాజ్ శర్మ తెలుపుతున్నారు. ముఖ్యంగా ప్రజా సంబంధాలతో ముడిపడి ఉన్న వ్యక్తులకు గొప్ప గొప్ప పరిచయాలు కూడా ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపరడానికి ఈ సమయం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే వ్యాపారాలు చేస్తున్న వ్యక్తులకు అనుకున్న టార్గెట్లు రీచ్ అయ్యి.. డబ్బులు భారీ మొత్తంలో పొందుతారు. ఎలాంటి నిర్ణయాలు తీసుకున్న తొందరపడకుండా ముందుకెళ్లడం మంచిది.

వృశ్చిక రాశి 
వృశ్చిక రాశిలో జన్మించిన వ్యక్తులకు అద్భుతమైన అవకాశాలు రాబోతున్నాయి. శక్తివంతమైన రాహువు ప్రభావంతో విశేషమైన ప్రయోజనాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిజంగా చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బులతో పాటు ఎన్నో రకాల విషయాల్లో పురోగతి లభించబోతోంది. కొత్త మార్గాలు పొంది వృత్తిపరమైన జీవితంలో కూడా ముందుకు సాగుతారు. రాజకీయం వ్యాపారం ప్రజా సంబంధాల్లో ఉన్న వ్యక్తులకు దిమ్మతిరిగే ధన లాభాలు కలుగుతాయి. కృషికి తగ్గ ప్రతిఫలం కూడా లభించి.. అనుకోని ధన లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడడమే కాకుండా.. వ్యాపార వృద్ధి కోసం కొన్ని రకాల పెట్టుబడును కూడా పెట్టవచ్చు..

మీన రాశి 
మీనరాశిలో జన్మించిన వ్యక్తులకు రాహు మకర రాశిలోకి ప్రవేశించడం కారణంగా వీరికి వృత్తిపరంగా వ్యాపారాల పరంగా కొత్త కొత్త అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగాలతో పాటు ఇతర పనులు చేసే వ్యక్తులకు కొత్త బాధ్యతలు లభించబోతున్నాయి. వ్యాపార ప్రణాళికలు కూడా విస్తరించుకునే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా వీరికి ఈ సమయంలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది కాబట్టి.. ఎలాంటి పనులు చేసిన అద్భుతమైన విజయాలు సాధించగలుగుతారు. అలాగే ఖర్చులు కూడా పూర్తిగా తగ్గిపోయి.. అనుకోని ధన లాభాలు సొంతం చేసుకోగలుగుతారు. ముఖ్యంగా ఆర్థిక నిర్ణయాలు తెలివిగా తీసుకొని.. ఖర్చులు పూర్తిగా తగ్గించుకోగలుగుతారని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు..

గమనిక..


 

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu Astrology
Telugu News
Telugu Rasi Phalalu