అక్టోబర్ 11న చిత్రా నక్షత్రంలోకి సూర్యుడు.. ఈ 3 రాశుల వారికి అదృష్టం కలిసొస్తుందా?
Sun Transit Effect On Zodiac: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అక్టోబర్ 11వ తేదీన సూర్యుడు చిత్రా నక్షత్రంలోకి ప్రవేశించాడు. దీని కారణంగా కొన్ని రాశుల వారికి ఊహించని ప్రభావం పడుతుందని.. కోరుకున్న కోరికల్లో కూడా విజయాలు కలుగుతాయని జ్యోతిష్యులు నాగరాజ్ శర్మ తెలుపుతున్నారు. కోరుకుంటున్న కోరికలు కూడా పూర్తిగా నెరవేరబోతున్నాయి..
Sun Transit Effect On Zodiac: వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. కొన్ని గ్రహాలకు అద్భుతమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఆ గ్రహాలు సంచారం చేస్తే మొత్తం అన్ని రాశుల వారిపై ఊహించని ప్రభావం పడుతుంది. ముఖ్యంగా ఆర్థికంగా మార్పులు కూడా వస్తాయి. అలాగే అనుకోని పనుల్లో కూడా అద్భుతమైన విజయాలు సాధించే అవకాశాలుంటాయి.. ఇలాంటి గ్రహాల్లో సూర్యుడు కూడా ఒకటి.. ఈ గ్రహ శుభ ప్రభావంతో ఊహించని మార్పులు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా దీనిని గౌరవంతో పాటు కీర్తి ప్రతిష్టలు ఉన్నత స్థానానికి సూచికగా భావిస్తూ ఉంటారు. అలాంటిది ఈ గ్రహం అక్టోబర్ 11 ఆదివారం నక్షత్ర సంచారం చేసింది. చిత్రా నక్షత్రం లోకి సంచారం చేసిందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో నాలుగు రాశుల వారికి అద్భుతమైన ధన లాభాలు కలగడమే కాకుండా జీవితంలో మంచి రోజులు ప్రారంభం కాబోతున్నాయని ఆయన తెలిపారు. డబ్బు కోరత కూడా పూర్తిగా తీరిపోయి.. ఆర్థికంగా అదృష్టం లభించబోతోంది. సంపాదన కూడా విపరీతంగా పెరిగి ఉద్యోగాలు వ్యాపారాలపరంగా విజయాలు కూడా కలుగుతాయి.. జ్యోతిష్యులు నాగరాజ్ శర్మ తెలిపిన వివరాల ప్రకారం.. ఏ రాశుల వారికి ఎక్కువగా లాభాలు కలుగుతాయో తెలుసుకోండి..
ఈ రాశులవారికి బంపర్ లాభాలు:
వృశ్చిక రాశి
సూర్యుడి సంచార ప్రభావం కారణంగా వృశ్చిక రాశి వారికి కూడా ఈ సమయం చాలా సానుకూలంగా ఉండబోతుందని జ్యోతిష్యులు నాగరాజ శర్మ తెలుపుతున్నారు. ముఖ్యంగా వీరికి కష్టాల నుంచి విముక్తి లభించడమే కాకుండా.. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా విపరీతంగా పెరుగుతాయి. ఉద్యోగంలో కూడా అభివృద్ధి లభించి.. ప్రమోషన్స్ కూడా పొందగలుగుతారు. అలాగే వ్యాపారాలు చేసేవారు పెద్ద పెద్ద ఒప్పందాలు కూడా కుదుర్చుకుంటారు. ముఖ్యంగా వీరికి ఈ సమయంలో అద్భుతమైన లాభాలు కలగబోతున్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొని గొప్ప పురోగతి కూడా పొందగలుగుతారు.
సింహరాశి
సింహరాశి వారికి సూర్యుడు అధిపతిగా వ్యవహరిస్తూ ఉంటాడు. దీని కారణంగా వీరికి ఊహించని లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు నాగరాజ్ శర్మ తెలుపుతున్నారు. ముఖ్యంగా వీరికి జీవితంలో గొప్ప పురోగతి లభించే అవకాశాలు కూడా ఉన్నాయని.. వీరికి తప్పకుండా భారీ మొత్తంలో లాభాలు చేయకూరుతాయని ఆయన తెలిపారు. ముఖ్యంగా ఉద్యోగాలు చేసే వారికి అద్భుతమైన పదోన్నతులు కూడా కలుగుతాయి అన్నారు. కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటే.. ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుందన్నారు. తండ్రి నుంచి ఆస్తులు కూడా పొందగలుగుతారని.. వీరికి ఈ సమయం ఎంతో శుభ్రంగా మారబోతొందని ఆయన తెలుపుతున్నారు.
కన్యారాశి
చిత్రా నక్షత్రం లోకి సూర్యుడు ఈరోజే ప్రవేశించడం వల్ల కన్యా రాశి వారికి ఈ సమయం లాభదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా జీవితంలో అనేక సమస్యలు తొలగిపోవడమే కాకుండా కొత్త అవకాశాలు కూడా సొంతం చేసుకోగలుగుతారు. ఉద్యోగాలపరంగా బోలేడు లాభాలు కూడా కలుగుతాయి. కొత్త ఉద్యోగాలకు చేయాలనుకునే వారికి ఈ సమయంలో తప్పకుండా ఆఫర్స్ లెటర్స్ లభిస్తాయి. ముఖ్యంగా వ్యాపార వృద్ధి లభించి అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి. ఈ సమయంలో కోరుకుంటున్న కోరికలు కూడా చాలా వరకు నెరవేరబోతున్నాయి. చట్టపరమైన సమస్యల నుంచి కూడా వీరు తప్పకుండా బయటపడబోతున్నారని జ్యోతిష్యులు నాగరాజ శర్మ తెలుపుతున్నారు.
గమనిక..