SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Ganesh Chaturthi 2026: గణపతికి వినాయక చవితి ఒక్కరోజే పూజలో తులసీ దళం.. దీని వెనుక ఉన్న అసలు స్టోరీ ఏమిటంటే..?.

Tulasi usage in ganesh puja: విష్ణుమూర్తికి తులసీ దళం అత్యంత ప్రీతికరమైనది. అయితే ముఖ్యంగా వినాయక చవితి ఒక్కరోజు మాత్రమే పూజలో తులసీని ఉపయోగిస్తారు. దీని వెనకాల ఉన్న పురాణ గాథ ఏమిటో చూద్దాం.

Reported By Inamdar Paresh Written By Inamdar Paresh
Published: Sep 13, 2026, 12:42 PM IST | Updated: Sep 13, 2026, 12:49 PM IST
Image Credit: ganeshpuja(file)
Join

Tulasi Holy basil must offer on lord ganesh on Ganesh Chaturthi festival: దేశమంతట ఎక్కడ చూసిన వినాయక చవితి సంబరాలు అంబరాన్ని తాకాయి. మనం ఈసారి వినాయక చవితిని సెప్టెంబర్ 14న సోమవారం రోజున జరుపుకుంటాం. దీని కోసం ఊరువాడ, పల్లె, పట్నం తేడా లేకుండా  ప్రత్యేకంగా షెడ్డులను ఏర్పాటు చేసి వినాయకుడ్ని ప్రతిష్టించి చిన్నా, పెద్ద తేడా లేకుండా గణేష్ ఉత్సవాలను జరుపుకుంటారు.  ముఖ్యంగా వినాయక చవితి రోజున గణపయ్యకు 21 రకాల పత్రాలతో పూజిస్తారు. వీటిలో ముఖ్యంగా గరక అత్యంత ప్రధానమైనది. 

అయితే గణపయ్య  పూజలో వినాయక చవితి పండగ ఒక్కరోజు మాత్రమే పూజలో తులసీదళంను ఉపయోగిస్తారు. ఇతర సమయాల్లో మాత్రం తులసీ దళంను పూజలో ఉపయోగించరు. శ్రీ మహా విష్ణువుకు తులసీ దళం అత్యంత ప్రీతికరమైనది. అంతే కాకుండా ఏకదశి పర్వదినాల్లో తులసీ దళంను పూజలో తప్పనిసరిగా  ఉపయోగిస్తారు.

ఇతర రోజుల్లో తులసీ దళాలను ఎందుకు ఉపయోగించరు..

పూర్వకాలంలో.. హంసధ్వజుని పుత్రుడైన ధర్మధ్వజునికి విష్ణువు అంశ వలన తులసీ అనే పుత్రిక జన్మించింది. ఆమె ఒకసారి గంగా నదీ తీరంలో విహరిస్తున్నప్పుడు అటుగా వచ్చిన గణపతిని చూసి మోహిస్తుంది. తనను వివాహం చేసుకొమ్మని గణపతిని కోరింది. కానీ వినాయకుడు తిరస్కరించడంతో.. ఆగ్రహంతో తులసీ.. ‘దీర్ఘకాలం బ్రహ్మచారిగానే ఉండిపొమ్మ’ని గణపతిని శపిస్తుంది. 

 ఇక తనను అకారనంగా శపించినందుకు.. తులసీని వినాయకుడు.. ‘రాక్షసునికి జీవితాంతం బందీగా ఉండిపొమ్మని’ ప్రతిశాపం ఇచ్చాడు.  ఆతర్వాత తన తులసీ తన తప్పును తెలుసుకుని విష్ణుమూర్తిని వేడుకోగా శాపవిమోచనం పొంది తులసీ వృక్షంగా అవతరిస్తావని అనుగ్రహిస్తాడు. ఆతర్వాత తులసీ..శంఖచూడుడనే రాక్షసున్ని తులసీ వివాహమాడుతుంది. 

అయితే, తులసీదేవి పాతివ్రత్య మహిమ వల్ల శంఖచూడుణ్ని ఎవరూ జయించలేకపోతారు. ఆ తర్వాత వినాయకుడి వల్ల తులసీకి వ్రత భంగం అవుతుంది. ఆ విధంగా శంఖచూడుణ్ని ఇంద్రాది దేవతలు సంహరిస్తారు . అప్పుడు తులసీ కోపంతో వినాయకుడికి మరల శాపం ఇవ్వబోగా.. దేవతల అనుగ్రహంతో గతం ఆమెకు గుర్తుకు వస్తుంది. 

 తులసీ తనను ఎల్లప్పుడు విష్ణుమూర్తి సేవలో తరించేలా వరం కోరుకుంది. అంతే కాకుండా.. ఏడాదికి ఒక్కసారి వినాయక చవితి  రోజున గణపయ్య పూజలో భాగమయ్యేలా వరం కోరుకుంది. అప్పటి నుంచి కేవలం ఏడాదికి ఒక్కరోజు మాత్రమే గణపయ్యపూజలో తులసీని పూజించడంమనం ఆనవాయితీగా పాటిస్తు వస్తున్నాం.

 

Add Zee News as a Preferred Source

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES