SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Undrallu Benefits: వినాయకుడికి ఇష్టమైన ఉండ్రాళ్లు తింటే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా?

Undrallu Benefits In Telugu: వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళను తినడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో మీకు తెలుసా? తప్పకుండా తెలుసుకోవాల్సిందే.. ఉండ్రాళ్లను తినడం వల్ల అందులో లభించే కార్బోహైడ్రేట్లు, పీచు పదార్థం శరీరానికి బోలెడు లాభాలు అందిస్తుంది. ముఖ్యంగా మలబద్ధకాన్ని నివారించి.. రక్తహీనత సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.

Reported By Dharmaraju Dhurishetty Written By Dharmaraju Dhurishetty
Published: Sep 14, 2026, 02:04 PM IST | Updated: Sep 14, 2026, 02:06 PM IST
Image Credit: వినాయకుడికి ఇష్టమైన ఉండ్రాళ్లు తింటే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా?
Join

Undrallu Benefits In Telugu: వినాయక చవితి వచ్చిందంటే చాలు పూజ గదిలో ఉండ్రాళ్ల ఘుమఘుమలు నిండిపోతాయి.. వినాయకుడికి అత్యంత ఇష్టమైన ఈ నైవేద్యం కేవలం ఆధ్యాత్మిక సాంప్రదాయం మాత్రమే కాదని మీకు తెలుసా.. వీటిల్లో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో రకాల అద్భుతమైన పోషకాలు నిండి ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. తక్కువ కేలరీల తో పాటు అధిక పోషక విలువలు ఉండేలా మన పూర్వీకులు రూపొందించిన ఈ సాంప్రదాయం వంటకం శరీరానికి ఎన్నో రకాలుగా ప్రయోజనాలనుందిస్తుంది. ఈ నైవేద్యాన్ని తీసుకోవడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..


ఉండ్రాళ్ల తయారీలో ఎలాంటి నూనెతో పాటు నెయ్యి అస్సలు వినియోగించరు.. వీటిని పూర్తిగా ఆవిరి పైనే ఎంతో సేపు ఉడికిస్తూ ఉంటారు. ఆవిరి ద్వారా వన్డే ఆహారాల్లో పోషకాలు ఏమాత్రం నశించకుండా సహజ రూపంలో శరీరానికి అందుతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. నూనె శాతం శూన్యం కావడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ చేరే ప్రమాదం కూడా అస్సలు ఉండదు. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడం తో పాటు ఎంతగానో శరీరానికి సహాయపడుతుంది..

మలబద్ధక సమస్యలకు చెక్..
ఉండ్రాళ్ల తయారీలో ఉపయోగించే బియ్యపు రవ్వ.. పెసరపప్పు శరీరానికి సమతుల్యమైన శక్తిని అందించేందుకు ఎంతగానో సహాయపడుతుంది. బియ్యపు రవ్వ లోని అద్భుతమైన కార్బోహైడ్రేట్లు శరీరానికి అవసరమైన తక్షణమైన శక్తిని అందించేందుకు క్రియాశీలక పాత్ర పోషిస్తాయి. అలాగే పెసరపప్పులో ఉండే ఫైబర్ తో పాటు ఇతర పోషకాలు జీర్ణ క్రియను వేగవంతంగా చేసేందుకు సహాయపడతాయి.. ఈ ఫైబర్ పేగుల కదలికలను మెరుగుపరిచి.. దీర్ఘకాలిక మలబద్ధకంతో పాటు అజీర్ణం, గ్యాస్ట్రిక్ వంటి సమస్యలను సమర్థవంతంగా తగ్గించేందుకు సహాయపడుతుంది.

రక్తహీనతకు విరుగుడు..
తీపి ఉండ్రాళ్లలో పంచదారకు బదులుగా స్వచ్ఛమైన బెల్లాన్ని వినియోగించడం చాలా మంచిది. ఎందుకంటే బెల్లం లో ఐరన్ తో పాటు మెగ్నీషియం యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.. రక్తహీనతతో బాధపడే వారికి.. మహిళలకు ఇది సహజ ఔషధంగా పనిచేస్తుంది. శరీరంలోని హీమోగ్లోబిన్ స్థాయిలను పెంచి.. రక్త ప్రసరణను మెరుగుపరిచేందుకు ఎంతగానో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఉండ్రాళ్ళు సులభంగా అరిగిపోతూ ఉంటాయి కాబట్టి చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ఎవరైనా తినొచ్చు. బరువు తగ్గాలనుకునేవారు.. తేలికపాటి ఆహారం తినాలనుకునే వారికి ఈ ఉండ్రాళ్లు ఎంతో మంచివి. పండగపూట మాత్రమే కాకుండా.. సాధారణ రోజుల్లో కూడా ఉదయం అల్పాహారంగా ఉండ్రాళ్ళను అలవాటు చేసుకుంటే రోగనిరోధక శక్తి బలపడుతుందని పోషకాహార నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా మలబద్ధకం సమస్యలు దరిచేరకుండా ఉంటాయని వారంటున్నారు.
 

ఇది కూడా చదవండి..: అత్యవసరమైతే తప్ప బయటకు రాకండి...

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..

Add Zee News as a Preferred Source

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

ZEENEWS TRENDING STORIES