• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆధ్యాత్మికం
  • /ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఈ 5 వస్తువులు ఉంచితే.. అదృష్టం, లక్ష్మీదేవి కటాక్షం ఖాయం!

ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఈ 5 వస్తువులు ఉంచితే.. అదృష్టం, లక్ష్మీదేవి కటాక్షం ఖాయం!

ఇంట్లో వాస్తు దోషాలు లేకుండా ఉండేందుకు వాస్తు ప్రకారమే ఇంటి నిర్మాణాలు చేపడతాం. అయితే ఇంట్లోని వస్తువులను కూడా అదే విధంగా అమర్చుకోవాలి. ఇంటి ప్రధాన ద్వారం వద్ద 5 వస్తువులు ఉన్నాయంటే మీకు అదృష్టం కలిసి వస్తుంది. అవేంటో తెలుసుకుందాం.

Written ByRenuka Godugu
Published: Nov 09, 2026, 09:10 PM IST|Updated: Nov 09, 2026, 09:12 PM IST
joinshare
ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఈ 5 వస్తువులు ఉంచితే.. అదృష్టం, లక్ష్మీదేవి కటాక్షం ఖాయం!
Image Credit: Vastu Tips For Home Entrance:

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
Praja Balam Yatra: సంక్రాంతి పండుగ తర్వాత 'ప్రజాబలం'తో తెలంగాణ ప్రజల్లోకి వెళ్తా: రేవంత్‌ రెడ్డి

Praja Balam Yatra: సంక్రాంతి పండుగ తర్వాత 'ప్రజాబలం'తో తెలంగాణ ప్రజల్లోకి వెళ్తా: రేవంత్‌ రెడ్డి

2

ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఈ 5 వస్తువులు ఉంచితే.. అదృష్టం, లక్ష్మీదేవి కటాక్షం ఖాయం!

3

Cancer Drug Price Cut: క్యాన్సర్ రోగులకు కేంద్రం భారీ ఊరట.. 137 రకాల మందుల ధరలు 96.45 శాతం వరకు తగ్గింపు!

4

సీపీఎస్ ఉద్యోగుల సంచలన నిర్ణయం.. నవంబర్ 17న సామూహిక సెలవులకు దరఖాస్తు..!!

5

ఎయిర్‌టెల్ బంపర్ ప్లాన్.. డెయిలీ 2.5GB డేటా.. ఉచితంగా ప్రైమ్ లైట్ సహా 18+ OTTలు!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Vastu Tips For Home Entrance: ఇంట్లో ఏ పని చేసినా అదృష్టం కలిసి రావాలని, ఆర్థికంగా బాగుపడాలని అందరూ కోరుకుంటారు. ఈ నేపథ్యంలో తగిన పరిహారాలు కూడా చేసుకుంటూ ఉంటారు. వాస్తు ప్రకారం కొన్ని వస్తువులను ఇంట్లో ఉంచడం వల్ల ఆర్థికంగా కలిసి వస్తుంది. ప్రధాన ద్వారం వద్ద ఈ ఐదు వస్తువులు ఉన్నాయంటే మీకు అదృష్టం కలిసి వస్తుంది, ఇంట్లో సుఖశాంతులు వెల్లివిరుస్తాయి. ప్రధానంగా ఇంటి ప్రధాన ద్వారం ద్వారానే ఇంట్లోకి ప్రవేశిస్తాం కాబట్టి, వాస్తు ప్రకారం ఇవి ఇంటికి శుభాన్ని అందిస్తాయి.

నేమ్ ప్లేట్..
ఇంటి ప్రధాన ద్వారానికి నేమ్ ప్లేట్ ఉండటం ఆ ఇంటికి శుభకరం. ఇది వాస్తు ప్రకారం ఇంటికి ఎనర్జీని పెంచుతుంది. నేమ్ ప్లేట్ ఎప్పుడూ శుభ్రంగా, చదివేలా ఉండేలా కలపతో, మెటల్ లేదా రాతితో తయారుచేసినది ఏర్పాటు చేసుకోవాలి. దెబ్బతిన్న నేమ్ ప్లేట్‌లో ఏదైనా అక్షరం మిస్సయినా దాన్ని మార్చడం మంచిది, లేకపోతే అవకాశాలు తగ్గిపోయి అన్నీ కోల్పోయే ప్రమాదం ఉంది.

స్వస్తిక్ లేదా ఓం..
ఇంటి ప్రధాన ద్వారానికి స్వస్తిక్ లేదా ఓం గుర్తు రాయడం వల్ల ఇంట్లో సానుకూలత పెరుగుతుంది, ధనాకర్షణ కూడా పెరుగుతుంది. అంతేకాదు దేవుళ్ల ఆశీర్వాదం లభిస్తుంది, ఇంట్లోవారి మధ్య సఖ్యత పెరుగుతుంది. ఎన్నో ఏళ్లుగా హిందూ మతంలో ఈ స్వస్తిక్ గుర్తును పసుపు, వెర్మిలియన్ లేదా కుంకుమతో రాస్తూ వస్తున్నారు.

తోరణం..
ప్రతి పండుగకు ఇంటిని మామిడి ఆకులు, పూలతో అలంకరించుకుంటాం. అయితే ఇంటి ప్రధాన ద్వారానికి ఎప్పుడూ మామిడి ఆకుల తోరణం ఉండేలా చూసుకోవాలి. అదే విధంగా బంతిపూలు లేదా ఇతర పూలతో కూడా అలంకరించుకోవచ్చు. సాధారణంగా ఇది ప్రధాన ద్వారానికి ఏర్పాటు చేసుకుంటారు. వాస్తు ప్రకారం ఇలా చేయడం వల్ల ఇంట్లో నుంచి ప్రతికూలత తొలగిపోయి సానుకూలత ప్రవేశిస్తుంది. సహజమైన తోరణాలకు ప్రాధాన్యత ఇవ్వండి, ప్లాస్టిక్ వంటివి ఉపయోగించకుండా ఉండండి...

డోర్ మ్యాట్..
సాధారణంగా డోర్ మ్యాట్‌ను ఇంటి ప్రధాన ద్వారం బయట ఏర్పాటు చేసుకుంటారు. వాస్తు ప్రకారం ఇది తప్పనిసరి. డోర్ మ్యాట్ కూడా ఇంట్లోకి ప్రతికూల శక్తి ప్రవేశించకుండా కాపాడుతుంది. ఆ డోర్ మ్యాట్ ఎప్పుడూ శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. ఇది ప్రతికూల శక్తిని ఇంట్లోకి రానీయకుండా ఆపుతుంది..

మొక్కలు..
అంతేకాదు, ఇంటి ప్రధాన ద్వారం వద్ద కొన్ని మొక్కలు ఏర్పాటు చేసుకోవాలి. తులసి, జెడ్ ప్లాంట్ వంటివి ఉండటం వల్ల ఇంటికి మంచి జరుగుతుంది. వీటిని ఎప్పుడూ శుభ్రంగా, కాలుష్యం లేకుండా చూసుకోండి. ఇది ఇంటికి అదృష్టాన్ని తెస్తుంది. వాస్తు ప్రకారం ఇవి ఎప్పుడూ పచ్చగా ఉండేలా చూసుకోవాలి, ఎండిపోయిన మొక్కలు ఉండకూడదు.

ఈ వస్తువులతో పాటు ఇంట్లోకి సరైన వెలుతురు ప్రసరించేలా ఉండాలి. వాస్తు ప్రకారం ఇంటి ప్రవేశ ద్వారం సానుకూల శక్తి ప్రవహించేలా ఉండాలి. ప్రధాన ద్వారాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి, తద్వారా ఇంట్లోకి సానుకూలత ప్రవేశించి సుఖశాంతులు వెల్లివిరుస్తాయి.(Disclaimer: ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం సాధారణ నమ్మకాలు, పంచాంగాలు, జ్యోతిష్య అభిప్రాయాల ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. దీనిని శాస్త్రీయంగా నిర్ధారించబడిన సమాచారంగా పరిగణించరాదు. ఈ సమాచారాన్ని మా Zee Telugu News స్వతంత్రంగా ధృవీకరించలేదు.)

Add Zee News as a Preferred Source
TAGS:
Vastu Tips
Telugu Astrology
Astrological Remedies
Telugu News