• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /సీపీఎస్ ఉద్యోగుల సంచలన నిర్ణయం.. నవంబర్ 17న సామూహిక సెలవులకు దరఖాస్తు..!!

సీపీఎస్ ఉద్యోగుల సంచలన నిర్ణయం.. నవంబర్ 17న సామూహిక సెలవులకు దరఖాస్తు..!!

TSCPSEU: మాటిచ్చి తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం పై ఉద్యోగులు కదం తొక్కారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టో డే అయిన నవంబర్ 17వ తేదీన సామూహిక సెలవులు పెట్టేందుకు దరఖాస్తు చేసుకున్నారు.

Written ByBhoomi
Published: Nov 09, 2026, 09:00 PM IST|Updated: Nov 09, 2026, 09:09 PM IST
joinshare
సీపీఎస్ ఉద్యోగుల సంచలన నిర్ణయం.. నవంబర్ 17న సామూహిక సెలవులకు దరఖాస్తు..!!
Image Credit: TSCPSEU mass leave protest

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
Praja Balam Yatra: సంక్రాంతి పండుగ తర్వాత 'ప్రజాబలం'తో తెలంగాణ ప్రజల్లోకి వెళ్తా: రేవంత్‌ రెడ్డి

Praja Balam Yatra: సంక్రాంతి పండుగ తర్వాత 'ప్రజాబలం'తో తెలంగాణ ప్రజల్లోకి వెళ్తా: రేవంత్‌ రెడ్డి

2

ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఈ 5 వస్తువులు ఉంచితే.. అదృష్టం, లక్ష్మీదేవి కటాక్షం ఖాయం!

3

Cancer Drug Price Cut: క్యాన్సర్ రోగులకు కేంద్రం భారీ ఊరట.. 137 రకాల మందుల ధరలు 96.45 శాతం వరకు తగ్గింపు!

4

సీపీఎస్ ఉద్యోగుల సంచలన నిర్ణయం.. నవంబర్ 17న సామూహిక సెలవులకు దరఖాస్తు..!!

5

ఎయిర్‌టెల్ బంపర్ ప్లాన్.. డెయిలీ 2.5GB డేటా.. ఉచితంగా ప్రైమ్ లైట్ సహా 18+ OTTలు!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.


TSCPSEU: మాటిచ్చి తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం పై ఉద్యోగులు కదం తొక్కారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టో డే అయిన నవంబర్ 17వ తేదీన సామూహిక సెలవులు పెట్టేందుకు దరఖాస్తు చేసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పిందని.. అందుకే నవంబర్ 17వ తేదీ నుంచి సామూహిక సెలవులు పెడుతున్నట్లు ఉద్యోగులు అల్టిమేటం జారీ చేశారు.  

తెలంగాణ స్టేట్ కాంట్రీబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగుల సంఘం (TSCPSEU) పిలుపు మేరకు.. సీపీఎస్ విధానానికి వ్యతిరేకంగా.. తమ డిమాండ్ల సాధన కోసం ఉద్యోగులు ఉద్యమ బాటపట్టారు. దీనిలో భాగంగానే నవంబర్ 17వ తేదీన చేపట్టనున్న సామూహిక సెలవుల నిరసన కార్యక్రమానికి సంఘీభావంగా.. నల్లగొండ జిల్లా కేంద్రంలో సీపీఎస్ ఉద్యోగులు పెద్దెత్తున సన్నద్ధమయ్యారు.

ఈ నిరసన కార్యాచరణలో భాగంగా సోమవారం నల్లగొండ జిల్లా కేంద్రంలో TSCPSEU రాష్ట్ర ఉపాధ్యక్షుడు కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ ఐటీఐ, జిల్లా పరిషత్ కార్యాలయంలో పనిచేస్తున్న సీపీఎస్ ఉద్యోగులందరూ ఏకతాటిపైకి వచ్చి సామూహిక సెలవులకు సంబంధించిన దరఖాస్తులను అందజేశారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్ నరసింహ చారికి ఉద్యోగులు తమ సామూహిక సెలవు అప్లికేషన్‌ను అధికారికంగా అందజేసి నిరసన తెలిపారు.

ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు తమ పోరాటాన్ని ఆపేది లేదని ఈ సందర్భంగా ఉద్యోగులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకుడు చిలకరాజు శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షుడు హేమంత్, జిల్లా మహిళా కార్యదర్శి రేణుక, మహిళా కార్యదర్శి శిరీషలతో పాటు హరిప్రసాద్, లెనిన్, అనిల్ రెడ్డి, సుభాష్, శ్రవణ్, స్వప్న, మౌనిక తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. రానున్న రోజుల్లో ఈ ఆందోళనలను మరింత ఉద్ధృతం చేస్తామని ఉద్యోగ సంఘాల నాయకులు హెచ్చరించారు.

Also Read: 

ఉద్యోగులకు సుప్రీం బిగ్ షాక్.. ఆ ఒక్క తప్పు చేస్తే ఇక నేరుగా సస్పెన్షనే..!!

తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు.. రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు జైలు శిక్ష..!!

Add Zee News as a Preferred Source
TAGS:
Employees
Telugu News
Revanth Reddy
Telangana News