SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

దీపావళి తర్వాత ఈ రాశుల జాతకం మారబోతోంది.. శుక్రుడి ఎఫెక్ట్‌తో భారీ ధనలాభాలు!

Venus Direct Effect: శుక్రుడు సక్రమ మార్గంలోకి రావడం వల్ల ఈ కింది రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. నవంబర్‌ 14వ తేది నుంచి ఆర్థికంగా అనేక రకాల లాభాలు కలుగుతాయి. కోరుకున్న కోరికలు కూడా చాలా వరకు నెరవేరుతాయి.

Written By Dharmaraju Dhurishetty
Published: Nov 09, 2026, 09:02 AM IST | Updated: Nov 09, 2026, 09:04 AM IST
Image Credit: ZEE TELUGU NEWS
Join

Venus Direct Effect: దీపావళి తర్వాత పలు రాశులవారికి అద్భుతమైన శుభ యోగం ఉందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. శుక్రగ్రహం సక్రమ మార్గంలోకి రావడం వల్ల కొన్ని కొన్ని రాశులవారికి మంచి రోజులు ప్రారంభం కాబోతున్నాయి. ఇదిలా ఉంటే శుక్రుడిని సంపదతో పాటు ప్రేమ, వైవాహిక జీవితానికి సూచికగా భావిస్తూ ఉంటారు. దీంతో శుక్రుడి గమనంలో మార్పులు రావడం వల్ల 12 రాశులు ప్రభావితమవుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా నవంబర్‌ 14వ తేది నుంచి కొన్ని రాశులవారికి బంపర్‌ లాభాలు కూడా కలుగుతాయి. ఆర్థికంగా వస్తున్న సమస్యలు కూడా చాలా వరకు పరిష్కారమవుతాయి. కోరుకున్న కోరికలు కూడా నెరవేరే ఛాన్స్‌లు లభిస్తున్నాయి. అయితే, ఈ సమయంలో ఏయే రాశులవారికి బంపర్‌ లాభాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఈ రాశులవారికి శుక్రుడి అనుగ్రహం..
కుంభరాశి
శుక్రుడు సక్రమ మార్గంలోకి రావడం వల్ల కుంభ రాశివారికి పురోగతి పరంగా కూడా అద్భుతమైన విజయాలు కలుగుతాయి. ఉద్యోగాల పరంగా పదోన్నతులు కూడా సులభంగా లభిస్తాయి. అంతేకాకుండా కొత్త కొత్త బాధ్యతలు లభించడంతో ఊహించని విజయాలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే, వీరు ఈ సమయంలో తప్పకుండా ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

తులారాశి
తులారాశివారికి శుక్రుడు అధిపతిగా వ్యవహరిస్తూ ఉంటాడు. శుక్రుడు సక్రమ మార్గంలోకి వెళ్లడం వల్ల తులా రాశివారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. పని ప్రదేశాల్లో వీరికి మాటలకు విలువ కూడా ఊహించని రీతిలో పెరుగుతుంది. ఉద్యోగాలు మారాలని చూస్తున్నవారికి అద్భుతమైన ప్రయోజనాలు కలిగే అవకాశాలు కూడా లభిస్తాయి. వ్యాపారాలు చేసేవారికి ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా వీరు తప్పకుండా కొత్త ఆదాయ మార్గాలు కూడా సులభంగా పొందుతారు.

కన్యరాశి
శుక్రుడి సంచారంతో కన్యా రాశివారికి కూడా అద్భుతమైన అవకాశాలు లబిస్తాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ఉద్యోగంలో అవకాశాలు లభించడమే కాకుండా కొత్త బాధ్యతలు పొందుతారు. ముఖ్యంగా వ్యాపారాలు చేసేవారికి సంబంధాలు కూడా చాలా వరకు మెరుగుపడతాయి. అంతేకాకుండా కుటుంబ సభ్యులతో బయటకి వెళ్లడం వల్ల ఖర్చులు కూడా ఊహించని స్థాయిలో పెరుగుతాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు.

మేషరాశి
శుక్ర గ్రహ సంచారంతో మేష రాశివారికి అనేక రకాల ఆర్థిక ఇబ్బందుల నుంచి విముక్తి లభిస్తుంది. అంతేకాకుండా పై అధికారుల నుంచి సపోర్ట్‌ కూడా లభించే ఛాన్స్‌లు ఉన్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. పనుల్లో అద్భుతమైన ప్రశంసలు కూడా లభిస్తాయి. ఈ శుక్రుడి సంచారంతో వస్తున్న ఇబ్బందులు కూడా చాలా వరకు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. పనుల్లో అద్భుతమైన ప్రశంసలు కూడా సులభంగా లభిస్తాయి. ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుంది.

NOTE:

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

ZEENEWS TRENDING STORIES