• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆధ్యాత్మికం
  • /నవంబర్ 14 నుంచి అదృష్టం తలుపు తట్టబోతోంది.. శుక్రుడి ఎఫెక్ట్‌తో ఈ రాశుల వారికి శుభవార్తలు!

నవంబర్ 14 నుంచి అదృష్టం తలుపు తట్టబోతోంది.. శుక్రుడి ఎఫెక్ట్‌తో ఈ రాశుల వారికి శుభవార్తలు!

Venus Direct Effect: నవంబర్ 14వ తేదీన శుక్రుడు సక్రమ మార్గంలోకి రాబోతున్నాడు. అయితే ఇది కొన్ని రాశుల వారికి ప్రయోజనకరంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. కోరుకున్న కోరికలు నెరవేరడమే కాకుండా అనుకున్న పనుల్లో విజయాలు కూడా సాధించగలుగుతారు. ముఖ్యంగా దీర్ఘకాలిక సమస్యలు దూరమవుతాయి.

Written ByDharmaraju Dhurishetty
Published: Nov 15, 2026, 08:20 AM IST|Updated: Nov 15, 2026, 08:22 AM IST
joinshare
నవంబర్ 14 నుంచి అదృష్టం తలుపు తట్టబోతోంది.. శుక్రుడి ఎఫెక్ట్‌తో ఈ రాశుల వారికి శుభవార్తలు!
Image Credit: ZEE TELUGU NEWS

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
అదుర్స్‌కు సీక్వెల్‌గా ఎన్టీఆర్, అనిల్ రావిపూడి మూవీ ..?

అదుర్స్‌కు సీక్వెల్‌గా ఎన్టీఆర్, అనిల్ రావిపూడి మూవీ ..?

2

కార్తీక మాసంలో దీపదానం ఎలా చేయాలి? ఎవరికి దానం చేస్తే పుణ్యఫలం కలుగుతుంది?

3

తెలంగాణకు తుఫాన్ ఎఫెక్ట్.. నవంబర్ 20 నుంచి 22 వరకు భారీ వర్షాలు.. ఈ 6 జిల్లాలకు అలర్ట్!

4

కార్తీక మాసంలో తులసి ముందు నెయ్యి దీపం ఎందుకు వెలిగిస్తారు? అసలు రహస్యం ఇదే!

5

పుతిన్ దెబ్బకు భారీగా తగ్గిన గోల్డ్ రేట్స్..నేటి ధరలు ఎలా ఉన్నాయంటే..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Venus Direct Effect: జ్యోతిష్య శాస్త్రం పరంగా శుక్రుడిని ఆనందంతో పాటు సంపద, ప్రేమ, వైవాహిక జీవితం, శ్రేయస్సుకు సూచికగా భావిస్తూ ఉంటారు. శుక్రుని స్థానంలో, గమనంలో మార్పులు అన్ని రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తూ ఉంటాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడు నవంబర్ 14వ తేదీన వక్రగతి నుంచి సక్రమ మార్గంలోకి రాబోతున్నాడు. దీని కారణంగా కొన్ని రాశుల వారికి ఊహించని పురోగతి లభించబోతుందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ముఖ్యంగా వక్రగతిలో ఉన్న సమయంలో కొన్ని రాశుల వారికి బంపర్ లాభాలు కలిగినప్పటికీ.. సక్రమ మార్గంలోకి రావడం వల్ల మరికొన్ని రాశుల వారికి ప్రయోజనాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. అయితే, శుక్రుడి మార్పు ఏ రాశుల వారికి అద్భుతంగా ఉంటుంది? పూర్తి వివరాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

శుక్రుడి అనుగ్రహం పొందే రాశులు..
మేషరాశి 
శుక్ర గ్రహం సక్రమ మార్గంలోకి రావడం కారణంగా మేషరాశి వారికి ఆర్థికంగా చాలా మేలు జరుగుతుంది. ఉద్యోగాలపరంగా ఉన్నతాధికారుల నుంచి సపోర్టు కూడా లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయాల్లో పనిచేసే చోట తప్పకుండా గౌరవ మర్యాదలు కూడా లభిస్తాయని జ్యోతిష్యులు నాగరాజ శర్మ తెలుపుతున్నారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం కూడా నెలకొంటుంది. అలాగే ఆధార వనరులు కూడా విపరీతంగా పెరుగుతాయి. పొదుపు కూడా పెరిగి.. అనుకున్న ఖర్చులు కూడా చేయగలుగుతారని జ్యోతిష్యులు చెబుతున్నారు..

కన్య రాశి 
కన్య రాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా శుక్రుడు సక్రమ మార్గంలోకి రావడం కారణంగా విశేషమైన ప్రయోజనాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ వెల్లడించారు. ఆర్థిక జీవితంలో కొత్త అవకాశాలు లభించడమే కాకుండా.. ఊహించని ధన లాభాలు కలుగుతాయని ఆయన అంటున్నారు. గతంలో ఎక్కడైనా ఇచ్చిన డబ్బులు కూడా తప్పకుండా ఈ సమయంలో తిరిగి పొందగలుగుతారు. ముఖ్యంగా ఉద్యోగాలు చేసే వ్యక్తులు ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తుంటే ఇదే అద్భుతమైన అవకాశంగా భావించవచ్చు. అలాగే ఒక కొత్త పరిచయాలు కూడా ఏర్పడే అవకాశాలున్నాయి. కుటుంబ సభ్యుల అవసరాలతో పాటు కోరికలను నెరవేర్చుకోవడం సులభతరం అవుతుంది..

తులారాశి 
తులారాశిలో జన్మించిన వ్యక్తులకు శుక్రుడు అధిపతిగా వ్యవహరిస్తాడు. కాబట్టి శుక్రుడి గమనంలో మార్పులు వీరికి చాలా ముఖ్యమైనదిగా భావించవచ్చు. ముఖ్యంగా వీరికి ఈ సమయంలో ఆత్మవిశ్వాసం విపరీతంగా పెరుగుతుంది. నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం కూడా ఊహించని స్థాయిలో పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే కొత్త ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వ్యక్తులకు ఈ సమయం లాభదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారాల్లో భారీ లాభాలు రావడం ప్రారంభమవుతాయని జ్యోతిష్యులు నాగరాజ్ శర్మ తెలుపుతున్నారు. అనుకున్న లాభాలు పొందడమే కాకుండా కొత్త ఆదాయ వనరులు కూడా సొంతం చేసుకోగలుగుతారు..

కుంభరాశి 
శుక్రుడి సక్రమ మార్గం కుంభరాశి వారికి కూడా అద్భుతమైన ఫలితాలను అందించబోతూ ఉందని జ్యోతిష్యులు నాగరాజ్ శర్మ తెలుపుతున్నారు. ముఖ్యంగా వీరికి ఉద్యోగాలపరంగా అద్భుతమైన పదవున్నతులు లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. పనుల్లో కొత్త బాధ్యతలు పొందడమే కాకుండా.. వ్యాపారాలు చేసే వారికి పెద్ద ఒప్పందాలనుంచి లాభాలు రావడం ప్రారంభమవుతాయి. ఆదాయాన్ని పెంచుకోవాలనుకునే వారికి ఈ సమయం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. పెట్టుబడులు పెట్టేముందు తప్పకుండా కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని జ్యోతిష్యులు నాగరాజా శర్మ తెలుపుతున్నారు..

NOTE:

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News
Telugu Astrology
Telugu Rasi Phalalu